Skip to main content

Posts

Featured Post

మధ్యతరగతిరికం - మరికొన్ని కోణాలు!

అమ్మో ఒకటో తారీఖు (2000) చలనచిత్రంలో ఎల్ బి శ్రీరామ్ గారు పదవ తరగతి పాసైన తన మూడో కూతురితో - "ఇహ నువ్వు చదువుకోవడం ఆపెయ్యమ్మా" అంటాడు. అందుకు ఆయన - "నువ్వు పది చదివి ఆపేస్తే నీకోసం ఒక ఇంటర్ చదివినవాడ్ని తెస్తే సరిపోతుంది, నువ్వు ఇంటర్ చదివితే ఒక డిగ్రీ చదివినవాడ్ని నీకోసం తేవాలి, అదే నువ్వు డిగ్రీ చదివితే అంతకుమించి చదివినవాడ్ని తేవాలి, అందుకు తగినంత కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యాలి. ఈ మధ్యతరగతి తండ్రి దగ్గర అంత స్థోమత లేదమ్మా. అందుకే నువ్వు చదువు మానెయ్యి" అంటాడు. ఆడపిల్ల పెళ్ళిని ఎప్పుడూ ఆమె స్థాయిని మించి చెయ్యాలనే కలలు కంటారు తనల్లిదండ్రులు, ఇప్పుడున్న ఆధునిక ఒంటరి సమాజంలో కూడా ఆడపిల్లలు తమకంటే ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా అధికస్థాయిలో ఉన్న పురుషులను వివాహం చేసుకోవడానికి (అంతెందుకు డేటింగ్, సహజీవనం వంటి ఆధునిక రోగాలకు కూడా!) మొగ్గుచూపుతున్నారు. ఈ మొత్తం ప్రకరణను "టెల్ యువర్ సన్స్ దిస్" అనే ఒక ట్విట్టర్ (ఎక్స్) వినియోగదారుడు - "ఆర్థిక అసమానతలకు ఎవరో కాదు స్త్రీలే ముఖ్యకారణం అంటాడు. ఫెమినిజంను అందుకు సాధన"మని చెబుతాడు. ఆయన ఇంకా కొనసాగిస్తూ
Recent posts

రాక్షసోత్తముడు

రాక్షసోత్తముడు, అనగా రాక్షసులలో ఉత్తముడు. రాక్షసులలో ఉత్తముడు ఏంటండీ? ఇదేదో తేడాగా ఉంది కదా! అంటే రాక్షసజాతిలో కూడా ఉత్తములు, మధ్యములు, & ఇంక అధములు ఉంటారని మనం అనుకోవాలి. రాక్షసులలో ఉత్తముడు అంటే ఎలా ఉంటాడు? ఒక్కొక్క జాతికీ కొన్ని గుణాలు సహజంగానే పుట్టుకతో అబ్బుతాయి. ఈ ప్రకారం ఆ ఫలానా జాతి గుణాలను నూటికి నూరుపాళ్ళు ప్రస్ఫుటం చేసే లక్షణాలు కలిగి ఉండడం ఉత్తమం; వెరసి ఆ వ్యక్తి ఉత్తముడు. అలానే రాక్షసప్రవృత్తికి దూరం జరిగినవాడు రాక్షసాధముడు, విభీషణుడు ఒక ఉదాహరణ. అయితే తిన్నింటివాసాలు లెక్కపెట్టడం రాక్షస లక్షణమే కదా! మరి ఇప్పుడు విభీషణుడిని రాక్షసులలో ఉత్తముడనాలా? లేక అధముడనాలా? లేక మధ్యస్థమా! రాక్షసజాతి లక్షణాలు పుష్కలంగా ఉన్నవాడు రావణుడు, కనుక అతను రాక్షసోత్తముడు. కనుక రాక్షసులకు ఇతడు మంచివాడు! కానీ మానవత్వం, సమానత్వం, ప్రజాస్వామ్యం అనే ఆధునిక పరికల్పనలు మన దృష్టిని కలుషితం చేశాయి. అందుకే మంచి అంటే ప్రతిచోటా ఒకటే అర్థం ఉంటుందనే భ్రాంతిలో మనం బ్రతుకుతున్నాము. అందుకే "మంచి క్రైస్తవుడి"గా ఉండమని ఒక క్రైస్తవుడికి, "మంచి మహ్మదీయు"నిగా ఉండమని ఒక మహ్మదీయునికి ధర్మోపదేశాలు

సంపాదన - ఉత్తములు, మధ్యములు & అధములు

మనం ఉత్తములను, మధ్యములను మరియు అధములను సంపాదన విషయంలో కూడా చూడొచ్చు! అవసరాలు మరియు కోర్కెలు తీరుతున్నంతసేపూ అందుకు కారణమైన సంపాదన ఎక్కడనుండి వస్తోందనే బెంగ ఉండదు, అదే అవసరాలు తీరడం బహు కష్టంగా ఉన్నప్పుడు వెంటనే డబ్బు వచ్చే మార్గాలకై సంఘర్షణ మొదలవుతుంది. ఇలాంటి కుటుంబాలు అధమ కుటుంబాలు. సమయస్ఫూర్తి కలిగిన కుటుంబాలు పైన పేర్కొన్న కుటుంబాల నుండి అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవడంలో కృతకృత్యం అవుతుంటాయి. ఇవి మధ్యమ కుటుంబాలు, మధ్యతరగతనే ఆర్థికవర్గం వెనకున్న ఆలోచన ఇది; ఈ విధంగా చూస్తే నేడు మధ్యతరగతి అనే వర్గం ఉన్నట్లుగా అనిపించడంలేదు! "నేడు గడిస్తేచాల"నుకోవడమే పేదరికానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇలాంటి కుటుంబాలు మధ్యతరగతిలో ఈనాడు ఎక్కువయ్యాయి; ఇవి సంపాదన విషయంలో మెరుగ్గా ఉన్నా దాన్ని ఖర్చు పెట్టే ఆలోచనల విషయంలో అధములుగానే మిగిలిపోయారు. పారిశ్రామికీకరణ కౌటుంబిక వ్యవస్థలో తెచ్చిన అనేక పెనుమార్పుల్లో ఇదొకటి. ఉమ్మడి పరివారం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పరిష్కారమని భావించారు పెద్దలు. కర్మాగారాలు వచ్చాయి గనుక, యంత్రాలే అన్ని చేస్తాయి గనుక, మనుషులు ఎక్కువగా అక్కర్లేదు, "ఎక్కువ చేతులు

ఐరోపా మహా అంతర్యుద్ధం - 1914

నేడు మనం అందరం మొదటి ప్రపంచ యుద్ధంగా పిలుస్తున్న లేదా గుర్తిస్తున్న యుద్ధానికి "ఐరోపా మహా అంతర్యుద్ధం" అని నామకరణం చేశారు అమెరికన్లు, యుద్ధం మొదలైన మొదట్లో! ఎందుకని? ఐరోపాలోని దేశాలు, ఎంపైర్లు (సామ్రాజ్యాలు అనడం సబబు కాదు!) ఎవరి అవసరార్థం వారు వారి శత్రువులుగా భావించిన వారితోనే యుద్ధాలు చేశారు తప్పితే ఒక ఐక్య లక్ష్యం కోసం యుద్ధం చేసిన దాఖలాలు కనిపించవు. బాల్కన్ ప్రాంతాలు బాల్కన్ యుద్ధం (భాషాధారిత దేశాలకై - ఒకటే మతం, ఒకటే శరీరఛాయ వారిని కలిపి ఉంచలేకపోయింది! తర్వాత్తర్వాత ఇదే బాల్కనైజేషన్కు దారితీసింది) చేస్తుంటే, ఫ్రెంచివారు జర్మనీపై ప్రతిదాడులు చేస్తున్నారు. బ్రిటిషర్లు తమ నౌకాశక్తిని మరియు కర్మాగారశక్తిని జర్మనీ ఎక్కడ నిర్వీర్యం (దాటేస్తుందో) చేస్తుందోనని దానిపై యుద్ధం ప్రకటిస్తే, డార్డనెల్లి మార్గంపై దాడి చేసి ఆస్ట్రియా హంగేరి ఎంపైర్ ఎక్కడ దాన్ని అదుపులోకి తీసుకుంటుందోనని రష్యన్లు ఆస్ట్రియా హంగేరి ఎంపైర్ పై యుద్ధానికి దిగారు. అప్పటికే క్రమంగా పతనమౌతున్న ఒట్టోమన్ ఎంపైర్లో అక్కడక్కడా మిగిలిన భూభాగాలను సొంతం చేసుకోవడానికి అరబ్బులు చిత్తకార్తి కుక్కల్లా యుద్ధంలోకి దిగుతారు. ఇక్

పురుషులు & వారి మంత్రాలోచనలు

హనుమ ధాటికి ఖిన్నుడై లంకానగర సచివులతో రావణుడు - పురుషులలో మరియు వారి మంత్రాలోచనల్లో మూడు శ్రేణులు ఉంటాయి - ఉత్తమ, మధ్యమ మరియు అధమ. ఉత్తమ పురుషుడు అనేవాడు తన హితాన్ని కోరేవాళ్ళను, సరైన ఆలోచనలు సమర్థంగా ఇచ్చే మంత్రులతోనూ, సుఖదుఃఖాలలో తోడుండే మిత్రులతోనూ, తన మేలును కోరుకునే బంధువర్గములతోనూ ఆలోచించి పనులను ఆరంభిస్తాడు, దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. మధ్యమ పురుషుడు తానొక్కడే కార్యనిర్వహణ గురించి ఆలోచించుకుని, ఆ విషయంలో మంచి చెడులు బేరీజు వేసుకుని, నిర్ణయం తీసుకుని, ఒంటరిగానే కార్యాచరణాన్ని మొదలుపెడతాడు. {కులాభివృద్దికి మతాభివృద్ధికి ఉన్నంతలో పాటుపడేవారు ఒంటరిగానే అన్నీ చేస్తుంటారు, వీరు మధ్యమ కోవలోకి వస్తారు!}  అధమ పురుషుడు గుణదోషాలను గురించి ఆలోచించకుండా, దైవాన్ని ఆశ్రయించకుండా (విస్మరించి), ఈ పనిని నేనొక్కడ్నే సాధించేస్తాను అనే ధీమాతో కార్యాన్ని ప్రారంభించి, ఆ పనిని పూర్తిచెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తాడు. {నాస్తికులు మరియు మనుషవాదులు (హ్యూమనిస్టులు), హేతువాదులు వగైరా అందరూ అధమ కోవలోకి వస్తారన్నమాట!} 🤣  ఇహ పురుషులు చేసే మంత్రాలోచనల దగ్గరికి; మంత్రులందరూ (నేటి పరిస్థితులకు అనుగు

వారధులు-సారథులు

అందరికీ సారథ్యం వహించాలనే అంశంపై మనకున్న ఆసక్తి వారధిని నిర్మించడం మీదుండదు; ఏమంటే వారధి నిర్మాణం శ్రద్ధతో కూడినది, సారథ్యం ఆసక్తి ఉంటే చాలు. మన లౌకిక చదువులు కూడా విద్యార్థులలో సారథ్యాన్ని ప్రోత్సహించే విధంగా శిక్షణ ఉంటుందని సొల్లు చెబుతుంటారు, మోసం చేస్తుంటారు. సారథి కావాలనుకునేవారిపై, సారథ్యం వహించేవారిపై నాకు ఎటువంటి వైషమ్యాలు లేవు. కానీ "ఎందుకు నువ్వు సారథివి కావాలని అనుకుంటున్నావు?" అని ఏ ఒక్కరినైనా అడగండి, నీళ్ళు నములుతారు. "నేను మిగిలినవారి కంటే ఈ అంశాల్లో ఘనుడను, ఆ అంశాలే ఇప్పుడు జాతికి అవసరం. కనుక నేను సారథ్యం వహిస్తే జాతి అభివృద్ధిపథంలో నడుస్తుంది" అని చెప్పే సాహసం ఒక్కడూ/ఒక్కత్తె కూడా చెయ్యలేదు. అలాగన్న మరుక్షణం నుండి దోషాలు ఎంచడంతో పాటు దూషణలపర్వం ఆరంభమవుతుందనే కారణం ఒకటైతే, అలా నిర్ద్వంద్వంగా ఉన్నదున్నట్లుగా చెప్పగలిగేతంట చేవగల్గిన నాయకులలేమి మరొక కారణం. ఇదీ ప్రజాస్వామ్యం, ఏ దేశం వెళ్ళినా ఇదే ప్రజాస్వామ్యం. వ్యాపారానికి, వృత్తికి, ఆరాధనకు మరియు రక్షణకు సయోధ్య కుదిర్చే వారధిగా మారడానికి ఒక్కరూ సిద్ధంగా లేకపోవడమే మన పతనానికి కారణం. నిత్యం వల్లె వేసే ఐకమత

మధ్యతరగతిరికం!

రేపటికి నేను పూర్తిస్థాయి ఉద్యోగం మొదలుపెట్టి దాదాపుగా, రోజుల వ్యత్యాసంతో, పదేళ్ళు కావొస్తోంది. ఈ పదేళ్ళలో నేను వెనకేసుకున్నది లేకపోయినా అక్క పెళ్ళికి చేసిన అప్పులు, నా గురించి ఆలోచించకుండా (మగాడిని కదా!) అమ్మేసిన తాతల నాటి ఆస్తులు, తినడానికిలేక పస్తులున్న దినాలు, బాడిగకు ఉంటున్న ఇళ్ళలో అద్దె కట్టడానికి కూడా పైసా డబ్బు లేని క్షణాల నుండి ఇవాళ్టికి బయటపడ్డాను. ఇహ మొత్తంగా ఒక లక్షా ముప్పైఆరువేల రూపాయల అప్పు మాత్రం మిగిలింది. ఇది తీర్చడం కాస్త తేలికైన పనే, ఇప్పుడున్న ఆదాయంతో! మా అక్క ఏదో ఇల్లు కట్టేసిన స్థలం చూసిందట, భూమితో కలిపి ఆ భవనం ఖరీదు పదకొండు లక్షలట, రెండుసార్లుగా ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించారు. మా అమ్మకు మనసాగడంలేదు, కొనమని బలవంతం. నేను అర్థం చేసుకోగలను, నా పూర్వవ్యాసం కూడా అందుబాటులో ఉండనే ఉంది. కొనగలను, కానీ నాలుగున్నర లక్షలు అప్పు చెయ్యాలి. పైగా ఆ భూమికి & ఇంటికి గృహఋణం దొరకదు, వైయక్తిక ఋణం ఖరీదైనది. అంటే ఆ అప్పు తీర్చడానికి నాకు దాదాపు మరొక నాలుగేళ్ళు పడుతుంది (అత్యధికంగా 24% వడ్డీ). "ఇల్లు అనేది ఒకటి కొం(ఉం)టే పెళ్ళికి పిల్ల దొరకడం సులభం అవుతుంద"ని మా అక్క పోర

యుద్ధసన్నద్ధత

అప్పటిదాకా సీతాదేవి కనిపిస్తుందో లేదోనని మధనపడుతున్న రామునికి ఎప్పుడైతే ఆంజనేయుడు "దృష్ట్వా సీతా" అంటాడో అప్పుడు వెనువెంటనే రావణుడితో సమరానికి సిద్ధమవ్వమని వానరగణానికి సూచనలు చేస్తాడు. ఎలా? నీలుడిని లక్షమంది వానరులతో కలిసి మిగిలిన సైన్యానికి దక్షిణసాగరం యొక్క ఉత్తరతీరానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపమని. అంటే ఈ దళం వానరసేనకు ముందుభాగంలో ఉంటుంది. అలానే నీలుడికి కొన్ని సూచనలు చేస్తాడు, అవి - ఆ మార్గంలో ఫలమూలాలు సమృద్ధిగా ఉండాలి, అలసి సేద దీరడానికి నీడనిచ్చే చెట్లు ఉండాలి, నీటికి & మధువులకు కొదవ ఉండరాదు. ఏ దేశమైనా సైన్యదళాలు యుద్ధానికి వెళ్ళాలంటే ఆహారం, ధాన్యాలు, నిల్వలు, ఆయుధాలు, ఇతరాలు ముఖ్యమైనవి; మిలిటరీ లాజిస్టిక్స్ అంటారు. రాముడికి యుద్ధకౌశలం ఎంతగా లేకుంటే చూసిన వెంటనే ఒకరి బలాబలాలను అంచనా వెయ్యడం, వారికి తగిన బాధ్యతలు అప్పగించడం, యుద్ధసామాగ్రి గురించి ముందస్తు సూచనలు చెయ్యడం, ఏమరపాటుగా ఉంటే ఎదుర్కొనే విపత్తుల గురించి చెప్పడం సామాన్యంగా కుదిరేది కాదు. రాముడి రణకౌశలం ముందు ఇంకా కనిపిస్తుంది. ఈ సైన్యానికి మార్గం చూపడం సరే, కానీ హనుమంతుడు చేసిన హంగామాకి రావణుడు ఏదో ఒక ఎత్తు

మధ్యతరగతిరికంలో ఇంకొక అధ్యాయం!

ధార్మికవివాహానికి లౌకికచట్టబద్ధత కల్పించడంలోని ఆంతర్యం నాకు ఎంత విచారించినా బోధపడలేదు, అంతకు మించి నాకు బోధపడని మరొక విషయం హిందువులలో ఈ వ్యవహారాన్ని ప్రశ్నించేవారు కరువవ్వడం! "వివాహం పెటాకులై విడాకులకు వెళితే అక్కరకు వస్తుంద"ని చెప్పేవారు కనపడ్డారు. వారిని - "హిందువులలో, క్రైస్తవులు మరియు మహ్మదీయులలో కూడా, వివాహం అయ్యాక విడాకులు అనే కల్పన లేద"నగానే మాట దాటేస్తున్నారు. ఇందుకు కారణం వారికి తెలియకపోయైనా ఉండాలి లేదా తెలిసైనా ఉండాలి. రెండూ ప్రమాదమే! తెలియకపోతే మనం మరీ అంత అమాయకంగా ఉన్నామని, తెలిసినా పట్టించుకోవడం లేదంటే మన కర్తవ్యాన్ని విస్మరించి ఆ బాధ్యతను లౌకికచట్టాలకు వదిలేస్తున్నామని. "నచ్చని భర్తతో/భార్యతో కలిసి కొట్టుకుంటూ/తిట్టుకుంటూ కాపురం చెయ్యడం కంటే విడాకులే మేల"నేవారు కూడా ఉన్నారు, అందులో నేను కూడా ఒకడ్ని! ఇక్కడ సమస్య విడాకులు కాదు; ధార్మిక ఆచారాలు, కర్మలు, కార్యక్రమాలతో అగ్నిసాక్షిగా (ఇవి వధూవరుల మతాలను బట్టి మారుతుంటాయి) చేసుకున్న వివాహంలో ఏర్పడిన కలతలకు లౌకికమైన పరిష్కారం ఇవ్వడమే సమస్య. వివాహం చేసుకునేప్పుడు కులం కావాలి, మతం కావాలి, ఆచారవ్యవహారాల

బేబీ (2023)

ఇలాంటి చిత్రమాలిక/దృశ్యకావ్యం మరొకటి ఇహపై రావడానికి మరొక ముప్పై సంవత్సరాలు పడుతుంది. ఇందులో నటించిన అందరికీ భవిష్యత్తులో మేలైన పాత్రలు లభిస్తాయి అనడంలో సందేహం అక్కర్లేదు, ఒక్క వైష్ణవీ చైతన్యకి తప్ప! నా దృష్టిలో ఆమొక సాహసం చేశారు. ఈ చిత్రరాజం ద్వారా మనిషి తనకు తానుగా విధించుకోవాల్సిన పరిమితులను, అనునిత్యం తన చుట్టూ పరచుకున్న పరిధులను గుర్తించాలనే నీతిని మరలా తెలియజెయ్యడం జరిగింది. ఇహ పాత్రల్లోకి వెళితే... "ప్రశ్నలే మిగిలాయి!" వైష్ణవి తండ్రి మద్యానికి బానిస అవ్వడం వలన ఆమె అతని మాటలు పెడచెవిన పెట్టిందా? లేదా వైష్ణవి తల్లి "ఆడపెత్తనం బోడి పెత్తనం" అనే సామెతకు అతికినట్లు సరిపోయింది కనుక ఇలా జరిగిందా? ఆ తండ్రి దేన్ని కోల్పోయి లేక ఏం సాధించలేక మద్యానికి బానిసగా మారుంటాడు? ఆమె తల్లి పెత్తనం అంతా తన భుజాలపై వేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? అందుకేనా వైష్ణవి అలా ప్రవర్తించింది? ఆమె తండ్రి జీవితంలో సఫలం అయ్యుంటే, ఆమె తల్లి తగుదునమ్మా అని అన్నింట్లో వేలు పెట్టకుండా ఉండుంటే, ఆమెలో వేరే పద్ధతి కనిపించేదా? ఏమో చెప్పలేం! "ఈమధ్య ఆడపిల్లలు ఇలానే ఉంటున్నారు!" అనేటప్పుడు కా

స్వామిభక్తిలో మెళకువలు

ఆంజనేయుడు రావణలంకానగరాన్ని విధ్వంసంగావించి తిరిగి దక్షిణసాగరాన్ని లంఘించి ఉత్తరతీరానున్న మహేంద్రగిరికి చేరుకున్నాక జాంబవంతుడు - "హనుమా! అక్కడ జరిగినవి జరిగినట్టుగా చెప్పు. దానినిబట్టి ప్రభువుల దగ్గర చెప్పాల్సినవి చెప్పకూడనివి ఏమైనా ఉంటే తెలుస్తుంది" అంటాడు. అది స్వామిభక్తి/ప్రభుభక్తి మెండుగా ఉన్న కాలం, అందులోనూ జాంబవంతుడి స్వామిభక్తిని ఇప్పటివరకూ ఎవ్వరూ శంకించే సాహసం చెయ్యలేదు. అలాంటివాడు ప్రభువుకు చెప్పకూడని అంశాలు ఉంటాయనే సూచన ఇస్తున్నాడు. వీరులు ఎంతటి గొప్పవారైనా వారు ప్రభువులకు దాసులు, దూతగా పంపబడిన దాసుడు మోసుకొచ్చే సమాచారం ప్రాణసంకటంగా మారుతుండడం అతి సహజం. అందునా మనోడు (ఆంజనేయుడు) చేసొచ్చింది లంకా దహనం, అశోకవన భూస్థాపనం. "సీతమ్మకు ఏమీ జరగలేదు, ఆమె క్షేమమే"ననే వ్యవధిలో కుత్తుక తెగడానికి అవకాశాలు అనేకం. పోనీ ఆ సంగతి రాముడికి చెప్పనేలేదా అంటే, ఉవ్వెత్తున ఎగసిన విరహ తాపాలు సర్దుమణిగిన పిదప చెప్పనే చెప్పాడు. అప్పటికి ఆవేశం చల్లారి, బుద్ధి పనిచెయ్యడం ప్రారంభమౌతుందని. అలాంటిది స్వామిభక్తి అనేది ఇసుమంతైనాలేని ఈకాలంలో చాడీలు చెప్పేవారు, యజమానికి గూఢచారిగా ఉండేవారు ఎంత

సమయాలు | కులధనం

అధునాతనం రాకమునుపు ఆవిష్కరణలు జరిగాయి అంటే ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉండము. ఆవిష్కరణ అనేది ఎటువంటిదైనాసరే దాని ఆవిర్భావానికి పెట్టుబడి విత్తం/ధనం ముఖ్యమైనది మరియు అంతకుమించి అవసరం అనే బీజాన్ని (విత్తనాన్ని) గుర్తించడం ఆవశ్యకం. ఈ అవసరం నుండే కొత్త కులాలు పుట్టుకొచ్చేవి, తగినట్లుగా కులపురాణాలు! వేసుకున్న బట్టలు ఉతకడానికి రజక/చాకలి కులం, ఆ కులానికి సమాజంలో తగిన ప్రాధాన్యత ఉండడం కోసం కులపురాణం. కులం మొదట జాతిగా కాకుండా వృత్తిగా మొదలైందనేది ఇక్కడి సారాంశం. క్రమేణా ఆ కులం వృత్తి అనే శ్రేణిని దాటి జాతి అనే శ్రేణికి చేరింది. కొత్తకులాలు ఆవిర్భవించడానికి కోశనిధి ఎక్కడ్నుండో వచ్చి ఉండాలి, అదెలా వచ్చి ఉండొచ్చు? ఈ అవసరాలను గుర్తించిన మునుపటి కులాలు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ (కులపురాణం, ప్రోత్సాహకాలు, ఇత్యాదులు) చేస్తూ కోశనిధిని ఏర్పాటు చేసి ఉండే అవకాశం ఉన్నది. లేదా ఇంతకుముందు "సమయాలు" అని ఉండేవట, ఆలోచనలకు పెట్టుబడి అక్కడినుండి దొరికేది. ఇలాంటి సమయాలు ఆయా కులాలకు ప్రత్యేకంగా ఉండడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సినది కాదు, మనం కూడా అనునయించాల్సినది. కమ్యూనిటీ ఫండ్స్ అన్నప్పుడు మహదానందంగా

వెల తక్కువ వ్యభిచారం

ప్రేమలో విఫలమయ్యాక మరియు మోసపోయాక వ్యసనాలకు బానిసలవ్వడం ఈమధ్య కాలంలో సమాచార మాధ్యమాలలో అంతగా కనిపించడంలేదు. అంటే ఈ వైఖరి తగ్గిపోయిందనేసి అనుకోవాలా? అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు! వ్యసనం అనగానే మద్యం, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు అనుకుంటారు; కానీ ఉద్యోగంలో లీనమైపోవడం, పోర్నుకు బానిసవడం, నిత్యం హస్తప్రయోగం, వీడియో గేమ్స్ అతిగా ఆడడం, వ్యాయామశాలలో అతిగా సమయం వెచ్చించడం, సాంఘిక మాధ్యమాలలో అతిగా స్పందించడం వంటివి కూడా వ్యసనాలే. ఇలాంటి ప్రమాదకరమైన సాంఘిక మార్పులకు ప్రాముఖ్యత ఇవ్వడంలేదు సమాచార మాధ్యమాలు, కావున వీటిని ఇకపై సమాచార మాధ్యమాలు అనకుండా దురాచార మాధ్యమాలు అనడం కద్దు. యువతలో ప్రబలుతున్న అసహజమైన వైఖరులను మొగ్గ దశలోనే గుర్తించడానికి సమాచార మాధ్యమాలు ముఖ్యమైన పాత్ర పోషించాలి. అలాంటి పాత్రను పోషించడంలో విఫలమైన ఫలితమే పశ్చిమదేశాల్లో (పశ్చిమదేశాలు ప్రాంతీయమనే పరిధిని దాటి ఆలోచనగా డెబ్భైఏళ్ళ క్రితమే రూపాంతరం చెందాయి) వీర్యక్షేపం & అండవిచ్ఛిత్తి వంటి సంకటస్థితులను నెలకొల్పింది. కామం సనాతనంలో నాలుగు పురుషార్థాలలో ఒకటి, అలాంటి కామం దేహవాంఛలను రగిలిస్తుంది, రతిక్రీడకు రంగం సిద్ధం చేస్తుంద

సాటి హిందువుకు మనం చెయ్యగల్గింది?

మూడ్రోజుల క్రితం అగస్త్య అని రాంచీ నుండి ఒక కుర్రాడు వెల్డ్ టెస్ట్ (యుగ్మ పరీక్ష) కోసం ఫ్యాక్టరీలో నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి యుగ్మకారులను పరీక్షించడానికి ఏ హెచ్.ఆర్. కూడా ససేమిరా ఒప్పుకోరు, ఇక్కడున్న మూడు సంవత్సరాల్లో డెబ్భై మందికి పైగా పరీక్షలు నిర్వహించి ఉంటాను. అందులో నేను ఎంచుకున్నది మాత్రం ఆరుగురినే! వాళ్ళు ఇంకా ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు. అగస్త్య అనే కుర్రాడిని & అతను కొట్టిన యుగ్మాన్ని పరీక్షించి తీసుకోమని సలహా ఇచ్చాను, ఇతను ఏడవ వ్యక్తి! కాకపోతే అతనికి GMA యుగ్మం మాత్రమే వచ్చు, SMA & TIG యుగ్మం రాదు. అందుకని జీతం అతి తక్కువగా వెయ్యడం జరిగింది అతనికి. మా ఫ్లోర్ ఇంఛార్జి అతన్ని వద్దుకాక వద్దన్నాడు, ఒక్కటే యుగ్మం చేస్తాడని. అతన్ని వేరే ఫ్లోర్కి పంపారు, నాకేమో అతన్ని నా ఫ్లోర్లో ఉంచాలని, నా దగ్గరైతే వేరే యుగ్మాలు కూడా నేర్పడానికి వీలుంటుంది, అతనికి జీతం కాస్త పెంచే అవకాశం నా చేతిలో ఉంటుంది. అతనెళ్ళిన ఫ్లోర్ వాళ్ళు ఒక్కరోజు చూసి అతన్ని వద్దని పంపేశారు, మళ్ళీ నా దగ్గరికే పంపారు. నిన్న వద్దన్న మా ఇంఛార్జి ఇవాళ సరే అన్నాడు, అతను చేసిన ఉత్పత్తి యుగ్మాలు (ప్రొడక్షన్ వెల్

మనం తొంభై సంవత్సరాల వయస్సు దాటి బ్రతికితే?

ఆంగ్లేయులు మనకు రాజకీయ స్వాతంత్య్రం ప్రసాదించిన సమయంలో భారతీయుల ఆయుర్దాయం సగటున ముప్పైరెండు సంవత్సరాలు, అయితే ఆధునిక ఔషధాల పుణ్యమా అని ఆ సగటు ఆయుర్దాయం ఇప్పుడు డెబ్భైరెండు సంవత్సరాలకు చేరింది. ఇది సగటు అని గుర్తుంచుకోవాలి; కొందరు డెబ్భై రెండు కంటే ఎక్కువ, ఇంకొందరు డెబ్భై రెండు కంటే తక్కువ బ్రతుకుతారు. నేడు నా వయస్సున్నవారు మరో నలభైరెండు సంవత్సరాల్లో ఈ సగటు ఆయుర్దాయాన్ని చేరతారు. మనలో కొందరు దీన్ని మించి బ్రతుకుతారు. ఒకవేళ వాళ్ళు డెబ్భైకి చేరగానే ఇహపై కోలుకోలేని వ్యాధితో మంచంపడితే? మనం నేడు రేయింబవళ్ళు కష్టపడి కక్కుర్తిపడి సంపాదించే డబ్బు అప్పుడు అక్కరకు వస్తుందని అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. సరిగ్గా ఇదే దృశ్యం నేడు మనం జీవిస్తున్న ఈ సమయంలోనే అభివృద్ధి చెందిన దేశాలుగా పేరుమోసిన పశ్చిమదేశాలలో జరుగుతుండడం గమనించకపోవడం నిజంగా బాధాకరం. అక్కడ అరవైఐదు సంవత్సరాలు దాటినవారి నిష్పత్తి వారి జనాభాలో 20% పైబడి ఉంది, ఈ నిష్పత్తి వచ్చే యాభై ఏళ్లు పెరుగుతూనే ఉంటుందని అంచనా! మరి వారందరూ ఆ వయసులో ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమాలలో, డబ్బుకు సేవలు అందించే ఆసుపత్రుల్లో. ఇక్కడ వారికి ఆరోగ్యం బా

అక్షరజ్ఞానంలేని అవినీతి రాజకీయ నాయకులు!

"నేను ఐఏఎస్ పాసయ్యి అక్షరజ్ఞానం లేని అవినీతి రాజకీయ నాయకులకు పర్సనల్ సెక్రెటరీగా పనిచెయ్యలేను" అన్నారు ఒక సందర్భంలో అన్నగారు మున్నూరు నాగరాజు గారు. ఇవే ఆలోచనలు అన్నగారిలో ఇంకా అలానే ఉన్నాయో లేదో నాకు తెలియదు, కనుక కేవలం ఆలోచనల వరకే పరిమితమై ఈ విమర్శ ఉంటుంది. మావారిని నేను మరీ కటువుగా విమర్శ చెయ్యను, పరుషంగా మాట్లాడను. ఇది నాకు నేను పెట్టుకున్న నియమం. అన్నగారు దీన్నొక సద్విమర్శగా భావిస్తారని నాకు తెలుసు, ఆయన స్వభావం అలాంటిది మరి. ఐఏఎస్ మీద నాకు అంతగా గౌరవం లేకపోయినా, నాకు ఈ వాక్యంపై పలురకాలైన అభ్యంతరాలున్నాయి. మొదటిది - అక్షరజ్ఞానం లేనివారు అవినీతిపరులు. రెండవది - రాజకీయ నాయకులకు అక్షరజ్ఞానం ఉండదు. మూడవది - రాజకీయ నాయకులు అవినీతిపరులు. ఆ అక్షరజ్ఞానం ఉన్నవారే అత్యంత పెద్దస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు, డబ్బుకు కక్కుర్తి పడుతున్నట్లు, లంచాన్ని వ్యవస్థీకరించడంలో సిద్ధహస్తుమైనట్లు ఈపాటికే తేటతెల్లం అయ్యింది. నమ్మకం లేకపోతే లాలూప్రసాద్ యాదవ్ చేసిన అవినీతిని మరియు ఏ రాజా చేసిన అవినీతిని పక్కపక్కన పెట్టుకుని చూడండి. ఇదొక ఉదాహరణ, అలాంటివి వెతికితే చాలానే కనపడతాయి. దీనిని బట్టి అవ

కులానికి మతానికి ఉన్న సంబంధం!

మా అన్నగారు వీర నరసింహ రాజు గారు వ్రాసిన ఒక లేఖపై - "కులంలేని మతం మరియు ప్రహరీలేని గృహం రెండూ ఒకటే, రక్షణ కరువై నేలకూలతాయి" అనే నా వ్యాఖ్యకు వచ్చిన రెండు ప్రతికూలవ్యాఖ్యలు. వాటికి స్పందన అక్కడ ఇచ్చేకంటే ఇక్కడ ఇస్తే బాగుంటుందన్న ఉద్ధేశ్యంతో... నేను ఇప్పటిదాకా మెదడు మోకాలులోకి పోయినవారిని అతి సమీపంగా చూశాను, అయితే మెదడు అరికాలులోకి జారిన ఘటాలను చూడడం ఇదే మొదలు! ఏ కులపురాణం, జాతిపురాణం, పురాణగాథలు, ఇతిహాసాలు చూసినా కులం/జాతి/వంశం అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తూ రావడం కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మనం కంటితో చూసింది, చెవులతో విన్నది మన మెదడులో చైతన్యాన్ని నింపడానికి మారుగా జడత్వాన్ని ప్రబలంగా పెంచుతోంది. కులం & మతం అనేవి నాణేనికి రెండు ప్రక్కలుకాదు, మతం నాణెం అయితే కులం దానికున్న విలువ. మనం నాణేన్ని చూస్తున్నాం, కులాన్ని చూడటంలేదు. ఇంతకాలం - "మిత్రత్వమైనా శతృత్వమైనా ఆలోచనలతోనే, ఆ ఆలోచన వచ్చిన వ్యక్తితో ఎంతమాత్రమూ కాదు" అన్నాను, ఇహనుండి ఇలాంటి మూర్ఖులను కూడా ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం చేస్తాను. ఆఖరిగా - కులానికి అంతటి ప్రాముఖ్యం లేకపోతే కులానికో చర్చి, మ

ఇల్లెందుకు?

"ఇల్లు కొనడమా లేక అద్దెకుండడమా! ఏది నయం?" అనేటి అంశం రాబర్ట్ కియోసాకి ప్రాచుర్యంలోకి తెచ్చిన '90ల నాటి కంటే నేడు అధికమైన చర్చ (ఆర్భాటం అనడం బాగుంటుంది!) జరుగుతోందంటే పరిస్థితి ఎంతలా విషమించి వికటించిందో అర్థం చేసుకోవచ్చు. ఆధునికత తెచ్చిన పలురకాలైన అభ్యుదయ సంస్కరణల్లో ఒకటి గృహవిపణి, అదే హౌసింగ్ మార్కెట్. "గృహం నివాసం కదా, అంగడిలో అమ్మే ఒక వినియోగవస్తువు ఎలా అవుతుంద?"ని ప్రశ్నించడమో యోచించడమో ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు. ఎవరో ఒకరు చేసే ఉంటారని అనుకుంటున్నాను; అయితే వారి యోచనలు పిచ్చికేకలుగా, ప్రశ్నలు మృత్యుఘోషలుగా మిగిలిపోయి ఉండే అవకాశం మెండుగా ఉంది! ఒకవైపు నివసించడానికి ఇల్లులేనివారైతే మరొకవైపు ఇంటితో వ్యాపారం చేసే విపణి. క్రైస్తవ మూలాలతో స్థాపించబడిన పరిశ్రమను (ఇండస్ట్రీ) చదవడం నాకున్న అలవాటు, అలాంటి అలవాటులో కాలనియతకు (కలోనియలిజం) ముందు "అద్దె" అనే మాటగానీ, ఆ అర్థంలో వాడుకలో ఉన్న మరొక పదంగానీ నాకు కనపడలేదు. అంటే కాలనియత జరగకముందు నివాసం ఉండడానికి ఎవరికి వారికే సొంతిల్లు ఉండేది అనుకోవాలి! రాజ్యాలు పోయాయి, రాజులు & వారి వంశాలు పోయాయి, అనువంశిక ప

గారో | వన్ పంచ్ మ్యాన్

"దుష్టులే ఎందుకు ఓడిపోతున్నారు? న్యాయాన్ని కాపాడేవారే ఎందుకు గెలుస్తున్నారు? నిస్సందేహంగా గెలుపు న్యాయానికి పక్షపాతి, దుష్టత్వానికి వ్యతిరేకి" అంటాడు గారో, హ్యూమన్ మాన్స్టర్! విస్తుపోయిన సాటి సగటు మనిషి - "నీకేమైనా పిచ్చా?" అని నిలదీస్తాడు. "దుష్టులకు ఆశలుండవా? అత్యున్నత శిఖరాలకు ఎదగాలనే కోరికలు ఉండకూడదా? ఎంత కష్టించినా శ్రమించినా ఎప్పుడూ న్యాయం మాత్రమే గెలుస్తుంది అంటే పోరాటఫలితం ఎప్పుడో ముందుగానే నిర్ధారింపబడిందనేగా అర్థం" అని బదులిస్తాడు గారో. ఇది "వన్ పంచ్ మ్యాన్" అనే జపాన్ యానిమేలోని సందర్భం. పూర్వం ఋషులు యజ్ఞం చెయ్యగా ఋతం, సత్యం, ధర్మం మరియు న్యాయం అనేవి ఆవిర్భవించాయి. తర్వాత్తర్వాత ఆ ఋతమే సత్యమై, ఆ సత్యమే ధర్మమై, ఆ ధర్మమే న్యాయమై క్రమేణా రాజ్యం ఏర్పడి, పాలన సాగింది. పాలన నిరాటంకంగా జరగడానికి న్యాయం, న్యాయస్థాపనకు సత్యం, సత్యనిర్ధారణకు ధర్మం, ధర్మహేతువుకు ఋతం అనేవి ఒకదానిపై ఒకటి అధారితమయ్యాయి. ఏది ముందు ఏది వెనుక అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాలంలో ముందు వెనుకల అయోమయ అనిశ్చితస్థితి నాడూ ఉంది, నేడూ ఉంది, రేపూ ఉంటుంది! దీన్నొక క్రీడ అను

కుంటుపడిన వివాహవ్యవస్థ & అరణ్యాలలో అగ్నిప్రమాదాలు

మొదటి అంశం :  గత రెండు దశాబ్దాలలో హిందూ వివాహవ్యవస్థలో గుర్తించలేని మార్పులు ఎన్నో వచ్చాయి. గతంలో జీవితం ఆరంభించడానికి వివాహం చేసుకునేవారు, కానీ ఇప్పుడు వివాహం అనేది అన్నీ సాధించాము అనుకున్నాక చిట్టచివరిగా జరిపించే ఒక తంతు ఐపోయింది! జీవితం ఆరంభించడం అంటే కట్నాలతో కోటలు కట్టడమో లేక కోట్లు సంపాదించే మగాడ్ని మొగుడ్ని చేసుకోవడమో కాదండి, సంఘంలో గృహస్తులుగా మారి కొన్ని బాధ్యతలను నెరవేర్చే కార్యాన్ని స్వీకరించడం. అవి స్వీకరించారు కనుక లైంగికమైన వాంఛలు తీర్చుకునే వెసులుబాటు. ఆ వెసులుబాటు కేవలం ఒక పురుషుడికి మరియు ఒక స్త్రీకి కలిపి ఇవ్వడం జరిగింది, గురువుల ద్వారా. లైంగికచర్యకు పర్యవసానం పిల్లలు, వారి పెంపకం ఇంకొక బాధ్యత. పురుషుడు సంపాదిస్తే స్త్రీ ఇంటిని దిద్దుకురావడం పరిపాటి అయ్యింది. ఐతే కలియుగాన ఆధునికత మొగ్గతొడిగాక "స్త్రీ సశక్తీకరణ" వంటి గమ్యం తెలియని ఉద్యమాలు భారత స్త్రీలను వంటింటి కుందేళ్లుగా చూపడంలో సఫలీకృతం అయ్యాయి. ఫలితంగా స్త్రీలు ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టారు, పురుషులు తమ కుల ఉపాధిని కోల్పోవడమే కాక ఉద్యోగాలలో స్త్రీలతో పోటీపడాల్సిన పరిస్థితి ఎదురైంది. "సంపాదించే స్త