Skip to main content

Posts

Showing posts from July, 2021

కువకువలు 03 - చిన్న కలలు, చిన్నచిన్న భయాలు

విక్రమశకం 2079, శ్రావణ కృష్ణపక్షం  నా కలలు నన్ను భయపెడతాయి. వాటిని నేను అందుకోగలనో లేదో అనే చిన్ని భయం నన్ను నా ఆశయాలవైపుకి నెమ్మదిగా తోస్తుంది.  ఆ ఆశయాన్ని అందుకునే క్రమంలో & ఆ భయాన్ని ఛేదించే క్రమంలో నేను పొందే అనుభవాలు, నాకు కలిగే అనుభూతులు, నాలో వచ్చే అవిరళ మార్పులు, నాకు నేను ఇచ్చుకునే ఓదార్పులు నన్ను నా ఆశయాలను దగ్గరగా చేస్తాయి. 'లక్ష్యాలు సాధించలేమేమో' అనే భయం నుండి వచ్చే ధైర్యం నిరంతరం నింపాదిగా ఉంటుంది, నిండు కుండలా ఉంటుంది, తొణకదు, బెణకదు, వెరవదు, జంకదు. అలా స్థిరంగా ఉంటుంది. ఆ ఆశయం ఇహ నన్ను భయపెట్టలేదు. నా భయం ఆగిపోయిన తర్వాత జరిగేది ఒక్కటే... నేను నా ఆశయాన్ని చేరుకోవడం. మరి తర్వాత? మరొక ఆశయం, మరొక భయం, మరిన్ని సంఘర్షణలు, మరెన్నో అనుభవాల పాఠాలు, కొన్ని అపజయాలు, ఎన్నెన్నో విజయాలు, మళ్ళీ ఓనమాలు మామూలే... జీవితం అందమైనది అని చెప్పడం తేలిక, దాన్ని చేసి చూపెట్టడం చాలా కష్టం. జీవితాన్ని అద్భుతంగా జీవించే పద్ధతిని ఔపోసన పడితే అందులో ఉండే అమృతతరంగాలు మనల్ని అఖండ అలౌకిక ఆనందతీరాలకు చేరుస్తాయి. ఏదో ఒకనాడు నేను ఆ తీరాలను స్పృశిస్తాను. ఒకవేళ ఆ ఆనందతీరాలను చేరుకోలేదు అంటే, నే

కువకువలు 02 - సరితాగానం

విక్రమశకం 2078, ఆషాఢ కృష్ణపక్షం  మనసు బాగోనప్పుడు ఒంటరిగా వర్షంలో కేవలం మన ఆలోచనలతో మాత్రమే సహవాసం చేస్తూ తడిస్తే వచ్చేటంత మానసిక ఉల్లాసం ఎంత డబ్బు ఖర్చు చేసినాసరే దొరకదు. మనసు కలతచెందినప్పుడు మన హృదయగాయాన్ని గుర్తెరిగి మసలుకునే వ్యక్తులతో మాట్లాడినప్పుడు దొరికే సలహాల ముందు గొప్ప మానసిక నిపుణుడు డబ్బుకోసం ఇచ్చే సలహాలు తీసికట్టే. ఒంటరితనం మరియు ఏకాకి జీవితం ఒకటి కాదు అనే పరమసత్యం ఇవాళ బోధపడింది. మేఘాల ఘర్జనలో మండూకాల బెకబెకలలో హోరున కురుస్తూ ఘీంకారాలు తీసే వాన, గుండెల్లో ఉప్పొంగే ఎన్నో అగ్నిపర్వతాలను అణచివేస్తుంది, ఆహ్లాదాన్ని మళ్ళీ ఆనందించేలా చేస్తుంది. వర్షంతో ఎన్నో జీవితాలు ముడిపడివున్నాయి. ఆ మాటకొస్తే వర్షం లేకపోతే యేర్లు ఉంటాయా? సెలయేర్లు పారతాయా? మడిచేలు పండుతాయా? తిండిగింజలు దొరుకుతాయా? పర్జన్యభరిత వినీలాకాశంలో దుర్జన్యకుంజిత దాహార్తిని తీర్చే వారుణాశ్రిత ఇంద్రజాలికుడు దేశదేశాల సరిహద్దులు దాటేస్తూ, ఎల్లలు చెరిపేస్తూ, నదులను ఉరికిస్తూ, కాలాన్ని నడిపిస్తూ, సమయాన్ని నిలదీస్తూ, ప్రాణాన్ని నిలబెడుతున్నాడు. సశేషం... ----- * ప్రవహించే నీటికి "సరితా" అని పేరు.    శ్రీ మహావిష్ణు

వాకిట్లో వర్షం పడుతోంది.!

వాకిట్లో వర్షం పడుతోంది.! వర్షంలో తడిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి, అంతకంటే ఎక్కువగా ఆ వర్షంలో నీతో కలిసి వేసిన అడుగులు గుర్తొస్తున్నాయి. గొడుగు పక్కకి పారేసి, నీ చున్నీలో దాక్కున్న చిలిపి చేష్టలు గుర్తొస్తున్నాయి. వానలో మనం కృష్ణా-గోదావరీ సంఘమంలా కలిసి నడుస్తుంటే మనల్ని చూసి కుళ్ళుకుని మేఘాలు చేసిన ఘీంకారాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తడిచిన బట్టల్లో మనం చేసుకున్న ఆలింగనాలు నాకు ఇంకా గుర్తున్నాయి, ఒకరికొకరం మార్చుకున్న వాగ్ధానాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తొలకరి జల్లుల్లో వచ్చే మట్టి సువాసన నీ శరీరం వెదజల్లే సుగంధంతో కలిసి నన్ను తన్మయత్వంలోకి నెట్టేసిన క్షణాలు ఇంకా నాలో జీవించేవున్నాయి. వానలో నా చెయ్యి పట్టుకుని నాతో నడిచిన నీ వయ్యారపు నడకలు నాకింకా గుర్తున్నాయి, నీ వలపుల కవ్వింతలు నన్నింకా కలవరానికి గురిచేస్తున్నాయి. కృష్ణమ్మ నీటి రుచి గోదారి నీటి వంపులతో సంపూర్ణం అయినట్లు, నీలో నన్ను కలిపేసుకున్న నువ్వు నాకింకా గుర్తున్నావు. వాన పడిన ప్రతిసారీ నీతో కలిసి తడవాలని, నడవాలని, కలిసిపోవాలని, విడదీయలేని బంధమైపోవాలని, నీ శరీరంలో ఒక భాగమైపోవాలని వచ్చిన ఎన్నో ఆశలు...అడియాశలుగా మారడం నాక

చైతన్య జీవితం.!

చైతన్య జీవితం.! అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనిషి జీవితం నూరేళ్లు కాదు కళ్ళుమూసి తెరిచినంతసేపే అని. ఒక్కసారి కళ్ళుమూసి తెరిచేలోపు మన చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన భావాలు-మనోభావాలు అదృశ్యమైపోతాయి, ఉద్విగ్న క్షణాలు మధురంగా మారతాయి, రాసలీలలు కన్నీటితో ముగుస్తాయి. ఒకసారి కళ్ళుమూసి తెరిచేలోగా మనం నేర్చుకున్న విషయాలను, కళ్ళు తెరిచిన సమయంలో మళ్ళీ పుట్టిన మన ప్రాణశక్తి కొనసాగిస్తుందని నా భావన. కళ్ళుమూసి తెరిచేలోగా ఉండే ఈ సమయం చాలా తక్కువ కనుక మన మరణం మనకు తెలియడంలేదు. ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రాణశక్తిని నిలిపే బంధనం (ఇంధనం) అయిపోతుందో, అప్పుడు మరలా పుట్టడానికి తీసుకునే సమయం ఎక్కువ అవ్వడం వలన మనం మరణించినట్లు మన చుట్టూ ఉన్నవాళ్ళు నిర్ధారణకు వస్తున్నారని నా ఉద్ధేశ్యం. మరలా తిరిగి ఏదైనా శరీరంలోకి ప్రవేశించిన ప్రాణశక్తి ఇంతకుముందు తాను నేర్చుకున్న విషయాలను ఎక్కడ వదిలేసిందో అక్కడ నుండి జీవన ప్రయాణం మొదలెడుతుంది అని నా నమ్మకం. అందుకే కొందరు పుట్టడంతోనే జ్ఞానులుగా ఉంటారు అనేది కాదనలేని సత్యం. నా శరీరం శుష్కించిన తర్వాత నాలో ఉన్న ఈ ప్రాణశక్తి బంధనం బలంగా గల ఇంకొక శరీరాన్ని

ధార్మిక సంఘర్షణ.!

మౌన సంఘర్షణ.! నా చిన్నప్పుడు మా అక్క సాయంత్రం పూట పాఠాలు చెప్పిన ప్రదేశం, చిన్న ఆంజనేయ స్వామి గుడి, గుర్తుకొస్తుంది. మా ఇంటి నుండి దాదాపు 3 కి.మీ.ల దూరంలో ఉండేది గుడి. గుళ్ళో పంతులు మా ఆర్థిక స్థితి మరియు మా అక్క తెలివితేటలు చూసి, "సాయంత్రం పూట ఎలాగూ గుడి మూసే ఉంటుంది, ఇక్కడ ట్యూషన్ పెట్టుకోవచ్చు. పనిలోపనిగా చిన్న లైట్ ఒకటి పెట్టించుకో" అని చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. (ఇది ఝజ్జవరం గ్రామంలో) గుడి అంటే గుర్తొచ్చే మరొక విషయం, నా పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకి మా అక్క నన్ను మా ఇంటికి దగ్గర్లో ఉన్న గంగాణమ్మ గుడికి తీసుకెళ్లేది. గుడి అంటే గుడి కూడా కాదు, 2 1/2 అడుగుల రాయి మీద చెక్కిన వీరవనిత రూపం. (ఇది కొండపల్లి గ్రామంలో) పెద్దయ్యాక ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి వెళ్ళడం అలవాటైంది. కళ్యాణ సమయంలో సీతమ్మవారికి రామదాసు భక్తుల నుండి సేకరించిన సొమ్ముతో చేయించిన మూడు సూత్రాల తాళిబొట్టు అమ్మ సీతమ్మ మెడలో చూస్తే కన్నులపండుగే, తలంబ్రాల కోసం ఎదురుచూసిన క్షణాలు, గోదావరిలో 2 రోజుల పాటు విడిచే అర్ఘ్యం ఇంకా గుర్తున్నాయి. (ఇది భద్రాచలంలో) మా పరివారంలో తీర్థయాత్ర అంటే తిరుపత