Skip to main content

Posts

Showing posts from May, 2023

అంతిమఫలితం!

చేసే ప్రతి పనికీ (కృత్యానికీ!) కారణం వెతకడం, ఆ కృత్యాల్లో అంతరార్థాలను వెలికితియ్యడం, ఆ వెలికితీసిన అర్ధార్థాలకు జ్ఞానమని పేరు పెట్టడం, వాటి ప్రయోజనం ఇదీ అని విశ్లేషణ చెయ్యడం మానవ(మనువు)జాతికి అత్యాధునికయుగంలో ఆనవాయితీగా మారింది. ఈ విధమైన అర్ధసంహిత వైఖరులు మనోవాక్కాయ (మనసు, వాక్కు & కాయము) సంతులతను కోల్పోవడానికి కారణభూతం అవుతున్నాయి. ఒక రకంగా ప్రతి దానికీ ఏదో ఒక కారణాన్ని వెతకడమే అసంతుల (అసంతృప్త) జీవనానికి కారణం అవుతోంది! ఈ విషయంలో అత్యాధునిక సమాజపోకడలు కల్గిన నేటి మన మానవజాతి సూర్యుని నుండి సుమతిని పొందవచ్చు. సూర్యుడు లోకానికి కాంతిని, ఉష్ణాన్ని & కాలాన్ని అందించే అద్వితీయమైన కార్యాన్ని ఎటువంటి విసుగూవిరామంలేక, చిరాకుపడక ఎన్నో యుగాల నుండి క్రమం తప్పకుండా అనుదినం చేస్తూనే ఉన్నాడు, మరెన్నో యుగాలు అలా చేస్తూనే ఉంటాడు. ఒక మాసం గడవగానే మనం ఏరికోరి ఎన్నుకున్న ఉద్యోగమే మనకు వెగటు పుట్టిస్తుంది, అలాంటిది సూర్యుడు యుగాల తరబడి ఎలా చేస్తున్నాడు ఇదంతా? ఏ ఫలితం ఆశించి చేస్తున్నాడు? ఏ ప్రయోజనం కలుగుతుంది సూర్యుడికి ఇదంతా చేస్తే? కాస్త మనసును స్థిరచిత్తంతో నిలిపితే సూర్యుడిని నడిపేది ఆశ (కా

జ్ఞాపకాలు

పోయిన ఆదివారం కర్ణాటక రాష్ట్రానికి తిరిగొచ్చాను. వచ్చాక గొరవనహళ్లి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుందామని అనుకున్నాను, ఇవాళ కుదిరింది. ఎలాగూ వెళ్ళే దారిలోనే కదా పనిలోపనిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కూడా చేసుకుందామని దేవరాయనదుర్గ వెళ్ళాను. అటుగా వెళ్ళే దారిలో అత్యంత సాధారణమైన ఒకిల్లు కనిపించింది, నన్ను ఆకర్షించింది, చిన్నప్పటి పల్లెటూరి జ్ఞాపకాలను కొన్నింటిని తట్టిలేపింది! ఆ ఇల్లు మట్టి గోడలతో ఉంది, కప్పుగా తాటాకులు వాడారు, వాకిట్లో ముదురుపచ్చగుడ్డతో కట్టిన స్నానాలదొడ్డి, ఈశాన్యం వైపున వేపచెట్టు, ఆ చెట్టుక్రింద కేవలం ఎనిమిది ఇటుకలతో కట్టిన కులవేల్పు (కులదేవత) గుడి, ఆ గుడిలో ఒక చిన్న గుండ్రాయికి పసుపుపూసి ఎఱ్ఱగుడ్డతో & తెల్లపూలతో (పేరు తెలియదు!) అలంకరణ. "ఏంటి, దానిని గుడి అంటారా మీరు?" అని కొందరు నవ్వొచ్చు! కానీ నేను పుట్టిన (విజయవాడ దగ్గర) & పెరిగిన ఊర్లలో (పామర్రు దగ్గర) ఇదొక ఆనవాయితీ, కొందరు ఇలవేల్పులను కూడా ప్రతిష్టించుకుంటారు. మొత్తానికి ఇంటిదగ్గర ఏపుగా ఎత్తుగా పెరిగే చెట్టు (సాధారణంగా వేపచెట్టు!), దాని క్రింద పైన చెప్పిన విధంగా ఒక గుడి, అందులో కులవేల్పు/ఇలవ

శృతిలేని చదువులు - 3వ భాగం (యథార్థం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 10వ తరగతి పరీక్షలు ముగియడం, వాటి ఫలితాలు వెలువడడం మరియు ఆ ఫలితాలు చూసి యావత్ప్రజానీకం ఉబ్బితబబిబ్బైవ్వడం, అదే స్థాయిలో నిర్ఘాంతపోవడం కూడా అయిపోయాయి కనుక ఈ భాగం ప్రచురణకు నోచుకుంది! గ్రెగోరియన్ కాలపట్టికను అనుసరించి జనవరి 23 నుండి మే 20 వరకూ ఆంధ్రాలో ఉన్న నేను నా మేనల్లుడికి 10వ తరగతి గణితశాస్త్రం & విజ్ఞానశాస్త్రం పాఠాలు చెప్పడం, సందేహాలు తీర్చడం, వాడికున్న పరిమితులను అర్థం చేసుకోవడంతో పాటుగా (కార్పొరేట్!) పాఠశాలల వాస్తవికతను గుర్తించడం జరిగింది. నేను వాడికి కేవలం ఉత్తీర్ణుడవైతే చాలని చెప్పాను, కానీ వాడు మాత్రం 498 సాధించాడు. ఇవి నేను 2007లో తెచ్చుకున్న వాటికన్నా 3 మార్కులు ఎక్కువ! "అదేంటండీ! మీ వాడికి అంత తక్కువొచ్చాయి మార్కులు?" అని దీర్ఘాలు తీశారు వాడి ప్రధానోపాధ్యాయురాలు (కం. కరస్పాండెంట్!). "మాకు ఆ మార్కులు చాలండీ, తింటాడా ఏమిటి ఆ మార్కుల్ని?" అన్నాను. దాంతో ఖంగుతిన్న ఆమె నవ్వి ఊరుకుంది. వాడి పాఠశాలలో అత్యధికంగా 564 మార్కులు వచ్చాయంట, పాఠశాల ఉద్యోగులు (ఇక్కాదుక్కా తప్పిస్తే అందరూ మహిళా ఉపాధ్యాయినులే!) తెగ హైరానా పడిపోతున్నారు. ఏమై

వనితాప్రాచ్యం!

అప్రాచ్యదేశ మహిళలు సాగించిన స్త్రీ స్వతంత్రత & సాధికార ఉద్యమాల యొక్క ఘనతలలో ముఖ్యమైనది - "నా" అని చెప్పుకునేందుకు ఎవ్వరూ లేకుండా చేసుకోవడం, ఇందులో ఇండస్ట్రీ (పశ్చిమ ఐరోపా ప్రకల్పన ప్రకారం) అత్యంత ప్రముఖ పాత్ర పోషించింది. అప్రాచ్యదేశాల ఆర్థికవేత్తలు, నిపుణులు మరియు చరిత్రకారులు తామెక్కడికి ఎక్కడికివెళ్ళినా నిత్యం మార్కెట్ డిశ్రప్టివ్ ఇన్వెన్షన్ల (విపణిని విస్మయానికి గురిచేసే ఆవిష్కరణల) గురించి ఒక పాఠం అప్పజెప్పినట్లు చెబుతూ ఉంటారు. వారి దృష్టిలో సహజత్వానికి దగ్గరగా ఉండే ప్రతి అంశాన్నీ తిరస్కరించడం, ధిక్కరించడం, అలక్ష్యం చెయ్యడం వంటివి విస్మయకారి ఆవిష్కరణలకు ప్రధానహేతువు. వారి ఈ విచలిత మనస్తత్వమే ఇంటి నుండి స్త్రీ యొక్క స్థానాన్ని అనేక విస్మయకారి ఉపకరణాలతో భర్తీ చేసేసింది, స్త్రీకి ఇల్లు ఇచ్చే భద్రతను దూరం చేసింది; ఒకరకంగా చెప్పాలంటే నిలువనీడ లేకుండా చేసింది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి అక్కడి మహిళలు మగవారితో పోటీపడక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆ పోటీ కేవలం పురుషులతోనే జరగలేదు; కోడి, కుక్క, గొఱ్ఱె, పంది వంటి పెంపుడు జంతువులతో కూడా జరపాల్సిన అగత్యం ఏర్పడింది! తమ "విలువ

మతిమయం - 2వ భాగం

"అబ్బా! పొద్దున్నుంచి ఈ భవంతిలోని పిల్లకాకులు విరామం లేకుండా తలుపులు తడుతూనే ఉన్నారు. తీరా పోయిచూస్తే ఒక్కరూ కనిపించరు. వాళ్ళుగాని నాకు దొరకాలి..." అంటూ తలుపు తీసింది జాహ్నవి, చిరాగ్గా! తన కళ్ళను తనే నమ్మలేకపోయింది, లోపలి నుండి వస్తున్న కన్నీళ్ళను ఆపేసుకుంటూ "లోచనా..." అంటూ సులోచనను కౌగిలించుకుని అప్రయత్నంగానే భావోద్వేగానికి గురైంది. "రమ్మన్నావు, వచ్చాక చిరాకులు పరాకులు. ఇందుకే నేను రానన్నాను" అంది లోచన, చంచలమైన నిట్టూర్పుతో. "ఆపుతావా ఇక!" అని కళ్ళురుమిచూసింది జాహ్నవి. జాహ్నవి సులోచనను తన భర్త రఘుకు, కూతురు భూమీకి, మామగారికి, అత్తగారికి పరిచయం చేస్తూ తమ చిన్నప్పటి చిలిపి సంగతులను వడివడిగా చెప్పనారంభించింది. ఇప్పుడు తనున్న ఈ స్థాయికి అప్పట్లో సులోచన చేసిన మేలు మరచిపోలేనిదని ఎంతో అభిమానంతో చెబుతూ లోచన చేతిని నిమిరింది, ఆప్యాయంగా. "అమ్మా, లోచనా! నువ్వు వీళ్ళ పెళ్ళికి వచ్చావా? ఏమీలేదు, నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది" అంటూ అడిగింది జాహ్నవి అత్తగారు, పదేళ్ళక్రితం అంగరంగ వైభోగంగా జరిగిన వివాహ కార్యక్రమాన్ని గుర్తుచేసుకుంటూ. ఒక్కసారిగా ఇంట్లో ని

ద్రవ్యస్థిరత్వం, ఆర్థికలాఘవం & విద్యాపాటవం!

చిన్న వయసులోనే ఆర్థిక సంతులత (దీన్ని ఫైనాన్షియల్ ఫ్రీడం అని చదవొద్దని మనవి!) సాధించిన పిల్లల భవిత ముమ్మాటికీ తక్కినవారితో పోల్చితే అమోఘంగా ఉంటుంది. ఈ భవితను పిల్లలకు అందించాలంటే పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలి. నా ఆలోచననే ఉదాహరణగా వివరిస్తాను 👇 నా మేనకోడల్ని వైద్యరంగానికి మళ్ళించాలని నా అభిలాష, కనుక తన 10వ తరగతి అయ్యాక డి ఫార్మసీలో చేర్పిస్తాను. అందుకయ్యే ఖర్చు స్వల్పమే, కానీ ఆమె ఉత్తీర్ణురాలైతే తను ఒక ఫార్మసిస్టుగా పనిచెయ్యొచ్చు. నా మిత్రుల దగ్గర ఆమెను కనీసం రెండు సంవత్సరాలు వాస్తవ పరిస్థితుల్లో శిక్షణ ఇప్పించి తదనంతరం ఆమెతో ఒక ఫార్మసీ పెట్టించి, దాని మీద వచ్చే ఆదాయంతో ఆమె పై చదువులకు ఏర్పాట్లు చేస్తాను. పెళ్ళి సమయంలో ఆమెకు కట్నకానుకలు ఇవ్వలేకపోవచ్చు, కానీ కుంటుపడని ఒక వ్యాపారాన్ని ఆమెకు అప్పజెప్పగలం. వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి నేను సమకూర్చగలను, డి ఫార్మసీ చదువుకు అయ్యే ఖర్చు నేను భరించగలను. ఆ శిక్షణ పొందే రెండు సంవత్సరాల్లో ఔషధ మొక్కల శోధన, ఔషధాల ఉత్పత్తి లేదా ఔషధాల నాణ్యత వంటి పై చదువుల్లో ఏదైనా ఒకదానిని ఎంచుకుని వాటిపై మున్ముందుగా జ్ఞానం ఆర్జించుకునే వెసులుబాటు కల్పించే

అగ్నిజం

అనాదిగా మానవసభ్యత పరిఢవిల్లడంలో అగ్ని యొక్క పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది, అనంతరం చక్రం మానవసభ్యత యొక్క గమనాన్ని వేగవంతం చేసింది. మునుపటి వ్యాసంలో చెప్పుకున్నట్లు కాలానికి కాంతి కేంద్రబిందువు, ఆ కాంతి ఉష్ణం మరియు వ్యాప్తి అనే రెండు గుణాలను కలిగి ఉంటుంది. దినదినప్రవర్ధమానమై సర్వత్రా వ్యాపించేవాడు విష్ణువు, అలా వ్యాపితమయ్యే విశ్వానికి మూలం చైతన్యకారకుడైన శివుడు. కాంతి ఆ శివకేశవుల సమాగమం. చైతన్యాన్ని (శివుడు) & వ్యాప్తిని (విష్ణువు) ఏకకాలంలో అనుభూతి చెందడమే ప్రకృతి, అదే పదార్థం. శివకేశవులు ప్రకృతితో సమన్వయమై జీవానికి ప్రాణం పోస్తారు. అందుకే ఋగ్వేదంలో అగ్నికి అంతటి ప్రాముఖ్యం. కానీ అగ్ని స్వయంప్రకాశకం కాదు, కనుక అది జ్వలించడానికి పదార్థం అవసరం. ఆ పదార్థమే ప్రకృతి, ప్రకృతితో సంయోగం చెందేది చిత్తం, ప్రకృతిచిత్తాలకు మార్గాన్ని సుగమం చెయ్యడం వ్యాప్తి. ప్రాకృతికచిత్తవ్యాప్తియే ఋతం! అలా అగ్ని సర్వభక్షకుడు, పావకుడు మరియు వహ్ని (ఇలా ఇంకెన్నో పేర్లతో పిలవబడతాడు). ఉష్ణమే వ్యాప్తియై, వ్యాప్తియే ప్రకృతియై, ప్రకృతియే కాలమై, కాలమే ధర్మమై, ధర్మమే ఋతమై అవిభాజ్యమైన చరాచర సృష్టికి మూలమౌతుంది. క్రైస్తవం యొ

అసమంజసమీక్షణం!

దగ్గరదగ్గర మూడు నెలల క్రితం అనుకుంటా ట్విట్టర్లో ఉండగా ఒకరు - "మీకు మహ్మదీయుడిగా మారాలి లేదా చావాలి అనే పరిస్థితి ఏర్పడితే ఏం చేస్తారు?" అని అడిగారు. "నిజాయితీగా చెప్పాలంటే ఇంతవరకూ అలాంటి సందర్భం నాకు వస్తుందనే ఊహ కూడా రాలేదు. నా దగ్గర దీనికి సమాధానం లేదు" అనే ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ బీజానికి "ది కేరళ స్టోరీ" చిత్రంలో సమాధానం లభిస్తుందని ఆశించాను, సమాధానం దొరక్కపోగా హృదయాన్ని కదిలించే మరిన్ని సందేహాలు చుట్టుముట్టాయి. నా వైయక్తిక, మౌలిక & నైతిక విలువల్ని పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిని ఈ చిత్రం కల్పించింది. అలాంటి ఒక ఉదాహరణ - "మరణం తర్వాత కాఫిర్లు నిరంతరం దోఝక్లో మంటల మీద కాల్చబడుతూనే ఉంటారు. అక్కడి మంటల వేడి భూమిమీద మంటల వేడి కంటే 70 రెట్లు అధికంగా ఉంటుంది" వంటి తలాతోకాలేని మాటలకు "ఏంట్రా ఇది, అంత ఖచ్చితంగా 70 రెట్లు అధిక వేడి ఉంటుందని చెబుతుంది. కొంపదీసి ఇదేమైనా థర్మోమీటర్ పట్టుకెళ్ళి చూసొచ్చిందా!" అనేసి మనం కాసేపు నవ్వుకోవచ్చు. కానీ ఇది ప్రతిఘటన అవ్వలేదు, వాస్తవానికి అలాంటి తింగరి వ్యాఖ్యలకు ఎలాంటి ప్రతిస్పందనా ఉండదు, ఎందుకంటే అ

మతిమయం!

ఉదయం తన కార్యాలయానికి వచ్చినప్పటి నుండి సులోచన మనసు స్థిమితంగా లేదు, ఎన్నో గంటల అంతర్మథనం తర్వాత తను అలోచనల సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా అర్థమయ్యి తన చిన్ననాటి స్నేహితురాలు జాహ్నవికి ఈ విధంగా సందేశం పంపింది - "పదేళ్ళక్రితం అర్థంతరంగా ఆగిపోయిన సంభాషణ ఇవాళ కొనసాగిద్దామా?!" అని, ఒక రకమైన అనుమానంతో మరియు కాస్త అవమానభారంతో. పదేళ్ళ క్రితం మాట్లాడటం మానేసిన సులోచన అకస్మాత్తుగా సందేశం పంపడంతో మొదట్లో జాహ్నవి విస్తుపోయినా, ఇన్నాళ్ళకైనా మాట్లాడడానికి సిద్ధపడినందుకు సంబరపడింది. "ఏమైందే? అంతా సవ్యంగానే ఉంది కదా!" అని ప్రత్యుత్తరం పంపింది జాహ్నవి. "నేను మాట్లాడాలి అన్నాను!" అని అటునుండి సందేశం. "ఇదింకా ఏమాత్రం మారలేదు!" అని ముసిముసిగా నవ్వుతూ చరవాణి అందుకుంది జాహ్నవి, సులోచనతో మాట్లాడానికి. అవతల చరవాణి ఎత్తినట్లు తెలుస్తోంది, సులోచన మాటలకు మారు బలవంతంగా పంటిక్రింద అదిమిపట్టిన మూగఘోష జాహ్నవికి వినిపిస్తోంది. ఒక్కసారిగా జాహ్నవి కంట్లో నీరు సుడులు తిరిగింది, నోరు పెగలలేదు. కాలం అలా ఎంతలా కదిలిపోయిందో ఎవ్వరూ గుర్తించలేదు, కాసేపటికి గొంతు సవరించుకున్న జాహ్నవి - &

పసిఫిక్ రిమ్ (2013) మరియు పురాణం

పసిఫిక్ రిమ్ (2013) అనే చలనచిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆ శ్రేణిలో వచ్చే కథల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని ఏర్పరచుకుంది. ఈ చిత్ర కథనం ప్రకారం భూకంపం ఫలితంగా సముద్రతలంలో ఏర్పడిన పగుళ్ళ నుండి సముద్ర అంతర్భాగాన నివాసముండే (బంధింపబడిన!) కైజు అనే రాక్షసాకారంలో ఉన్న వింతప్రాణులు భూతలంపైకి వస్తుంటాయి, భూవాసులు మానవ-యంత్ర సమన్వయంతో నడిచే యేగర్ల సహాయంతో ఆ కైజూలతో పోరాటం చేస్తుంటారు. ఈ చిత్రం చూస్తున్నంతసేపూ రామాయణం సుందరకాండలో పేర్కొనబడిన సంఘటనలే నా కళ్ళ ముందు కదలాడాయి. అందుకు కారణం మైనాక పర్వతం సముద్ర లంఘనం చేస్తున్న ఆంజనేయుడితో చెప్పిన సంఘటనల సమాహారమే! ఆ వృత్తాంతం -  పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి గరుడవేగంతో, వాయువేగంతో అన్ని దిక్కుల్లోనూ సంచరిస్తూ ఉండేవి. అలా యధేచ్ఛగా తిరిగే పర్వతాలు హఠాత్తుగా తమ మీదెక్కడొచ్చి పడతాయోననే భయంతో దేవతలు, ఋషులు, మునులు, ఇతర ప్రాణులు ఇంద్రునికి మొరపెట్టుకోగా, ఆ సహస్రాక్షుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఖండించాడు. అలా మైనాకుని రెక్కల్ని ఖండించడానికి వచ్చేలోపు వాయుదేవుడు మైనాకుడిని లవణ సముద్రంలో (హిందూ-పసిఫిక్ మహాసముద్రం, ఇప్పుడు దీన్ని

శృతిలేని చదువులు 2వ భాగం (తల్లిదండ్రులకు ప్రత్యేకం!)

"మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నార?"ని అడిగితే టక్కుమని తడుముకోకుండా - "భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి అనేక ఉన్నత శిఖరాలను అధిరోహంచాలనే ఆకాంక్ష" అని చెబుతున్నారు తల్లితండ్రులు, ఎంచుకునే భాష & పదాల్లో భేదాలు ఉండొచ్చేమో, కానీ మొత్తానికి ఇదే వారి అభిలాష. తల్లిదండ్రులకు తదుపరి ప్రశ్న - మీ పిల్లలు పెద్దయ్యాక ఏమైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈ ప్రశ్నకు వైద్యుడు (డాక్టర్), విశ్వకర్మ (ఇంజనీర్), నిఘా (పోలీస్), న్యాయవాది (లాయరు/ప్లీడరు/అడ్వకేట్ - ఈ అనువాదం తప్పు, వీటి గురించి మరెప్పుడైనా!), సాఫ్ట్వేర్, గవర్నమెంట్ ఉద్యోగం వంటి సమాధానాలు తప్పితే మరొకటి రాదు. దాదాపు 90% మంది తల్లిదండ్రులు ఈ రెండవ ప్రశ్న దగ్గర తడబడతారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ కూతురు విశ్వకర్మ అవ్వాలని తాపత్రయపడితే, తదుపరి ప్రశ్నలు - ఏ శాఖలో చేర్పిస్తారు? ఆ శాఖలోని ఏ విభాగంలో విశ్వకర్మను చేస్తారు? పైన చెప్పిన 90% మందీ పోగా తక్కిన 10%లో దాదాపు 90% మంది ఈ మూడవ ప్రశ్న దగ్గర బొక్కబోర్లాపడతారు, ఇహ మిగిలింది 1% మంది తల్లిదండ్రులు. ఆ 1%లో 90% మంది తల్లిదండ్రులైతే ఏకంగా తమ పిల్లల్ని అబ్దుల్ కలాం చేసెయ్యాలనే ఊపులో ఉ