Skip to main content

Posts

Showing posts from April, 2021

ఆకలనేదే లేకపోతే?

ఒక పెద్దాయన తన మనమరాలికి, "ఆకలి లేనిదే విశ్వం లేదు. విశ్వంలో ఉన్న ప్రతి జీవరాశి ఒక్క క్షణంలో అంతరించిపోతుంది" అని వివరిస్తున్నాడు. ఆ ముసలి తాతని చూసినప్పుడు నాకు నవ్వొచ్చింది. ఈ ముసలోడికి చాదస్తం కాస్త ఎక్కువైంది అని కూడా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఏదో పరధ్యానంలో పడి మధ్యాహ్నం అన్నం తినలేదు. కంపెనీలో పనిచేసే వ్యక్తి, "గురువా! పనిచేసేదే కడుపుకు కాసంత అన్నం కోసం. నువ్వు దాన్నే తినడంలేదు. నువ్వు ఇంకెందుకు పనిచేస్తున్నావ్?" అని అడిగాడు. ఆలోచనలో పడ్డాను... మనుషులు పొద్దున్నుండి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించేది ఎందుకోసం? డబ్బు కోసమా? పేరు కోసమా? శాంతి కోసమా? ఆకలేసిన చిన్న పొట్టను నింపుకోవడానికే కదా! కొన్నిరోజుల ముందు ఆ ముసలి తాత తన మనమరాలికి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ముసలోడికి చాదస్తం అని అనుకున్నా, కానీ మనమే మూర్ఖులం అని అర్థం అయ్యింది. కొన్ని నెలల తర్వాత ఏదో సైంటిఫిక్ పేపర్లో "ఆకలిని జయించే పరిశోధన" అనే శీర్షిక మరియు ఆ వ్యాసం చదివి మతిపోయింది నాకు.  "ఆకలి లేకుండా మనిషా? ఇదేం వింత?" ప్రస్తుతం ప్రకృతి పైన యుద్ధాన్ని ప్రకటించిన

సమాజం | నైతికవిలువలు

మనమందరం రోజువారీ కడుపు నింపుకోవడానికి చేసే ప్రయత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, సమాజాన్ని నిర్మించే నైతికవిలువలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆ క్రమంలో సమాజంలో ఉన్న వివిధ సమూహాల సాధారణ సాంస్కృతిక భావనలను, వాటి యొక్క స్వరూప-స్వభావాలను, సమాజంపై వాటివలన పడే ప్రభావాలను చాలా తక్కువగా అంచనా వేయడం మొదలుపెట్టాం. నైతికవిలువలు అనే అతిముఖ్యమైన భావనను సంస్కృతితో వేరుచేసి అందరూ ఒకేలాంటి నియమాలను ఆచరిస్తారు అనే భ్రమలో పడిపోయాం. ఈ నైతికవిలువల సమాజంలో ఉన్న అన్ని సమూహాలలో ఎందుకు ఒకేలా ఉండవో "వివాహం" అనే ఒక ఉదాహరణ తీసుకుని చూద్దాం. వ్యాసం తేలికగా అర్థం కావడానికి, భారతదేశంలో ఉన్న సమాజాలను "ధార్మిక సమాజం" మరియు "అబ్రహం సమాజం"గా గుర్తించడం జరిగింది. ధార్మిక సమాజంలో భారతదేశంలో జన్మించిన హైందవం, బౌద్ధం, జైనం, సిక్ఖు ధర్మాలను, బయటినుండి వచ్చిన కుశానులు, పారశీకులు, హూణులను చేర్చడం జరిగింది. వీటిలో అనేక సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. కానీ దాదాపుగా అన్నీ ఒకేలా ఉంటాయి. అబ్రహం సమాజంలో బయటినుండి ఇక్కడకు వచ్చిన మహమ్మదీయ, క్రిస్టియన్ మరియు యూదు మతాలను చేర్చడం జరిగింది. వ

ఆచంట పథం 01 - భాషాంతము

విక్రమశకం 2078, చైత్ర శుక్లపక్షం చైనా నుండి వచ్చిన వైరస్ ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టడానికి కొన్ని నెలల ముందు నా స్నేహితురాలి దగ్గర ఏదో గొప్ప కోసం "నాకు 4 భాషలు పూర్తిగా వచ్చు, నీకెన్ని వచ్చు?" అని కొంచెం ఎగతాళిగా అడిగాను. దానికి ఆమె సమాధానం చెప్పడం అటుంచి, నన్నే తిరిగి మరొక ప్రశ్న వేసింది; "ప్రపంచంలో ఎన్ని భాషాలున్నాయో తెలుసా నీకు?" అని. కొంచెంసేపు ఏదో కవర్ చెయ్యడానికి ప్రయత్నించాను కానీ ఉపయోగంలేకపోయింది. కొద్దికొద్దిగా భాషల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరిగింది, ఆ ఆసక్తి కుతూహలంగా మారింది. ఇలా మొదలయ్యిన నా భాషా ప్రయాణంలో మొత్తం ప్రపంచంలో 7100 రకాల భాషలు ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఈ 7100 భాషలలో, ఒక్కొక్క భాషకు ఎన్నోరకాల మాండలికాలు/యాసలు ఉన్నాయి. ఇవన్నీ లిపి ఉన్న భాషలు, మరి లిపిలేని భాషలు ఎన్నున్నాయో ఒక అంచనాకు రావడం చాలా కష్టం. ఇవన్నీ కలిపితే కనీసం 1,00,000 భాషలన్నా అవుతాయి. మన భారతదేశంలోనే లిపి ఉన్నవి, లిపి లేనివి, అనేక యాసలు/మాండలికాలు కలుపుకుని 19,500 భాషలు ఉన్నాయి. వాటిలో 22 భాషలను మన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. మిగతావాటికి ఏ ప

ధార్మికం 01 - లింగాకారమైన నగ్నదేవత

విక్రమ శకం 2078, చైత్ర శుక్లపక్షం ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో  ఒకనాడు స్నేహితులతో కలిసి పోర్నోగ్రఫీ చూస్తుండగా అనుకోకుండా స్త్రీ శిశువుకు జన్మనిచ్చే దృశ్యశ్రవణచిత్రం తారసపడింది, యథాలాపంగానే దానిని చూశాను. అది చూసినప్పటి నుండి స్త్రీ శరీర భాగాల మీద నాకున్న వ్యామోహం కొంచెంకొంచెంగా తగ్గుతూ వచ్చింది. కాలక్రమేణా స్త్రీ శరీర భాగాలను రసాస్వాదన చేస్తూ, వాటిని ఆరాధించే స్థాయికి చేరుకున్నాను. ఆ సంఘటన స్త్రీని నేను చూసే దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. కాకపోతే ఆ దృశ్యశ్రవణచిత్రం ఒక పోర్నోగ్రఫీ వెబ్సైట్లో అందుబాటులో ఉండటం నన్నెంతగానో బాధించింది. ఇంజనీరింగ్ తదనంతరం పెరుగుతున్న వృత్తిపరమైన ఒత్తిడిని మరియు ఒంటరితనాన్నిఅధిగమించడానికి సమయం చిక్కినప్పుడల్లా ధ్యానం చేయడం అలవరచుకున్నాను. కొన్నాళ్ళకు అలా చేసిన ప్రతిసారీ బంగారు వర్ణంలో ఒక జ్యోతి దర్శనమివ్వడం, ఆ జ్యోతిని అనుసరిస్తూ వెళుతుంటే విశ్వ ఆవిర్భావానికి కారణమైన జంగమ స్థానం ద్వారా ప్రయాణిస్తున్న అనుభూతి కలగడం, అదొక యోని (మహిళ జననాంగం) ఆకారంలోనున్న తలంపు క్రమేణా జ్నప్తిలోకి రావడం మొదలయ్యింది. ఆ యోనిలో నుండి అవతలి ప్రపంచంలోకి ప్రవేశించగానే, అక్కడ మర