Skip to main content

Posts

Showing posts from January, 2022

రిపెంటన్స్ | పశ్చాత్తాపం & మారుమనస్సు

ఏదైనా అపరాధానికి పాల్పడిన వ్యక్తి తను చేసిన అపరాధానికి చింతిస్తూ దానికి ప్రాయశ్చిత్తంగా ఏమైనా చెయ్యాలనుకుంటారు. ఇది మానవ జీవనంలో సహజ ప్రక్రియ. మనుషులు అనునిత్యం సంపూర్ణ వివేకంతో పూర్తిజ్ఞానంతో ఎన్నో తప్పులకు పాల్పడుతూ ఉంటారు. ఆ తప్పులను కొందరు మనఃస్ఫూర్తిగా అంగీకరిస్తారు, మరికొందరు దారిలేక అంగీకరిస్తారు. మనఃస్ఫూర్తిగా అంగీకరించే వారు పశ్చాత్తాపం చెందుతారు, ఆ అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం కోసం అన్వేషిస్తారు, చాలామంది దానిలో సఫలీకృతం ఔతారు.  ఈ మారుమనస్సు అనే ప్రక్రియతో సమూహ నమ్మకాలు (cult beliefs) సమ్మిళితమై ఉంటాయి. వ్యక్తి తను చేసిన అపరాధాన్ని అంగీకరిస్తే ఇంతకాలం కష్టపడి సాధించిన పేరు, గౌరవం, పరువు, ప్రతిష్ఠలు, మానమర్యాదలు పోతాయని తమలోతామే చింతిస్తూ ఉంటారు. తామున్న మతంలో చేసిన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్త మార్గాల కోసం అన్వేషించకుండా, మానసిక ప్రశాంతతకు అడ్డదారులు అన్వేషిస్తారు. ఇలాంటి వారి ముఖకవళికలను పసిగట్టడంలో క్రైస్తవ మాఫియా ఆరితేరింది.  క్రైస్తవ మాఫియా (సమూహ నమ్మకాల) ప్రకారం - "మనిషి స్వతహాగా పాపి, ఆ పాపం జెనెసిస్-లో అవ్వ (ఈవ్) సైతాను మాట విని జ్ఞానఫలం తినడం వలన సంక్రమించింది.

స్థితప్రజ్ఞత!

పుష్య 22 1943 | సర్వకాల సర్వావస్థల్లో మనసును విచలితం అవ్వకుండా, ఎటువంటి చింత లేకుండా మనసును నిర్మలంగా ఉంచుకునే మానసికస్థితిని స్థితప్రజ్ఞత అంటారు. ఈ ప్రజ్ఞ క్లిష్టమైన పరిస్థితులలోనే కాదు, అమిత సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా అవలంభించాల్సి ఉంటుంది, అప్పుడే అది స్థితప్రజ్ఞత అనిపించుకుంటుంది.  మనం అందరం మనల్ని మనం స్థితప్రజ్ఞులుగానే భావిస్తాం, కాకపోతే పరిస్థితి కొంచెం తారుమారవ్వగానే మన నిజస్వరూపం బయటకు వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నిజస్వరూపానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావమే మన జీవనగమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. మంచి పరిస్థితి ఎదురైనప్పుడు ఆనందంలో ఉండి మనచుట్టూ ఉన్నవారికి మంచి చెయ్యాలనిపిస్తుంది, చేదు అనుభవం ఎదురైనప్పుడు క్రోధంలో ఉండి మనచుట్టూ ఉన్నవారి గురించి పట్టించుకోవాలనిపించదు. ఇవి స్థిరమైన ఆలోచనలు కావు, పరిస్థితుల ప్రభావానికి లోనయిన మనసు యొక్క చపలచిత్తానికి నిదర్శనాలు. ఈ చపలచిత్తాన్ని మార్గదర్శనంగా తీసుకుని జీవనసోపానాలను ఎక్కితే ఒకానొకచోట ఒకానొక సమయంలో ఆ పాతమెట్లనే మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. నైతికత నశిస్తుంది, విలువలు వర్షపు నీరులా సముద్రంలో కలిసి త్రాగడానికి పనికిరాకుండా పోతాయ

జెనెసిస్ | సృజన & సృష్టి

ఇంగ్లీషు బైబిల్ | జెనెసిస్ 1వ అధ్యాయం 1వ వాక్యం : "In the beginning God created the heavens and the earth." 2019కి పూర్వం తెలుగు బైబిల్ | ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం : "ఆదియందు దేవుడు (గాడు = గాడ్) భూమ్యాకాశాలను సృజించెను." తెలుగు బైబిళ్ళలో 'క్రియేటెడ్' అనే పదాన్ని 2019కి ముందు 'సృజించాడు' అనీ, 2019 తర్వాత 'సృష్టించాడు' అనీ అనువదించారు క్రైస్తవ అనువాదకులు. ఆ వాక్యం : "ఆదియందు దేవుడు (గాడు = గాడ్) భూమ్యాకాశాలను సృష్టించాడు." ఇంగ్లీషులో గాడును 'క్రియేటర్ గాడ్' అనీ, 2019కి పూర్వం తెలుగులో గాడును 'సృజనకర్త' అని సంభోదించేవారు. అలాంటిది ఒక్కసారిగా సృజనకర్త నుండి సృష్టికర్తగా బైబిల్ గాడు రూపాంతరానికి గల కారణాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం!  'క్రియేషన్' పదం యొక్క సామాన్య అర్థం 'సృజన', అంటే "మలచడం" అని అర్థం. ఏదైనా ఒక కళాఖండ నిర్మాణం జరగాలి అంటే కళ ఎంత ముఖ్యమో ముడిపదార్థం మరియు పనిముట్లు కూడా అంతే ఆవశ్యకం. ముడిపదార్థం, కళ, కళాకారుడు, పనిముట్లు లేకుండా కళాఖండ నిర్మాణం అసంభవం. కళాకారుడు పనిముట్ల సహాయంత