Skip to main content

Posts

Showing posts from June, 2021

కువకువలు 01 - క్షోభిత బంగభూమి

విక్రమశకం 2078, జ్యేష్ఠ కృష్ణపక్షం సాంస్కృతిక భారతాన్ని భౌగోళిక భూభాగంగా మార్చినప్పుడు ఏమీ చేయలేకపోయాము... సాటి సోదరసోదరీమణులు మట్టుబెట్టినప్పుడు మిన్నకుండిపోయాము... దేశానికే అన్నం పెట్టిన తల్లి బాంగ్లాకు గర్భశోకం మిగిల్చినప్పుడూ గమ్మునుండిపోయాము... చీకటి ఛిద్రం చేసిందని ఊరకుండిపోయాము.! చెదిరిన కలలను వెతుకుతూ బ్రతుకు బావుటా ఎగరేసినంత మాత్రాన, చరిత్రకు పట్టిన చీడపురుగు నశించేనా... రక్తపు రుచి మరిగిన శత్రువు శాంతపడేనా... కామ కోరికలతో తల్లి బాంగ్లా కూతుళ్ళపై మళ్ళీ విజృంభించిన మ్లేచ్చుల పీచమణచాల్సిన సమయం ఆసన్నమైనది... భారతావని బరువు దించాల్సిన సమయం ఆసన్నమైనది... శత్రుసేనల తలలు తెగాల్సిన సమయం ఆసన్నమైనది... ----- రచన : అశ్వంత్ ఆచంట చిత్రం : జయ్ జీ   చిత్రానికి ప్రేరణ : దివ్యాన్శి శారదా

ఆచంట పథం 007 - విద్యావిశారదత్వానికి కొన్ని మచ్చుతునకలు

విక్రమశకం 2078, ఆషాఢ కృష్ణపక్షం  గత యేడాది ఇంచుమించుగా ఇదే సమయంలో వూహాన్ వైరస్ కారణంగా కుంటుపడిన దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం 20లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకెజిని ప్రకటించింది. దీనిని వ్యతిరేకించిన ప్రబుద్ధులు - "20 లక్షల కోట్ల ప్యాకేజి ఇచ్చే కంటే తలా ఒక కోటి రూపాయలు ఇస్తే 135 కోట్లతో అయిపోయేదిగా!" అనే పోస్టును మిక్కిలి ప్రచారం కల్పించారు. దీనిని నేను ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులా చూడడంలేదు, అక్షరాస్యత మాటున యువతలో అంతకంతకూ క్షీణిస్తున్న ఇంగితానికి ప్రామాణికంగా చూస్తున్నాను, దిగజారుతున్న చదువుల (విద్య కాదు!) వ్యవస్థకు నిదర్శనంగా భావిస్తునాను. భారతదేశంలోని 135 కోట్ల జనాభాకు తలా ఒక కోటి రూపాయలు ఇవ్వాలంటే మొత్తం 13500 ట్రిలియన్ రూపాయలు అవసరమౌతాయి. గత ఏడాది విదేశీమారక లెక్కల ప్రకారం చూస్తే ఇది 175 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పైబడి ఉంటుంది, ఇది అప్పటికి ప్రపంచదేశాల మొత్తం స్థూలజాతీయోత్పత్తికి దాదాపు రెండింతలు! నాకు బాధ వేసే విషయం ఏమిటంటే ఈ పోస్ట్ పెట్టినోడే అనుకుంటే, ఆ పోస్టును దాదాపు 20వేల మంది లైక్ కొట్టారు, 1000 మంది షేర్ చేశారు, 120 కా