Skip to main content

Posts

Showing posts from April, 2023

నీకెందుకే అంత తొందర, వానా?

అప్పటిదాకా మధురంగా కురిసిన వాన ఉన్నట్టుండి జ్ఞాపకాల గనిలో దాగిన ఊహల శిలాజాలను త్రవ్వి ఒక కన్నీటి గాథను వెలికితీసింది. ఆ జ్ఞాపకం స్మరణకు వస్తూనే నయనాలు వర్షిస్తున్నాయి. వెలుపల హోరుమనే వర్షధార, లోపల అలుపెరుగని జలధార, అవి రెండూ కలిసి దోబూచులాడి అంతకంతకూ తపించిపోతున్న శిథిలాల మాటునున్న నా నల్లరాతి మదిని మరింత ద్రవింపజేసాయి. వాన ఎందుకింత కఠినంగా ఉంటుంది? ఆనాటి ఎడతెరిపిలేని జడివానలో ఎందుకంత గొడవ జరిగిందో నాకంతగా గుర్తులేదు, కానీ మన ఇద్దరి మనసులూ ససేమిరా ఒప్పుకోకపోయినా మన చుట్టూ ఉన్నవారికి మనల్ని వేరుచేసే అవకాశానికి ఆనాడే పునాది పడిందన్నది మాత్రం గుర్తుంది. దగ్గరయ్యే క్షణాలు భారంగా కదిలి విడిపోయే క్షణాలు మాత్రం వేగంగా కదులుతాయి, ఎందుకో? ఏమో? అసలీ వానకు అంత తొందరెందుకు? నల్లని మేఘాలలోనూ నిలవలేదు, తెల్లని కళ్ళలోనూ దాగలేదు. నువ్వింకా గుర్తున్నావ్, నీతో గడిపిన క్షణాలు ఇప్పటికీ జ్ఞాపకం వస్తున్నాయి, గతించిన కాలం గడచిన స్మృతులను మళ్ళీ త్రవ్వి తెస్తోంది! వానా! నువ్వొక మాయావివి. నిన్ను నమ్మలేను, నమ్మకుండా ఉండలేను. నీకెందుకే అంత తొందర, వానా? ----- ప్రమేయం - వాన చెప్పే కబుర్లు చాలా రమ్యంగా ఉ

ట్రాన్స్ జెండరిజం & దేహధర్మాలు

"పురుషుడు లేదా స్త్రీ అనేటువంటి భావనలకు సంపూర్ణమైన నిర్ధారణత్వం లేద"ని కూసారు సెక్యులర్ ఇండియాకు మూడవ స్తంభమైన ఉన్నత న్యాయస్థానం ప్రధాన (అ)న్యాయమూర్తి! ఇహ రెండవ చిత్రంలో ఉన్నది స్త్రీ శరీరంలో యెహోవా యొక్క తింగరితనం కారణంగా ఇరుక్కుపోయానని భావించి పురుషుడిగా మారే ప్రయత్నంలో తన రెండు చనువులను శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని అటు పూర్తి పురుషుడిగా మారలేక, ఇటు జన్మతః ప్రాప్తించిన స్త్రీ శరీరాన్ని తిరిగి పొందలేక నట్టనడిమిట్ట ఒంటరిగా మిగిలిన నవీన నపుంసకి (స్త్రీ నుండి పురుషుడిగా మారాలనుకున్నది కనుక నపుంసకి అంటున్నాను!). ఆ చికిత్స చేయించుకున్నప్పుడు ఆమెకి 17 సంవత్సరాల వయసు కూడా నిండలేదట, ఇలాంటివారు లెక్కకు మిక్కిలి ఉన్నారని అప్రాచ్య (పశ్చిమ/పాశ్చాత్య) దేశాల సమాచారాన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. అత్యున్నత న్యాయస్థానపు ప్రధాన (అ)న్యాయమూర్తి ఇలాంటి అఘాయిత్యాలు భారతదేశంలోనూ జరిపించాలనే తలంపుతో ఉన్నట్లుగా ఉన్నాడనుకోవాలి; నేను మాత్రం ఇలానే అనుకుంటున్నాను. ఇలాంటి మనోవైకల్య ప్రభావిత దారుణాలు అప్రాచ్య దేశాల్లోనే ఎందుకని అతిగా కనిపిస్తున్నాయి? ఒక్కటే జీవితం అనే వంకర ఆ

రావణాసుర (2023) - సమీక్ష

"రేయ్! రావణాసురుడి దగ్గర సీత సంవత్సరం ఉన్నా టచ్ చేయలేదంట, ఈ రావణాసురుడికి అలాంటి ఎథిక్స్ ఏమీలేవు" అని ఉంటుంది వాక్యరచన! రవితేజ రవీంద్రగా నటించిన రావణాసుర (2023) చిత్రంలో. దృశ్యకల్పన (ఇమేజరీ) రామాయణపు ఐతిహాసిక పాత్రలకు జోడించిన విధానం బాగుంది. కాకపోతే అలా జోడించబడిన పాత్రలు ఇతిహాసానికి వక్రభాష్యాన్ని ఇవ్వడం సాధారణంగా ఎప్పుడూ కనపడేదే, ఈ చిత్రంలో మాత్రం మరింత ముందుకు వెళ్ళారు కథకులు, రచయితలు, దర్శకులు & నిర్మాతలు. ఈ చిత్రం యొక్క కథానిక ప్రకారం రావణాసురుడు సీతను అపహరించడానికి బలమైన కారణం ఉంది, హనుమంతుడు ఆ కారణాన్ని గ్రహించి నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునుంటాడు, సీతను వెతకడానికి రాముడికి సహాయం చెయ్యడానికి ఎటువంటి ప్రయత్నమూ చెయ్యడు, రాముడు రావణాసురుడి బలీయమైన కారణాన్ని మరియు ఆ కారణం వెనకున్న అత్యద్భుత ప్రణాళికను అర్థం చేసుకోకుండా పదేపదే జాను (జానకి!) కోసం రావణుడిని విసిగిస్తూ ఉంటాడు, నిరంతరం అతని పనులకు అంతరాయాలు కల్పిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే రావణుడి బహుదూరపు ప్రణాళిక & బలీయమైన కారణం తెలుస్తాయో జానకి మరియు రాముడు వారిని అష్టకష్టాలకూ గురిచేసిన రావణుడితో చేతులు కలిపి అతని లక్ష్యా

సిద్ధాంతాన్యోన్యత!

శ్రీ రామాయణం అతి కఠినమైన తాత్విక సిద్ధాంతాలను కడు రమణీయంగా మనుషుల మెదళ్ళకు ఎక్కించే అద్భుతమైన మాధ్యమం, కనుకనే అది తుప్పుపట్టిన చారిత్రక పుస్తకంగా కాకుండా జీవకళ ఉట్టిపడే ఇతిహాసంగా ప్రసిద్ధమైంది. ఉదాహరణకు రెండు సిద్ధాంతాలు : మొదటిది - కర్మలను నిర్వర్తించడమే నీ కర్తవ్యం, కర్మఫలాలపై (ఫలితాలపై) నీకు ఎటువంటి నియంత్రణ/హక్కు ఉండవు, మరియు దానిపై ఎటువంటి ఆపేక్ష ఉండరాదు. రెండవది - పూనికతో కృషిచేస్తే ఫలితముంటుంది. క్రైస్తవ/సెక్యులర్/నాస్తిక పోకడలో మునిగిన మనకు పై రెండు సిద్ధాంతాలూ పరస్పర విరుద్ధమైన భిన్న ఆలోచనా వైఖరిలుగా తోస్తాయి, కారణం అవి నమ్మే ద్వంద్వ తార్కిక పరిదృష్టి. కానీ రామాయణంలో ఈ రెండు సిద్ధాంతాలూ ఒకే విషయం గురించిన నేపథ్యంలో (ప్రస్తావన!) కానవస్తాయి, ఐతే సందర్భాలు (సన్నివేశం!) మాత్రం వేరుగా ఉంటాయి. మొదటిది రాముడి పట్టాభిషేకం సమయంలో జరిగినట్టి అపశృతుల ఫలితంగా ఏర్పడిన పర్యవసానాల రూపంలో కనబడితే, రెండవది సీతాన్వేషణకై దక్షిణదిశలో వెళ్ళిన వానరుల సంభాషణల రూపంలో కనిపిస్తుంది. మొదటిది అపాత్రులకు అనాలోచితంగా ఇచ్చిన మాటకు (చేసిన బాసకు) వచ్చే పర్యవసానాలపై మనకు ఎటువంటి నియంత్రణా ఉండదని చెబితే, రెండవద

కాలం చచ్చిపోతే?

మానవజాతి మనుగడ మొదలైన దగ్గర్నుండి పగలు రాత్రి అనే భేదాలు ఉంటూనే ఉన్నాయి, అదే మొట్టమొదటి కాలగణనగా పరిగణించబడుతుంది. తదనంతరం అనంతమైన అంతరిక్ష గర్భంలో తళతళమని మిరుమిట్లు గొలిపే అనేక తారకలు మన కాలగణనకు మూలమయ్యాయి, అలాంటి తారల్లో సూర్యుడు మన పాలపుంతకు ప్రముఖుడు; అతనే హిరణ్యగర్భుడు! సూర్యుని కారణంగానే మనకు పగలు రాత్రి అనే భేదం గోచరం అవుతోంది, దీనిని బట్టి గణించబడే కాలం సూర్యుని (నక్షత్ర) కాంతితో అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉందనే నిష్కర్షకు రావొచ్చు, దాన్ని - "కాలం యొక్క ఆవిర్భావం కాంతితో మొదలయ్యింద"ని వ్రాయొచ్చు! ఒకవేళ ఆ కాంతి అనేదే లేకపోయినట్లైతే ఉన్నదంతా చీకటే అయ్యేది మరియు చీకట్లో కాలానికి అర్థం లేదు. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుంటే మనకు కనబడేదంతా కాంతి మూలకమే, మనం దర్శించేదంతా కాలమే, ఈ చరాచర సృష్టి అంతా కూడా కాలస్వరూపమే (చూస్తున్నాం కదా, అంటే కాంతి కారణమే!). అంటే; కాలం పుట్టింది, పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు. అనగా కాలం కూడా గతిస్తుంది! కాలం యొక్క జీవన పరిమితి మన జీవన పరిమితి కంటే అధికమే; కానీ ఎప్పుడో ఒకప్పుడు అది గతించాల్సిందే! కాల మనుగడకు కర్త కాలుడు (రుద్రుడు), కాలానికి అధిపతి

శృతిలేని చదువులు!

"మా పిల్ల (పిల్లోడు) ఫలానా బళ్ళో వెయ్యక ముందు బాగా చదివేది (చదివేవాడు), ఫలానా బళ్ళో చేర్చాక నానాటికీ మరీ తీసికట్టుగా తయారౌతోంది (తయారౌతున్నాడు)" అనేటువంటి వ్యాఖ్యలు నేడు తల్లిదండ్రుల దగ్గర్నుండి వినొచ్చు. అందుకు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది - పిల్ల/పిల్లాడి స్థాయికి మించిన ఫలితాలను ఆశించే తల్లిదండ్రులు. రెండవది - డాంబికాలు పలికే బడి యాజమాన్యాలు. ఈ రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్నట్టివి, బడిని విమర్శించే సమయంలో తల్లిదండ్రులు కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేలకువేలు కట్టి బళ్ళో వేస్తే ఆ బడి యాజమాన్యాలు పిల్లల్ని ఎలా పెంచాలో మాకే బుద్ధులు సుద్దులు చెప్పడమేమిటని తల్లిదండ్రుల వరసైతే, పిల్లలకు పెట్టే పరీక్షల్లో వచ్చే మార్కులు తగ్గితే తల్లిదండ్రులు ఎక్కడ ఆక్షేపిస్తారోనని యాజమాన్యాలు (ముఖ్యంగా ఉపాధ్యాయులు & అధ్యాపకులు) ఉక్కిరబిక్కిరి అవుతుంటారు. అలా పిల్ల లేదా పిల్లోడు పరీక్ష సరిగ్గా వ్రాసినా వ్రాయకపోయినా ఉదారంగా మార్కులు వేసేసి, లిబరల్ కరెక్షన్ అంటుంటారు! మార్కులు బాగానే వచ్చాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తారు, తల్లిదండ్రుల నుండి ఆక్షేపణలు లేవని బడి

లైంగిక విప్లవం (సెక్సువల్ రెవెల్యూషన్)

బైబిల్ మిథ్యాకథనాల ప్రకారం యెహోవా ఆదాము(ఆడం)ను తన రూపంలో మట్టితో బొమ్మగాచేసి తన శ్వాసను ఆదాముకు ఊపిరిగా ఇచ్చాడు, ఆదాము కాలక్షేపానికై ఒక పక్కటెముకతో అవ్వ(ఈవ్)ను సృజించాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి మగాడు ఆదాము అయితే అవ్వే మొట్టమొదటి ఆడది, బైబిల్ ప్రకారం! ఆడ మరియు మగ కాని మరొక లింగాన్ని యెహోవా సృష్టించినట్లు బైబిల్ కథనాల్లో దొరకదు, కనుక ఆడ లేదా మగ కాని ఆ మూడవ లింగాన్ని యెహోవాచే శపించబడినవారిగా గుర్తిస్తారు యూదులు, క్రైస్తవులు & మహ్మదీయులు; అల్లాహ్ అనేది యెహోవాకున్న మరొక పేరు! తన ఆజ్ఞను ధిక్కరించి జ్ఞానఫలాన్ని తిన్నారన్న కోపంతో యెహోవా ఆదామును భూమిని దున్నమని, కుటుంబపోషణ బాధ్యతను తలకెత్తుకోమని మరియు అవ్వను గర్భం ధరించి పిల్లల్ని కనమని, అలా కనేప్పుడు నొప్పులు అనుభవించమని శపించి పరదేను తోట నుండి బహిష్కరిస్తాడు. ఈ రెండు శాపాలూ లింగ నిర్దిష్టమైనవి, ఈ నిర్దిష్టమైన శాపాలే భవిష్యత్తులో క్రైస్తవ (అ)సభ్యతకు నాందీభూతాలైనాయి. ఇహ మన కథలోకి - ప్రొటెస్టెంట్ క్రైస్తవం పరంగా యెహోవా ఒక మగవాడికి ఒక్కటే ఆడదాన్ని ఆడుకోవడానికి ఇచ్చాడు, దీన్నే మోనోగమీ అంటారు. మగాడు గాడిదలా పనిచేసి పెళ్ళాం బిడ్డల్ని పోషించాలి;

కృత్రిమగర్భం: ఆడదాని అవసరం ఎంత?

కృత్రిమ గర్భధారణ అనే ఆలోచన బీజదశలో ఉన్నప్పుడే మహిళలకు అది సైన్స్ అందించిన వరమనే ప్రచారం ఊపందుకుంది, ఫెమినిస్టుల ద్వారా! ఒకవేళ ఈ విధానంలో గర్భధారణ అందుబాటులోకి వస్తే మహిళలతో ఎవరికైనా పనుంటుందా, లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మరియు ఇంట్లో పనులు చేయించుకోవడానికి తప్పితే? ఒకవేళ ప్రపంచంలో ఉన్న మహిళలు అందరూ చచ్చిపోతే లేదా అందవిహీనంగా తయారైతే ఇదే కృత్రిమ సాంకేతికతతో మళ్ళీ ఆడపిల్లల్ని అసంఖ్యాకంగా ఉత్పత్తి (ఇదొక ఇండస్ట్రీ కదా!) చేస్తారు. అప్పుడు మహిళలకు సాధికారత లభిస్తుందా? మహిళలు లేకుండా మహిళలను ఉత్పత్తి (తయారీ!) చెయ్యడం సాధ్యమా? ఈ సందేహం వచ్చినవారికి పురుషులు లేకుండా పురుషుల్ని (పిల్లల్ని) ఎలా కనగలం అనే సందేహం కూడా రావాల్సి ఉంది, అదింకా రాలేదు! ఏదేమైనా, ఈ సాంకేతికత అంతా అప్రాచ్య (క్రైస్తవ) దేశాలలో వికసించడం కాస్త ఆందోళన కలిగించేదే, ఎందుకంటే వారి మత దృష్టి (ఎవరి తార్కిక దృష్టికైనా వారి మతమే మూల కారణం) ప్రకారం మహిళ పురుషుడి పక్కటెముక నుండి తయారు చేయబడింది. ఇక్కడ మహిళ సహకారం లేకుండానే మహిళ నిర్మింపబడింది (ఒక యంత్రంలా, యంత్రసహాయం లేకుండానే యంత్రాన్ని నిర్మిస్తాం కదా!). "ఆఫ్ట్రాల్

చట్టం నేర్పే తీర్పు!

క్రింద జతచేసిన చిత్రం లింక్డ్ఇన్ వినియోగదారుల వెర్రితనం పుణ్యమా అని ఈక్వాలిటీ చచ్చి ఈక్విటీకి ప్రాణం పోసింది (ప్రాచుర్యంలోకి వచ్చిందనేది ఇక్కడి ఉద్ధేశ్యం); తదనంతరం ఈక్విటీ చచ్చి చట్టానికి (జస్టిస్) ప్రాణం పోసింది. ఇందులో ఉన్న తార్కికాభిజ్ఞత వైరుధ్యాలపై కాస్తంత వివరణ 👇 సమాజంలో అంతర్భాగమైన జాతిజనులందరికీ ఏకరీతిన ఫలాలు అందకపోవడమే అసమానత్వమని నిర్వచించారు. ఇది చిత్రంలోని మొదటి భాగాన్ని సూచిస్తోంది. ఆ అసమానత్వానికి పెట్టబడిన ముద్దుపేరు కులవివక్ష! నేడది కులగజ్జి, కులదురద, కులతామర, కులమౌఢ్యం వంటి అనేక పేర్లతో బాగా ప్రచారంలో ఉంది. భారతద్వీపంలో అసమానత్వం వేళ్ళూనుకుపోయిందని గగ్గోలు పెట్టిన అభ్యుదయవాదులు, సాంఘిక సంస్కర్తలు, విప్లవకారులు మరియు వారి శ్రేయోభిలాషులు ఆ ఫలాలు అందరికీ సమానంగా అందడానికి వీలుగా నిచ్చెన ద్వారా సమానావకాశాలను కల్పించారు. సహజరీత్యా వంకరగా పెరిగిన వృక్షాలు వాలుగా ఒంగి ఉన్నందున ఒక ప్రక్కనున్న కొందరికి ఆ నిచ్చెనలు నిరుపయోగమయ్యాయి. దీనితో సమానత్వం అనే వాదన మట్టికొట్టుకుపోయింది. ఇది చిత్రంలోని రెండవ భాగంలో చూడొచ్చు. ఆ సమానత్వానికై వేసిన నిచ్చెనలనే మనం నేడు రిజర్వేషన్ల