Skip to main content

Posts

Showing posts from September, 2022

కథాకేళి 03 - పోటీ

అవి నేను ఇంజినీరింగ్ చదువుకుంటున్న రోజులు -  అరుణకాంతులు విరజిమ్ముతూ భూమికి పూర్వదిక్కుగా ఉదయిస్తున్న భానుడికి మార్గనిర్దేశనం చేస్తున్న ఉషస్సు అప్పటిదాకా ధరణిని అలముకునున్న చిక్కని తిమిరాన్ని నిద్రలేపుతున్నట్లుగా ఉన్నట్లున్దీనాటి ఉషోదయం. శీతాకాలపు చలికి తాళలేక దుప్పటిచ్చే వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయి ముడుచుకుని పడుకున్న నేను కూడా లేచానా తిమిరంతోపాటు , పత్రికలలో ముద్రించబడిన సమాచారాన్ని మరియు గోవుల పొదుగుల నుండి సేకరించిన పాలను ఇంటింటా అందించడానికి. సమయం ఉదయం 05:30 కావొచ్చింది , పాలు-పత్రికలు చౌరస్తాకి ఇంకా రాలేదు. ఇప్పటికే అర్ధగంట ఆలస్యమైంది , ఇంకా ఆలస్యమైతే ఖాతాదారులు గొడవచేస్తారు , నేను కళాశాలకు వెళ్ళడంలో ఆలస్యమౌతుంది , అక్కడ మా శాఖాధిపతి అగ్గిమీద గుగ్గిలంలా ఎగురుతాడని నా బెంగ. మా ఊరికి ఆంధ్రజ్యోతి , ఈనాడు , వార్త , ఆంధ్రభూమి , సూర్య , డెక్కన్ క్రానికల్ , ది హిందూ , హన్స్ ఇండియా పత్రికలు వస్తాయి , ఈమధ్య సాక్షి పత్రిక కూడా రావడం మొదలయ్యింది. మేము ఆంధ్రజ్యోతి & ఈనాడు పత్రికలు చేరవేస్తాం. ఆ పాలు-పత్రికలు తెచ్చే వాహనదారులను నోరారా తిట్టుకుని , ఈ పోటీ ప్రపంచంలో సమయాన్న