Skip to main content

Posts

Showing posts from September, 2023

మధ్యతరగతిరికం - మరికొన్ని కోణాలు!

అమ్మో ఒకటో తారీఖు (2000) చలనచిత్రంలో ఎల్ బి శ్రీరామ్ గారు పదవ తరగతి పాసైన తన మూడో కూతురితో - "ఇహ నువ్వు చదువుకోవడం ఆపెయ్యమ్మా" అంటాడు. అందుకు ఆయన - "నువ్వు పది చదివి ఆపేస్తే నీకోసం ఒక ఇంటర్ చదివినవాడ్ని తెస్తే సరిపోతుంది, నువ్వు ఇంటర్ చదివితే ఒక డిగ్రీ చదివినవాడ్ని నీకోసం తేవాలి, అదే నువ్వు డిగ్రీ చదివితే అంతకుమించి చదివినవాడ్ని తేవాలి, అందుకు తగినంత కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యాలి. ఈ మధ్యతరగతి తండ్రి దగ్గర అంత స్థోమత లేదమ్మా. అందుకే నువ్వు చదువు మానెయ్యి" అంటాడు. ఆడపిల్ల పెళ్ళిని ఎప్పుడూ ఆమె స్థాయిని మించి చెయ్యాలనే కలలు కంటారు తనల్లిదండ్రులు, ఇప్పుడున్న ఆధునిక ఒంటరి సమాజంలో కూడా ఆడపిల్లలు తమకంటే ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా అధికస్థాయిలో ఉన్న పురుషులను వివాహం చేసుకోవడానికి (అంతెందుకు డేటింగ్, సహజీవనం వంటి ఆధునిక రోగాలకు కూడా!) మొగ్గుచూపుతున్నారు. ఈ మొత్తం ప్రకరణను "టెల్ యువర్ సన్స్ దిస్" అనే ఒక ట్విట్టర్ (ఎక్స్) వినియోగదారుడు - "ఆర్థిక అసమానతలకు ఎవరో కాదు స్త్రీలే ముఖ్యకారణం అంటాడు. ఫెమినిజంను అందుకు సాధన"మని చెబుతాడు. ఆయన ఇంకా కొనసాగిస్తూ

రాక్షసోత్తముడు

రాక్షసోత్తముడు, అనగా రాక్షసులలో ఉత్తముడు. రాక్షసులలో ఉత్తముడు ఏంటండీ? ఇదేదో తేడాగా ఉంది కదా! అంటే రాక్షసజాతిలో కూడా ఉత్తములు, మధ్యములు, & ఇంక అధములు ఉంటారని మనం అనుకోవాలి. రాక్షసులలో ఉత్తముడు అంటే ఎలా ఉంటాడు? ఒక్కొక్క జాతికీ కొన్ని గుణాలు సహజంగానే పుట్టుకతో అబ్బుతాయి. ఈ ప్రకారం ఆ ఫలానా జాతి గుణాలను నూటికి నూరుపాళ్ళు ప్రస్ఫుటం చేసే లక్షణాలు కలిగి ఉండడం ఉత్తమం; వెరసి ఆ వ్యక్తి ఉత్తముడు. అలానే రాక్షసప్రవృత్తికి దూరం జరిగినవాడు రాక్షసాధముడు, విభీషణుడు ఒక ఉదాహరణ. అయితే తిన్నింటివాసాలు లెక్కపెట్టడం రాక్షస లక్షణమే కదా! మరి ఇప్పుడు విభీషణుడిని రాక్షసులలో ఉత్తముడనాలా? లేక అధముడనాలా? లేక మధ్యస్థమా! రాక్షసజాతి లక్షణాలు పుష్కలంగా ఉన్నవాడు రావణుడు, కనుక అతను రాక్షసోత్తముడు. కనుక రాక్షసులకు ఇతడు మంచివాడు! కానీ మానవత్వం, సమానత్వం, ప్రజాస్వామ్యం అనే ఆధునిక పరికల్పనలు మన దృష్టిని కలుషితం చేశాయి. అందుకే మంచి అంటే ప్రతిచోటా ఒకటే అర్థం ఉంటుందనే భ్రాంతిలో మనం బ్రతుకుతున్నాము. అందుకే "మంచి క్రైస్తవుడి"గా ఉండమని ఒక క్రైస్తవుడికి, "మంచి మహ్మదీయు"నిగా ఉండమని ఒక మహ్మదీయునికి ధర్మోపదేశాలు

సంపాదన - ఉత్తములు, మధ్యములు & అధములు

మనం ఉత్తములను, మధ్యములను మరియు అధములను సంపాదన విషయంలో కూడా చూడొచ్చు! అవసరాలు మరియు కోర్కెలు తీరుతున్నంతసేపూ అందుకు కారణమైన సంపాదన ఎక్కడనుండి వస్తోందనే బెంగ ఉండదు, అదే అవసరాలు తీరడం బహు కష్టంగా ఉన్నప్పుడు వెంటనే డబ్బు వచ్చే మార్గాలకై సంఘర్షణ మొదలవుతుంది. ఇలాంటి కుటుంబాలు అధమ కుటుంబాలు. సమయస్ఫూర్తి కలిగిన కుటుంబాలు పైన పేర్కొన్న కుటుంబాల నుండి అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవడంలో కృతకృత్యం అవుతుంటాయి. ఇవి మధ్యమ కుటుంబాలు, మధ్యతరగతనే ఆర్థికవర్గం వెనకున్న ఆలోచన ఇది; ఈ విధంగా చూస్తే నేడు మధ్యతరగతి అనే వర్గం ఉన్నట్లుగా అనిపించడంలేదు! "నేడు గడిస్తేచాల"నుకోవడమే పేదరికానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇలాంటి కుటుంబాలు మధ్యతరగతిలో ఈనాడు ఎక్కువయ్యాయి; ఇవి సంపాదన విషయంలో మెరుగ్గా ఉన్నా దాన్ని ఖర్చు పెట్టే ఆలోచనల విషయంలో అధములుగానే మిగిలిపోయారు. పారిశ్రామికీకరణ కౌటుంబిక వ్యవస్థలో తెచ్చిన అనేక పెనుమార్పుల్లో ఇదొకటి. ఉమ్మడి పరివారం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పరిష్కారమని భావించారు పెద్దలు. కర్మాగారాలు వచ్చాయి గనుక, యంత్రాలే అన్ని చేస్తాయి గనుక, మనుషులు ఎక్కువగా అక్కర్లేదు, "ఎక్కువ చేతులు

ఐరోపా మహా అంతర్యుద్ధం - 1914

నేడు మనం అందరం మొదటి ప్రపంచ యుద్ధంగా పిలుస్తున్న లేదా గుర్తిస్తున్న యుద్ధానికి "ఐరోపా మహా అంతర్యుద్ధం" అని నామకరణం చేశారు అమెరికన్లు, యుద్ధం మొదలైన మొదట్లో! ఎందుకని? ఐరోపాలోని దేశాలు, ఎంపైర్లు (సామ్రాజ్యాలు అనడం సబబు కాదు!) ఎవరి అవసరార్థం వారు వారి శత్రువులుగా భావించిన వారితోనే యుద్ధాలు చేశారు తప్పితే ఒక ఐక్య లక్ష్యం కోసం యుద్ధం చేసిన దాఖలాలు కనిపించవు. బాల్కన్ ప్రాంతాలు బాల్కన్ యుద్ధం (భాషాధారిత దేశాలకై - ఒకటే మతం, ఒకటే శరీరఛాయ వారిని కలిపి ఉంచలేకపోయింది! తర్వాత్తర్వాత ఇదే బాల్కనైజేషన్కు దారితీసింది) చేస్తుంటే, ఫ్రెంచివారు జర్మనీపై ప్రతిదాడులు చేస్తున్నారు. బ్రిటిషర్లు తమ నౌకాశక్తిని మరియు కర్మాగారశక్తిని జర్మనీ ఎక్కడ నిర్వీర్యం (దాటేస్తుందో) చేస్తుందోనని దానిపై యుద్ధం ప్రకటిస్తే, డార్డనెల్లి మార్గంపై దాడి చేసి ఆస్ట్రియా హంగేరి ఎంపైర్ ఎక్కడ దాన్ని అదుపులోకి తీసుకుంటుందోనని రష్యన్లు ఆస్ట్రియా హంగేరి ఎంపైర్ పై యుద్ధానికి దిగారు. అప్పటికే క్రమంగా పతనమౌతున్న ఒట్టోమన్ ఎంపైర్లో అక్కడక్కడా మిగిలిన భూభాగాలను సొంతం చేసుకోవడానికి అరబ్బులు చిత్తకార్తి కుక్కల్లా యుద్ధంలోకి దిగుతారు. ఇక్

పురుషులు & వారి మంత్రాలోచనలు

హనుమ ధాటికి ఖిన్నుడై లంకానగర సచివులతో రావణుడు - పురుషులలో మరియు వారి మంత్రాలోచనల్లో మూడు శ్రేణులు ఉంటాయి - ఉత్తమ, మధ్యమ మరియు అధమ. ఉత్తమ పురుషుడు అనేవాడు తన హితాన్ని కోరేవాళ్ళను, సరైన ఆలోచనలు సమర్థంగా ఇచ్చే మంత్రులతోనూ, సుఖదుఃఖాలలో తోడుండే మిత్రులతోనూ, తన మేలును కోరుకునే బంధువర్గములతోనూ ఆలోచించి పనులను ఆరంభిస్తాడు, దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. మధ్యమ పురుషుడు తానొక్కడే కార్యనిర్వహణ గురించి ఆలోచించుకుని, ఆ విషయంలో మంచి చెడులు బేరీజు వేసుకుని, నిర్ణయం తీసుకుని, ఒంటరిగానే కార్యాచరణాన్ని మొదలుపెడతాడు. {కులాభివృద్దికి మతాభివృద్ధికి ఉన్నంతలో పాటుపడేవారు ఒంటరిగానే అన్నీ చేస్తుంటారు, వీరు మధ్యమ కోవలోకి వస్తారు!}  అధమ పురుషుడు గుణదోషాలను గురించి ఆలోచించకుండా, దైవాన్ని ఆశ్రయించకుండా (విస్మరించి), ఈ పనిని నేనొక్కడ్నే సాధించేస్తాను అనే ధీమాతో కార్యాన్ని ప్రారంభించి, ఆ పనిని పూర్తిచెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తాడు. {నాస్తికులు మరియు మనుషవాదులు (హ్యూమనిస్టులు), హేతువాదులు వగైరా అందరూ అధమ కోవలోకి వస్తారన్నమాట!} 🤣  ఇహ పురుషులు చేసే మంత్రాలోచనల దగ్గరికి; మంత్రులందరూ (నేటి పరిస్థితులకు అనుగు

వారధులు-సారథులు

అందరికీ సారథ్యం వహించాలనే అంశంపై మనకున్న ఆసక్తి వారధిని నిర్మించడం మీదుండదు; ఏమంటే వారధి నిర్మాణం శ్రద్ధతో కూడినది, సారథ్యం ఆసక్తి ఉంటే చాలు. మన లౌకిక చదువులు కూడా విద్యార్థులలో సారథ్యాన్ని ప్రోత్సహించే విధంగా శిక్షణ ఉంటుందని సొల్లు చెబుతుంటారు, మోసం చేస్తుంటారు. సారథి కావాలనుకునేవారిపై, సారథ్యం వహించేవారిపై నాకు ఎటువంటి వైషమ్యాలు లేవు. కానీ "ఎందుకు నువ్వు సారథివి కావాలని అనుకుంటున్నావు?" అని ఏ ఒక్కరినైనా అడగండి, నీళ్ళు నములుతారు. "నేను మిగిలినవారి కంటే ఈ అంశాల్లో ఘనుడను, ఆ అంశాలే ఇప్పుడు జాతికి అవసరం. కనుక నేను సారథ్యం వహిస్తే జాతి అభివృద్ధిపథంలో నడుస్తుంది" అని చెప్పే సాహసం ఒక్కడూ/ఒక్కత్తె కూడా చెయ్యలేదు. అలాగన్న మరుక్షణం నుండి దోషాలు ఎంచడంతో పాటు దూషణలపర్వం ఆరంభమవుతుందనే కారణం ఒకటైతే, అలా నిర్ద్వంద్వంగా ఉన్నదున్నట్లుగా చెప్పగలిగేతంట చేవగల్గిన నాయకులలేమి మరొక కారణం. ఇదీ ప్రజాస్వామ్యం, ఏ దేశం వెళ్ళినా ఇదే ప్రజాస్వామ్యం. వ్యాపారానికి, వృత్తికి, ఆరాధనకు మరియు రక్షణకు సయోధ్య కుదిర్చే వారధిగా మారడానికి ఒక్కరూ సిద్ధంగా లేకపోవడమే మన పతనానికి కారణం. నిత్యం వల్లె వేసే ఐకమత

మధ్యతరగతిరికం!

రేపటికి నేను పూర్తిస్థాయి ఉద్యోగం మొదలుపెట్టి దాదాపుగా, రోజుల వ్యత్యాసంతో, పదేళ్ళు కావొస్తోంది. ఈ పదేళ్ళలో నేను వెనకేసుకున్నది లేకపోయినా అక్క పెళ్ళికి చేసిన అప్పులు, నా గురించి ఆలోచించకుండా (మగాడిని కదా!) అమ్మేసిన తాతల నాటి ఆస్తులు, తినడానికిలేక పస్తులున్న దినాలు, బాడిగకు ఉంటున్న ఇళ్ళలో అద్దె కట్టడానికి కూడా పైసా డబ్బు లేని క్షణాల నుండి ఇవాళ్టికి బయటపడ్డాను. ఇహ మొత్తంగా ఒక లక్షా ముప్పైఆరువేల రూపాయల అప్పు మాత్రం మిగిలింది. ఇది తీర్చడం కాస్త తేలికైన పనే, ఇప్పుడున్న ఆదాయంతో! మా అక్క ఏదో ఇల్లు కట్టేసిన స్థలం చూసిందట, భూమితో కలిపి ఆ భవనం ఖరీదు పదకొండు లక్షలట, రెండుసార్లుగా ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించారు. మా అమ్మకు మనసాగడంలేదు, కొనమని బలవంతం. నేను అర్థం చేసుకోగలను, నా పూర్వవ్యాసం కూడా అందుబాటులో ఉండనే ఉంది. కొనగలను, కానీ నాలుగున్నర లక్షలు అప్పు చెయ్యాలి. పైగా ఆ భూమికి & ఇంటికి గృహఋణం దొరకదు, వైయక్తిక ఋణం ఖరీదైనది. అంటే ఆ అప్పు తీర్చడానికి నాకు దాదాపు మరొక నాలుగేళ్ళు పడుతుంది (అత్యధికంగా 24% వడ్డీ). "ఇల్లు అనేది ఒకటి కొం(ఉం)టే పెళ్ళికి పిల్ల దొరకడం సులభం అవుతుంద"ని మా అక్క పోర