నేడు మనం అందరం మొదటి ప్రపంచ యుద్ధంగా పిలుస్తున్న లేదా గుర్తిస్తున్న యుద్ధానికి "ఐరోపా మహా అంతర్యుద్ధం" అని నామకరణం చేశారు అమెరికన్లు, యుద్ధం మొదలైన మొదట్లో!
ఎందుకని?
ఐరోపాలోని దేశాలు, ఎంపైర్లు (సామ్రాజ్యాలు అనడం సబబు కాదు!) ఎవరి అవసరార్థం వారు వారి శత్రువులుగా భావించిన వారితోనే యుద్ధాలు చేశారు తప్పితే ఒక ఐక్య లక్ష్యం కోసం యుద్ధం చేసిన దాఖలాలు కనిపించవు. బాల్కన్ ప్రాంతాలు బాల్కన్ యుద్ధం (భాషాధారిత దేశాలకై - ఒకటే మతం, ఒకటే శరీరఛాయ వారిని కలిపి ఉంచలేకపోయింది! తర్వాత్తర్వాత ఇదే బాల్కనైజేషన్కు దారితీసింది) చేస్తుంటే, ఫ్రెంచివారు జర్మనీపై ప్రతిదాడులు చేస్తున్నారు. బ్రిటిషర్లు తమ నౌకాశక్తిని మరియు కర్మాగారశక్తిని జర్మనీ ఎక్కడ నిర్వీర్యం (దాటేస్తుందో) చేస్తుందోనని దానిపై యుద్ధం ప్రకటిస్తే, డార్డనెల్లి మార్గంపై దాడి చేసి ఆస్ట్రియా హంగేరి ఎంపైర్ ఎక్కడ దాన్ని అదుపులోకి తీసుకుంటుందోనని రష్యన్లు ఆస్ట్రియా హంగేరి ఎంపైర్ పై యుద్ధానికి దిగారు. అప్పటికే క్రమంగా పతనమౌతున్న ఒట్టోమన్ ఎంపైర్‌లో అక్కడక్కడా మిగిలిన భూభాగాలను సొంతం చేసుకోవడానికి అరబ్బులు చిత్తకార్తి కుక్కల్లా యుద్ధంలోకి దిగుతారు.
ఇక్కడ ఎవరి అవసరాలు వారికి ప్రాముఖ్యం తప్పితే ఐక్య లక్ష్యం ఏముందని? వీళ్ళు వ్రాసిన సొల్లు చరిత్రలు చదివి మనవాళ్ళు ఐకమత్యంపై పాఠాలు చెప్పడం, కులనివారణా చర్యలు చేపట్టడం (అదేదో మలేరియా, డెంగ్యూ అయినట్లు!), కులరహిత సమాజాన్ని స్థాపించాలని మంకుపట్టు పట్టడం, దాన్ని నమ్మి అగ్రకుల హిందువులు బట్టలు చించేసుకుని మరీ అసమర్థులకు సమానవాటా పేరిట నెత్తిన ఎక్కించుకుని తొక్కించుకోవడం... ఏమిట్రా ఈ ఖర్మ?
ఒక శతాబ్దంగా ఐరోపాలో నెలకొన్న శాంతి, స్థిరత్వం, అభివృద్ధి అనేవి కకావికలం అవ్వడానికి ఒక చిన్నపాటి విస్ఫోటనం మరియు రెండు తుపాకీగుళ్ళు సరిపోయాయి. ఇదీ వాళ్ళ ఐకమత్యం; ఒకరిపై వీళ్ళు నమ్మకం ఉంచలేరు, అలానే ఒకరు వీళ్ళపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉంచలేరు.
వీళ్ళు మనకు దార్శనికులు, కొందరికి ఆత్మీయ తల్లిదండ్రులు!
ఆస్ట్రియా హంగేరి ఎంపైర్‌లో ఆరేళ్ళ ముందే అంతర్భాగమైన సరాయేవోలో ఉంటున్న సెర్బియన్ల హక్కుల కోసం పోరాటం చేస్తున్న బ్లాక్ హ్యాండ్ సంస్థ చేతిలో చచ్చిన ఆర్చ్ డ్యూక్ గాడికి వాళ్ళ జనంలోనే తగిన గౌరవమర్యాదలు లేవు, అతని వైఫ్ (భార్య అనడం కూడా సబబు కాదు!) కు అక్కడ ప్రవేశంలేదు. మరెందుకు ఈ పరమమూర్ఖులు సెర్బియాపై యుద్ధానికి కాలు దువ్వారు?
అసత్యప్రచారం (ప్రాపగాండా)!
"ప్రక్కనున్న సెర్బియా దేశం (ఒక బాల్కన్ దేశం) నుండి సేనలు ఆస్ట్రియా హంగేరి ఎంపైర్‌ను చుట్టుముట్టాయి, మహా సెర్బియా ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి" అనే నిరూపణ చెయ్యలేని కట్టుకథనాలు. ఏర్పడిననాటి నుండి పాకిస్తాన్ భారతదేశంపై చేస్తున్నదిదే!
ఆ ఆర్చ్ డ్యూక్ చచ్చిన 31వ రోజున సెర్బియాపై యుద్ధం మొదలుపెట్టింది ఆస్ట్రియా హంగేరి ఎంపైర్. అప్పటికే "ఐరోపా రోగి"గా పేరుమోసిన ఒట్టోమన్ ఎంపైర్ పతన అంచుల్లో ఉండడంతో రష్యా కూడా ఇందులోకి దూకాల్సి వచ్చింది. సెర్బియాపై మమకారమూ కాదు, ఆస్ట్రియన్ల ఆధీనంలో ఉన్న సెర్బియన్ల స్వేచ్ఛకూ కాదు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే "రెండంచుల యుద్ధ ప్రసరణ" అనే వ్యూహం!
కొన్ని మాసాల క్రితం అభిజిత్ చావ్డా గారు తన ధ్వనిముద్రికలో (పొడ్కాస్ట్) - "భారతదేశం, ఇది అనివార్యం, ఒకేసారి రెండు దేశాలతో మూడు దిశల్లో (చైనా మరియు పాకిస్తాన్) యుద్ధం చెయ్యాల్సిన తరుణం ఆసన్నమైతే మొదటి ఐదు నిమిషాల్లో పాకిస్తాన్ మళ్ళీ కోలుకోలేని విధంగా చెయ్యాలి. తదనంతరం పూర్తిగా చైనాపై దృష్టి సారించాలి" అన్నారు.
ఆయన పరోక్షంగా 1891 నుండి 1905 వరకూ జర్మనీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ పదవిని అలంకరించిన కౌంట్ ఆల్ఫ్రెడ్ వాన్ శ్చ్లివ్వెన్ యొక్క వ్యూహాన్ని ప్రస్తావించారు. అతని వ్యూహం - "ఎప్పటికైనాసరే ఫ్రాన్సు మరియు రష్యాలను మనం ఒకేసారి యుద్ధంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ముందుగా ఫ్రాన్సును మట్టికరిపించి (ఆరువారాల్లో!) వెంటనే రష్యాపైకి ఆ సైన్యాన్ని కూడా మరల్చాలి" అన్నారు.
దీన్ని రివాల్వింగ్ డోర్ వ్యూహం అంటారు. ముందు బలహీన శత్రువుని మట్టుపెట్టి తర్వాత బలవంతుడైన శత్రువుపై దాడికి దిగాలి. బలహీనుడు మనల్ని ఓడించేంత శక్తివంతుడు కాదు, కానీ మనం బలవంతుడైన శత్రువుతో పోరాడుతూ ఉంటే మన దృష్టిని, ఏకాగ్రతను మరల్చడంతో గెలుపును దూరం చేస్తారు ఈ బలహీనులు. ఇది బలహీనుల బలం!
ఇదంతా వ్యవధిపై ఆధారపడి ఉంటుంది, కొద్ది క్షణాలు అటు ఇటైనా ఇహ పుంజుకోవడం కష్టం. ఆ పనికిమాలిన యుద్ధంలో సెంట్రల్ పవర్స్ ఓడిపోవడానికి ఇదొక కారణం!
1914 జూలై 28న మొదలైన ఈ ఐరోపా మహా అంతర్యుద్ధం క్రిస్మస్ నాటికి పూర్తైపోతుందని అందరూ అనుకున్నారు, కానీ ఇది తెలుగు ధారావాహికలు సాగినట్లు నాలుగేళ్ళు సాగింది.
నిజ శ్రావణ బహుళ చవితి, 2080
Comments
Post a Comment