అందరికీ సారథ్యం వహించాలనే అంశంపై మనకున్న ఆసక్తి వారధిని నిర్మించడం మీదుండదు; ఏమంటే వారధి నిర్మాణం శ్రద్ధతో కూడినది, సారథ్యం ఆసక్తి ఉంటే చాలు. మన లౌకిక చదువులు కూడా విద్యార్థులలో సారథ్యాన్ని ప్రోత్సహించే విధంగా శిక్షణ ఉంటుందని సొల్లు చెబుతుంటారు, మోసం చేస్తుంటారు.
సారథి కావాలనుకునేవారిపై, సారథ్యం వహించేవారిపై నాకు ఎటువంటి వైషమ్యాలు లేవు. కానీ "ఎందుకు నువ్వు సారథివి కావాలని అనుకుంటున్నావు?" అని ఏ ఒక్కరినైనా అడగండి, నీళ్ళు నములుతారు. "నేను మిగిలినవారి కంటే ఈ అంశాల్లో ఘనుడను, ఆ అంశాలే ఇప్పుడు జాతికి అవసరం. కనుక నేను సారథ్యం వహిస్తే జాతి అభివృద్ధిపథంలో నడుస్తుంది" అని చెప్పే సాహసం ఒక్కడూ/ఒక్కత్తె కూడా చెయ్యలేదు. అలాగన్న మరుక్షణం నుండి దోషాలు ఎంచడంతో పాటు దూషణలపర్వం ఆరంభమవుతుందనే కారణం ఒకటైతే, అలా నిర్ద్వంద్వంగా ఉన్నదున్నట్లుగా చెప్పగలిగేతంట చేవగల్గిన నాయకులలేమి మరొక కారణం.
ఇదీ ప్రజాస్వామ్యం, ఏ దేశం వెళ్ళినా ఇదే ప్రజాస్వామ్యం.
వ్యాపారానికి, వృత్తికి, ఆరాధనకు మరియు రక్షణకు సయోధ్య కుదిర్చే వారధిగా మారడానికి ఒక్కరూ సిద్ధంగా లేకపోవడమే మన పతనానికి కారణం. నిత్యం వల్లె వేసే ఐకమత్యం అనేది పైపైన కనపడే పొర, సయోధ్య కుదర్చగల వారధుల లేమినే ఓటమికి అసలు కారణం.
సారథ్యానికి మనమిచ్చే ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యాన్ని వారధ్వానికి కూడా ఇవ్వడం ఆరంభించాలి. ఎవరికివారుగా స్వబలం ఆలంబనగా రక్షించుకోవడానికి తప్పితే కలిసికట్టుగా ఏకమై రక్షించే అంశాలు లేనప్పుడు ఐకమత్యం నినాదాలతో మకిలి పడుతుంది. అలాంటి అంశాలను రూపొందించడంలో హిందూ సమాజం విఫలమైంది. అందుకే ఒకప్పుడు వామపక్ష కుక్కలకు బానిసత్వం చేస్తే, ఇప్పుడు ఖాకీ నిక్కర్లకు దాస్యత్వం చేస్తున్నాం.
వారధిని కట్టనివాడికి సారథ్యం వహించే అధికారం ఉండదు.
అధికారం హక్కు కాదు, ఎవడుపడితేవాడు ఎంత కావాలంటే అంత ఎవడికిపడితేవాడికి పంచివ్వడానికి.
అధికారం అర్హతతో వస్తుంది, సారథ్యం బాధ్యతతో వస్తుంది, వారధ్యం కర్తవ్యం.
ఎలాంటి వారధులు కావాలి? ఎన్ని వారధులు కావాలి అనేది నిర్ణయించుకోలేని దుస్థితి హిందువులది. అందుకే అన్నిటికీ లౌకిక ప్రభుత్వానిదే బాధ్యత అనే నిందారోపణలు.
నిజ శ్రావణ బహుళ పాడ్యమి, 2080
Comments
Post a Comment