Skip to main content

Posts

Showing posts from August, 2021

భాషానువాదం 01 - ఆఫ్ఘనిస్థాన్లో ఆఖరి హిందువు

విక్రమశకం 2078, భాద్రపద పౌర్ణమి  ఆఫ్ఘనిస్థాన్ నుండి పారిపోకుండా అక్కడే ఉన్న ఆఖరి హిందువు ఒక హిందు పూజారి (హిందు ప్రీస్ట్). ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చెరిగిపోని చరిత్రలో శాశ్వతమైన గుర్తింపును హిందువులు ముద్రించగలిగారు అంటే ఇలాంటి వీరోచిత పోరాటాల ఫలితమే. ఆఫ్ఘనిస్థాన్ నుండి ప్రాణాలకు భయపడి పలాయనం చిత్తగించకుండా, పూర్వం నుండి వస్తున్న దేవతారాధనను కొనసాగిస్తున్న ఆ ఒంటరి హిందువు యొక్క ముఖచిత్రం హిందు నాగరికత చరిత్రలో ఒక మైలురాయిగా స్థిరపడుతుంది మరియు ఆఫ్ఘనిస్థాన్లో హిందు ధర్మం ఎలా నాశనం కాబడిందో భవిష్యత్తు తరాలకు ఒక పాఠంలా నిలిచిపోతుంది. ఆఫ్ఘనిస్థాన్ త్వరలో "ఇక్కడ కాఫీర్లు ఎవ్వరూ బ్రతికిలేరు" అనే బ్యానర్లు కట్టడం మొదలుపెట్టొచ్చు.! ఈ సంఘటన బహుభయంకరమైన సత్యాన్ని ప్రకటిస్తుంది, ఇది మాటల్లో చెప్పలేని ఉద్విగ్నత. ఈ అంతానికి ఆరంభం కొన్ని శతాబ్దాల క్రితం "మోమిన్లు/నమ్మకస్తులు" & "కాఫీర్లు/అపనమ్మకులు" అనే విభజన ఆధారం అయ్యింది, వీరిమధ్య జరిగే యుద్ధం కాఫీర్ల వినాశనంతోనే ఆగుతుంది అనే భయం అందరిలో నిగూఢంగా దాగి ఉంది. ఈ అమానుషంలో చివరి అంకం వందల సంవత్సరాల పూర్వం

కథాకేళి 02 - అతనితో ఒక రాత్రి!

అతనితో ఒక రాత్రి.! జాబిలమ్మ వెలుగులో, చల్లగాలి హాయిలో, ఆరుబయట వనంలో, అద్దాలమేడ లాంటి ఊహల్లో అతనితో గడిపాను ఆ రాత్రి. అతని కళ్ళలో ఏదో తెలియని కొరత, ఎవరికోసమో ఆగని వెతుకులాట, ఎవరినో కలవాలనే ఆత్రుత, కంటికి కనిపించని అశ్రువులు నాకు కనిపించాయి. అతని ముఖంలో అంతులేని ఆవేదన ఏదో ఉంది, ఆప్యాయత తరగని భావం ఉంది, అనురాగం నిండిన అతని చూపులు నా మనసు పొరల్లో దాగున్న ప్రేయసిని తట్టిలేపాయి. అతని బాధను చూడలేకపోయాను. అతని కళ్ళలోకి ఆరాధనగా పరికించి చూశాను, అతన్ని కామించాను, కవ్వించాను, మనసుని రెచ్చగొట్టాను. చివరికి అతన్ని ఈలోకంలోకి తీసుకువచ్చాను. అతని చేతిని తీసుకుని నా భుజమూ స్థనమూ కలిసిన జంగమస్థానం పైన అదిమాను, అతని మరొక చేతిని నాభికీ పిరుదులకూ మధ్య ఉన్న నడుముపై ఆనించాను. ప్రాణం వచ్చినట్లు అతను చిరునవ్వు నవ్వాడు, ఏదో తెలియని వెలితితో... ఆ నవ్వులో ఎంతో ప్రేమ దాగుంది. అది ఎవరికోసమో నాకు తెలీదు కానీ నాకోసమైతే మాత్రం కాదు, అనే స్పృహ ఉంది నాకు. కానీ అతని నవ్వుల పాలసముద్రంలో నన్ను నేను మైమరచిపోయాను, అందులో ఓలలాడే కలువనవ్వాలని ఆశపడ్డాను. నాలో ప్రేమ కోరికలు అదుపుతప్పాయి, అతనికి నా కళ్ళతోనే సైగ చేశాను, నా మనసున ఉ

సేకరణ 01 - ఇది కథ కాదు!

విక్రమశకం 2078, శ్రావణ శుక్లపక్షం ఫేస్బుక్ లో ఆడపేరు కనపడగానే ముందువెనుకా చూడకుండా అర్జెంటుగా లైకు కొట్టడమే 'పొగ'ధీరులకు... అసలు పోస్ట్ చదవ కుండానే ఆహా ఓహో సూపర్ కెవ్వుకేక అని కామెంట్ వెయ్యడమే 'కక్కుర్తి'పోషకులకు... అస్తమానం ఆడవాళ్ళ అందం గురించి అబద్ధాల రోకట్లో నిజాలను రుబ్బే 'ని'సౌందర్యోపాసకులకు... తాము పొగిడేవారు చేసేది తప్పు అని తెలిసినా నిజం చెప్పకుండా, నిప్పులో ఉప్పు వేసి తగాదాలు పెట్టే 'దగాకోరు'లకు... తడబడి పొరబడినా సరిదిద్దుకునే ఆస్కారం ఇవ్వకుండా, రెచ్చగొట్టి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే 'ని'శారదులకు... అమాయకత్వాన్ని అహాన్ని అజ్ఞానాన్ని తమ స్వార్థానికి అనుకూలంగా, ఆర్జన మార్గంగా మలచుకుని బ్రతక నేర్చిన 'బేతాళు'లకు... హద్దుమీరిన ఆకతాయితనంతో, అవసరంలేని వెకిలితనంతో, శృతిమించిన పొగడ్తలతో మునగచెట్టు ఎక్కించి మితిమీరిన స్వేచ్ఛావాదాన్ని నూరి పోసి జీవన గతిని మార్చే 'అ'రాజకీయవాదులకు... ద్వంద్వ ప్రమాణాలతో బాధ్యత లేని హక్కుల భ్రమలు కల్పించి బ్రతుకును బజారుకు ఈడ్చి చోద్యం చూసే వి'పరీత'దూషకులకు.... చీటికీమాటికీ, ఉన్నదానికీ లేనిదాన

కథాకేళి 01 - బీటలువారిన గోడ

విక్రమశకం 2078, శ్రావణ శుక్లపక్షం ఎన్నో దశాబ్దాల నుండి రాజదుర్గాన్ని (కోటను) రక్షిస్తూ వస్తున్న బలిష్టమైన ప్రహరీగోడలో కాలానుగుణంగా కలిగే మార్పుల వలన చిన్నచిన్న పగుళ్ళు రావడం మొదలయ్యాయి. ఎక్కడినుండి వచ్చిందో తెలియదు, ఒక కాకి తన ముక్కుకు చిన్నపాటి విత్తనాన్ని ఒకదాన్ని గోడలో వచ్చిన పగుళ్ళలో విడిచింది. "ఏ చెట్టు విత్తనానివే నువ్వు, నా దగ్గరికి వచ్చావు? నేనెవరో తెలిసే ఇంత సాహసం చేశావా?" అని ఆ ప్రహరీగోడ విత్తనాన్ని గద్దించింది. దీనికి ఆ విత్తనం "ఇందులో నా తప్పు ఏమీలేదు, కాకి ఆహారం తినేసమయంలో దాని ముక్కుకి నన్ను కరుచుకుని, ఇక్కడ విడిచింది" అని సమాధానం ఇస్తూ, "ఇంతపెద్ద రాజదుర్గానికి రక్షణ కల్పిస్తున్నావు. పిసరంత కూడా లేను నేను, బయట నా ప్రయాణానికి భద్రతలేదు, నాకు కూడా ప్రాణహాని లేకుండా కాపాడవూ..." అంటూ ప్రాధేయపడింది. ఆలోచనలో పడ్డ ప్రహరీగోడ, "ఇంత చిన్న విత్తనం నన్నేమి చేస్తుందిలే, అయినా నా స్వలక్షణం ప్రకారం శరణు కొరినవారికి రక్షణ ఇవ్వడం నా విధి, కర్తవ్యం మరియు ధర్మం" అని తనలో తాను సమాధానం చెప్పుకొని, ఆ విత్తనానికి కొంత చోటిచ్చింది మన పరోపకారి ప్రహరీగోడ. రో

తాళిబొట్టు తాకట్టు.!

తాళిబొట్టు తాకట్టు.! మహారాష్ట్రలోని భివాండి ప్రాంతానికి చెందిన శృతి గంజి(35) హితేష్ వాలా(32)తో గత కొంతకాలంగా చనువుగా ఉంటోంది. ఈ చనువు శారీరక సంబంధంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇద్దరూ కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై శృతి తన భర్త ప్రభాకర్ గంజి(43) నుండి విడాకులు కోరింది. ప్రభాకర్ ఈ నీచమైన ఆలోచన నుండి బయటకు రావాలని హితవు పలికాడు, ఇంతకుముందులా అన్యోన్యంగా జీవితం గడుపుదామని ఆమెను బ్రతిమిలాడాడు. ప్రభాకర్ తో వైవాహిక జీవితంలో తృప్తిలేని శృతి తన ప్రియుడు హితేష్ మరియు ఆమె స్నేహితురాలు ప్రియా నికమ్(32)లతో కలిసి సంతోష్ రెడ్డి(26) అనే కిరాయి హంతకుడిని ₹.4 లక్షల రూపాయలకు బేరం మాట్లాడుకుని హత్యకు పురమాయించింది. బజానా కింద లక్ష రూపాయలు ఇవ్వడానికి భర్త తరపువారు చేయించిన బంగారు నగలు మరియు తాళిబొట్టు తెగనమ్మి ఇచ్చినట్లు, మిగతా 3 లక్షలు పని పూర్తయ్యాక భర్త ఆమె పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపెట్టింది శృతి. పోలీసులు శృతితో సహా అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు హితేష్, ఆమె స్నేహితురాలు ప్రియా మరియు కిరాయి హంతకుడు సంతోష్ లను అదుపులోకి