Skip to main content

Posts

Showing posts from May, 2021

నా గురించి ఉన్న కొన్ని అపోహలకు వివరణ!

నా గురించి కొన్ని అపోహలు నడుస్తున్నాయి. ఇవాళ వాటికి చరమగీతం పాడదామని నిర్ణయించుకున్నాను. నేను బ్రాహ్మణుడిని అనేది ఒక అపోహ. నేను శూద్రుడిని, నాది కాపు జాతి, కృష్ణాజిల్లా నాయుడు కులం.  నేను బ్రాహ్మణ పక్షపాతిని అనేది మరొక అపోహ. వ్యక్తికి జరిగే అన్యాయాన్ని అడగడం & చెప్పడం తప్పైతే, అవును నేను పక్షపాతినే... అన్యాయం ఎవరికి జరిగితే వారి వైపునే నిలబడే పక్షపాతిని నేను. నేను బ్రాహ్మణత్వంలోకి దూకాలని భావిస్తున్నాను అనేది అర్థంలేని వాదన. నేనేంటో నాకు తెలుసు, నా కులం పరిమితులు మరియు శక్తి-సామర్థ్యాలు నాకు తెలుసు, వర్ణాశ్రమంలో నా జాతి-కులం యొక్క స్థాయి నాకు తెలుసు. నా జాతి-కులానికి నేను ఎంతవరకు ఉపయోగపడగలను, తద్వారా సమాజ నిర్మాణానికి ఎంతవరకు దోహదపడగలను అనేది తప్ప నాకు ఇంకొక ఆశా లేదు, ఆలోచన అస్సలే లేదు. ఇహ అసలు విషయానికి వస్తే, బ్రాహ్మణులతో నేను సమానం కాదు, కాలేను కూడా. వాళ్ళని వ్యతిరేకించే (ఈమధ్య ఇది ద్వేషంగా మారింది) వారు ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే వారితో పోటీపడలేక అనేది మాత్రమే సత్యం. ఒక వ్యక్తితో పోటీపడలేనప్పుడు నలుగురు వెధవలను తీసుకెళ్లి ఆ వ్యక్తిని తన్నించడం అనే మానసిక స్థితి ఇక్కడ పనిచేస్త

మానసికస్థితి | మరణం & గౌరవం

కొన్ని రోజుల క్రితం చైనీస్ వైరస్ వలన చనిపోయిన హిందువుల దహన కార్యక్రమాలను కొన్ని జాతీయ & అంతర్జాతీయ పత్రికల ముఠాలు చాలా నీచంగా ప్రదర్శించాయి. ఇవి చూసినంతసేపూ నాకు వారు పొందిన పైశాచిక ఆనందం కనిపించింది. నేను వ్యక్తిగతంగా చాలా చింతించాను. నాలో మొదలయ్యిన "మరణించిన వ్యక్తులకు మనం కనీస గౌరవం ఇవ్వలేని దౌర్భాగ్య సమాజంలో ఉన్నామా?" అనే భావోద్వేగం క్రమేణా ఈ వ్యాసంగా రూపుదిద్దుకుంది. భారతీయ సంస్కృతి మరియు హిందూ నాగరికత ప్రకారం మరణం అనేది, ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని వెతుక్కునే ప్రక్రియ. అలా వెతుక్కునే ఆత్మ యొక్క పూర్వపు జన్మకు సంబంధించిన అన్ని వస్తువులను దహనం చేయడం కొన్ని సాంప్రదాయాలకు మరియు జాతులకు ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం, పరంపర. ఈ ఆచారానికి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాష్యం చెబుతూ ఉంటారు, కొంతమంది దీనికి సైన్స్ ను కూడా జోడిస్తూ ఉంటారు, మరికొందరైతే ఈ ఆచారానికి ఎండు తాటాకులు కట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. నేను సైన్స్ కు దాని అర్హతకు మించిన ప్రాధాన్యం ఇవ్వను. కనుక, ఈ ఆచారం వెనుక ఉన్న తాత్వికతను మరియు బ్రతికి ఉన్న వారిగా చనిపోయిన వారి శరీరాలతో మనం వ్యవహరించాల్సిన కనీస