Skip to main content

Posts

Showing posts from March, 2022

భాషానువాదం 02 - కాశ్మీరీ హిందువుల 7వ నరమేధం (జనవరి 19 1990)

విక్రమశకం 2078, ఫాల్గుణ కృష్ణపక్షం  కొంతకాలం క్రితం జనవరి 19 1990నాటి కాశ్మీరంలోని విధివికటించిన పరిస్థితుల మీద ఒక వ్యాసం వ్రాశాను; దాని శీర్షిక - "జనవరి 19 1990ని కాశ్మీరలోయవాసుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?" ఒకరోజున నేను వ్రాసిన పుస్తక పరిచయ కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రసంగం మరియు సుదీర్ఘమైన ప్రశ్నోత్తరాల అనంతరం ఆ సభలోని ఒక యువతి అడిగిన ప్రశ్న - "పొరుగింటివారి భాగస్వామ్యం లేకుండా జాతినిర్మూలనకై జరిపే నరమేధం సాధ్యమవ్వదని మీరెందుకన్నారు?"  క్రమానుగత హత్యాకాండ ద్వారా అంతమొందించబడిన కాశ్మీరీ హిందువుల జీవనశైలిని విశదీకరిస్తూ నేను వ్రాసిన కాల్పనిక కథానిక 'ది ఇన్ఫిడెల్ నెక్స్ట్ డోర్' యొక్క పరిచయ ప్రసంగాలు చివరిదశలోనున్న రోజులవి. ప్రతి ప్రసంగంలోనూ కాశ్మీరీ పండితులు నాతో సభావేదికను పంచుకున్నారు. కాశ్మీరీలు ఆ బలవంతపు బహిష్కరణ ఘట్టాన్ని నెమరువేసుకునే సమయంలో వారిలోని భావోద్వేగాల పచ్చిగాయాలు సుస్పష్టమవ్వసాగాయి, పర్వతపు పగుళ్ళనుండి పారే నీటిధారలా వారి ఉద్వేగాలు పారాయి. వారి బాధాతప్త భావోద్వేగాలు దశాబ్దాల తరబడి సీసాలో బంధింపబడి ప్రాపంచిక చక్షువులకు కనపడబడకుండా