మానవ మస్తిష్కంలో రూపుదిద్దుకునే ఆలోచనలు మానవాళి జీవనసభ్యతకు నాంది మాత్రమే కాదు పునాది అని నేను విశ్వసిస్తాను. నూతనంగా చెలామణీలో ఉన్న ఆలోచనలు మానవ మస్తిష్కంలో రూపుద్దిద్దుకోవడానికి మునుపే వాటివైపుగా మనిషిని నడిపించే ఎన్నో వర్ణనాతీత అంశాలు మానవులను ప్రభావితం చేస్తాయనేది అనాదిగా ఉన్న కొట్టిపారెయ్యలేని వాదన, నేను కొద్దోగొప్పో ఆ వాదనతో ఏకీభవిస్తాను. ఈ బ్లాగునందు సంఘసమాజాలలో నేను గమనించిన విశేషాలను, వాటిని చూసే నా దృక్కోణాలను తత్ఫలితంగా నేను ఏర్పరచుకున్న దృక్పథాలను ఇతివృత్తాలుగా మలచుకుని దేశీయమాధ్యమ సహకారంతో కథామార్గం ద్వారా నలుగురితో పంచుకునేందుకు వినియోగంలోకి తేవడమైంది.
సాంఘికుడిగా నాకున్న బహుముఖ అభిరుచులను మూలబిందువులుగా చేసుకుని నా ఈ బ్లాగును నిర్వహిస్తాను. భారతగాథను "భిన్నత్వంలో ఏకత్వం" నుండి కాకుండా "బహుళత్వంలో వైవిధ్యం, వైవిధ్యంలో ఏకత్వం" వైపుకు మరల్చాలనేది నా అభిలాష.
Comments
Post a Comment