Skip to main content

Posts

Showing posts from June, 2023

సంక్లిష్ట ఆలోచనలు

ఆలోచనలు రాటుదేలి పదునుగానూ మరియు చురుకుగానూ ఉండాలంటే ఏం చెయ్యాలి? సాంఘికంగా సంక్లిష్టమైన అలోచనలపై తీక్ష్ణంగా శ్రద్ధ పెట్టాలి. సంక్లిష్టమైన ఆలోచనలంటే ఎలా ఉంటాయి? మూడు ఉదాహరణలు చెబుతాను. మొదటిది | అప్వర్డ్ సహవ్యవస్థాపకుడు ఆశిష్ ధర్ పరంపరగా సంక్రమించిన కులవృత్తుల గురించి ఒక సందర్భంలో ఇలా అంటాడు - "మీకు ఇవి నచ్చలేదు, క్రైస్తవ విలువలతో కూడిన సెక్యులర్ విద్యను అభ్యసించాలని, ధనానికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు. సంతోషం, వెళ్ళండి, రాజకీయ స్వాతంత్య్రం సాధించిన తర్వాత దేశంలో విధివిధానాలు అందుకు అభ్యంతరం కూడా చెప్పడంలేదు. కానీ, నాలాంటి ఒకడు తన తండ్రి తాతలు ముత్తాతలు ఆచరించిన అదే వృత్తిని ఆచరించాలని భావిస్తే అదేదో మహాపాపకార్యమైనట్లు రగడ సృష్టిస్తున్నారు. మీ హక్కులకు ఉన్న ప్రాముఖ్యత నాలాంటివారి హక్కులకు ఎందుకు ఉండడం లేదు?" రెండవది | వంశీ జూలూరి గారు హేలీ కళ్యాణ్ గారితో జరిపిన ఒక ముఖాముఖిలో - "హారిజాంటల్ కోయర్షన్ ఆఫ్ వర్టికల్ ట్రాన్స్మిషన్స్" అనే వాక్యాన్ని ప్రయోగిస్తారు. నిఘంటువులను వెతికేసి అనువాదం చెయ్యడం వలన ఉపయోగం శూన్యం, ఆ మాటల వెనకున్న రసాభావం తెలిసి ఉండాలి. ఇక్కడ వర

నిర్లిప్త హైందవం!

గడచిన మూడు రోజులుగా తమిళనాడు చిదంబరం నటరాజ స్వామి దేవాలయం అక్కడి దేవాలయాలను దోచుకునే సంస్థ ద్వారా ఎన్నో చిక్కులను ఎదుర్కుంటోంది, కానీ మన ఇక్కడి చిన్నాచితకా హిందూ సంస్థలు & అనుయాయుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉన్న కరుడుగట్టిన హిందువులు స్పందించడానికి ఎంచుకున్న అంశం తులసీ చందు! 🤦  క్రైస్తవ సెక్యులరిజం పద్ధతి మనలో కొందరికి నచ్చలేదు, సరే! అందుకని దాన్ని అరిగిపోయిన రికార్డర్ మాదిరి పదేపదే వాయించాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన సెక్యులరిజం (లౌకికత/లోకంతీరు) ఉనికిలోకి రావడానికైనా మనం ఏం చెయ్యాలో అది చెయ్యడంలో విఫలం అవుతున్నాం. గుడిని ఒక ఆర్థిక వనరుగా చూసే క్రైస్తవ సెక్యులరిజం మధ్యనా గుడితో ఏమాత్రం అవినాభావ సంబంధం లేని మన మధ్యనా తేడా ఏంటి? పుట్టినరోజునో, పెళ్ళిరోజునో, లేదా ఇంకేదో శుభదినానో కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళి, బొట్టు పెట్టుకుని, భగవన్నామస్మరణలో కాలక్షేపం చేసి, నాలుగు కొబ్బరికాయలు కొట్టేసి, రెండు సెల్ఫీలు తీసుకునే మన దృష్టిలో గుడి అంటే ఏంటి? పెద్ద తేడా లేదు, నాకు అంతగా తేడా కనిపించడం లేదు! ఇంగితం ఉన్నవారైనా కనీసం గుళ్ళను హిందువులకు మిగిలిన ఆఖరి శక్తినాభిగానైనా చూస్తారేమో అనుకుంటా!

Post Number - 07, Sizing the defect

Ashadha Shukla Ekadashi 2080 Keeping a scale or tape adjacent to the identified discontinuities (and defects) is the correct way to take the pictures and send them to the concerned department thereafter. If not done like this, the picture may get misused. Trust issues? Choose a pic and zoom maximum. Now imagine that there is no tape/scale adjacent to identified discontinuity, what do you see? A small porosity looking like a red gaint that is about to eat the empire state building of America, right?! And that infuriates production managers, supervisors and welding engineers. Chairman may even call them to his/her cabin, which leaves a bad experience. Some determined individuals (or colleagues) often follow this method to arm twist the marked person.

మతిమయం - 04వ భాగం

"ఏయ్, జిత్తూ! ఏంటి నువ్విక్కడ?" అంటూ ఇంద్రజిత్తును ముదావహంగా పలకరించింది సులోచనతో కలిసి దుర్గమ్మ సన్నిధికి వచ్చిన జాహ్నవి. "ఆ, పొద్దున్నుంచి ఖాళీగా ఉంటేనూ... కాసిని కొబ్బరికాయలు కొడదామని ఇటుగా వచ్చాను జాహ్నవిగారూ!" అంటూ నవ్వందుకున్నాడు ఇంద్రజిత్తు. అందరూ కాసేపు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. "అన్నట్లు చెప్పడం మరిచిపోయాను. ఇది నా స్నేహితురాలు, సులోచన, ఇవాళ పొద్దునే హైదరాబాద్ నుండి వచ్చింది మా ఇంటికి. లోచనా... ఇతను ఇంద్రజిత్తు, మేము ఉండే భవంతిలో పక్క ఇంట్లో ఉంటాడు" అంటూ ఇద్దర్నీ ఒకరినొకరికి పరిచయం చేసేసింది జాహ్నవి. "నేనొచ్చి చాలాసేపయ్యింది జాహ్నవిగారూ, మీరు ఏమీ అనుకోకపోతే నేను బయలుదేరుతాను. ఇంటికి వస్తారుగా అక్కడ అంతా తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం అండి" అని ఇంద్రజిత్తు అంటుండగా, "ఆహా! మేమేమైనా అనుకుంటే ఎక్కడికీ వెళ్ళకుండా మాతోనే ఉంటారాన్నమాట" అనేసింది సులోచన, చాలా దగ్గరైన మనిషితో అన్నట్లుగా. "తప్పేలాలేదుగా..." అని నవ్వుకుంటూ "మీ అజ్ఞ మహారాణీ, సెలవివ్వండి" అన్నాడు అంతే కొంటెగా ఇంద్రజిత్తు. "అదలాన

అశోకవనాన జనకసుత జానకి!

వేదవేదాంగాలలో నిష్ణాతులైన బ్రహ్మరాక్షసులు చతుర్విద వాద్యములతో కావిస్తున్న వేదఘోషలకు పులస్త్య వంశజుడు విశ్రవసుని పుత్రుడు అయిన దశకంఠుడు సకాలంలో మేల్కొని ముందునాటి రాత్రి ప్రియసతులతో జరిపిన సరససల్లాపాలకు చెదిరిన హారాలను, జారిన వస్త్రాలను, నలిగిన కురులను సర్దుకుని, మైథిలిపై మనసు చావనివాడై, మదోన్మత్తుడై, కామాతురతను తట్టుకోలేనివాడై నల్లనికురులుగలది, చక్కని కటిప్రదేశముగలది, వక్షఃస్థలమును అనువుగా సర్దుకుని కూర్చున్నది, నేత్రసౌందర్యముగలది ఐన సీతను చూడడానికి అశోకవనానికి వెనువెంటనే బయలుదేరెను. అప్పుడా సీతమ్మ ఆ ప్రమదావనములో ఎలా ఉంది? రావణుని చూచిన మరుక్షణమే ఆ సౌశీల్యవతి పెనుగాలికి కంపించిన అరటిచెట్టు వలె కనిపించెను. విశాలనేత్రాలుగల ఆమె పొట్టను తొడలతో, వక్షఃస్థలమును చేతులతో కప్పుకుని శోకార్తయై కూర్చున్నది. నట్టనడి సముద్రంలో ఇరుక్కుపోయిన చిన్నపాటి నావ వలె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది, భర్తకు దూరమైన ఆమె కఠోర తప్పసుతో కటికనేలపై కూర్చుని ఉంది. శరీరం ధూళితో దుమ్ముతో కప్పబడి ఉంది, గాలిని మాత్రమే ఆహారంగా భుజించడం చేత దేశం శుష్కమై, ధూమకేతువుకు ప్రభావానికి లోనైన రోహిణివలె ఉన్నది. దుఃఖాలకు అంతమే లేదా అనున

Post Number -06, Mindset or Muscle Memory?

Ashadha Shukla Shashthi 2080 This is a segmented photograph of a 1.5mtr long linear weld performed with SMA welding process. As one can see, the weld is everything but staright! When I enquired the responsible welder about it, "sir! I thought this weld might be level grounded (to match the surface of parent material) later. So I paid little to no attention while welding that joint" said. But customer drawing and work instructions were clearly showing that it stays no grinding (removal of weld reinforcement) is permitted. People higher up in the order often think that this has to do with mindset of an employee, a welder in this case. But the truth is far from it, actually it has to do with muscle memory. He has been doing this deviating welds all the day long in dry (not leak proof) joints & nobody cared beacuse they are not in the category of "much" necessarily important. Muscle memory such a thing it doesn't think much on anything, it just acts

Post Number - 05, Advesristy of Restraint

Ashada Shukla Vidiya 2080 Luxuriant tack weldment to restrain deflection of a radiator pipe flange has caused this parent material damage. It needs to be inspected with DPT (NDT) to ensure there are no fissures, splits, pinholes, fractures & cracks underneath this discontinuity (which is also a defect, in this case!).

అబద్ధాలనిజాలు!

"నాన్నా! అబద్ధం అంటే ఏంటి?" నిజమనే చలి నుండి మనల్ని మనం కాపాడుకోడానికి మనకు మనమే అల్లుకున్న వెచ్చనైన కంబళియే అబద్ధం తల్లీ. "అంటే బ్రతకడానికి అబద్ధం అవసరం అంటావు! అంతేనా?" కాదురా తల్లీ, మనం అబద్ధమని అనుకునేది కూడా నిజమేనని అంటున్నాను. "తమాషానా! అదెలా సాధ్యం నాన్నా?" సరే, ఇది చెప్పు. చలి నిజమేనా? "అవును" మరి కంబళి నిజమేనా? "అవును, నిజమే!" అలానే మన గురించిన వాస్తవాలను కొందరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో కొన్ని నిజాలను దాస్తాం, అలా దాచేది కూడా నిజమే కదా! మన గురించి ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమోనని తెగ హైరానా పడిపోతాం, కానీ పైకి మాత్రం బింకం ప్రదర్శిస్తాము. లోలోన హైరానా పడడం నిజం, పైపైకి బింకం ప్రదర్శించడం నిజం. ఈ రెంటిలో అబద్ధమేది? "అవును కదా! అబద్ధమేది?" వాస్తవానికి నిజం అబద్ధం అనేవి కాలం నుండి జనిస్తాయి తల్లీ, ఒకప్పుడు మనం ఎన్నో విషయాల్ని నమ్ముతాం. ఆ నమ్మకాలే మనకు నిజం అనిపిస్తాయి. కానీ వయసు పైబడేకొద్దీ వాటిలో కొన్ని నమ్మకాలు తారుమారౌతాయి, తారుమారైన అలాంటి నమ్మకాలను మనం అబద్ధాలు అనడం నేర్చుకున్నాం. "మరి నువ్

హర్మ్యనిఘా!

జతచేసిన చిత్రంలో ఉన్నటువంటి హర్మ్యాలు, రహదారి కూడళ్ళలో ఏర్పరచిన సూచికలు, పగటి సూర్యుడ్ని సహితం తలదన్నేట్లుగా విద్యుల్లతలతో మిరిమిట్లుగొలిపే మారాట సముదాయం చూసినప్పుడు మనలో కొందరికి అలాంటి ప్రాంతాల్లో నివసించాలనే కుతూహలం కలగడం సహజం. కానీ ఈ వెలుగు జిలుగులన్నీ కేవలం పగటి సమయంలోనేననే విషయం అనుభవం ద్వారా తెలిసినప్పుడు ఉన్నట్లుండి మనసులో పెనుప్రకంపనల సృజన జరిగిపోతుంది, అసంకల్పితంగానే! నేలకు సమాంతరంగా కాకుండా పైకి ఎగబాకే భవంతులతో వచ్చిన చిక్కు ఇదే, సాయంత్రం అవ్వగానే చడీచప్పుడూ లేని విధంగా మన జీవితాల్లోకి ప్రవేశించే నిశీధి చాలా భయంకరంగా ఉంటుంది, నిఘా కోసమని ప్రత్యేకంగా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది, ఎంత ఖర్చు చేసినా ఆందోళన ఏమాత్రం తగ్గదు, పరస్పర బాధ్యతారాహిత్యంపై రంధ్రాన్వేషణ ప్రారంభం అవుతుంది, వైయక్తిక బాధ్యత అనే సైద్ధాంతక దృక్కోణం అకస్మాత్తుగా ఆవిర్భవిస్తుంది, మళ్ళీ రాత్రి అవుతుంది! ఇదే సాంస్కృతిక యుద్ధాలకు (కల్చర్ వార్స్) ప్రధాన కారణంగా పరిణమిస్తుంది. బుర్ఖా విధానంలో మతపిచ్చి ఎంతుందో నాకు తెలుసు, కానీ అదే బుర్ఖా విధానం మహ్మదీయ మహిళపై మనలో అధికులు కనీసం కలలో కూడా ఊహించలేని రూపాన ని

Post Number 04 - Povertification

Ashada Shukla Padyami 2080 Our elders of yester generations agreed upon the necessity of employment for both the spouses for a financially sound future in the times of industrial modernity, and now everyone agrees upon need of employment for both the spouses just to survive economically in the times of technological and progressive advancements. The lack of understanding the fine differences between these times (industrially modern & technologically advanced) is one of the major causes of increasing poverty, the rise of socialist economic theories which are paving the way for economic entitlement (freebie) culture, ever growing misconception of currency as money, etc. Modern times emphasized more on productivity and chose industry as the medium of economic prosperity while advanced times emphasize on consumption and choosing spending as the sign of economic prosperity. It means - advanced times assume that economic prosperity has already been achieved through modernity, so all that

వైదిక అగ్ని

"అజ్" అనే ధాతువు నుండి అగ్ని అనే పదం ఆవిర్భవించింది; దానర్థం వెళ్ళడం, పయనించడం, కదలడం ఇత్యాది. ఒకచోట నుండి మరియొక చోటకి వెళ్ళగల శక్తి అగ్ని, వాయువుతో చేరి వెళ్లగలడు కనుక వహ్ని, విశ్వం అంతటా వ్యాపించి ఉన్నందున వైశ్వానరుడు. అగ్ని వైదిక దేవతల చెంతకు యజ్ఞక్రతువులు నిర్వహించేవారి కోరికలను ఎలా తీసుకెళ్ళేవాడు? తేజస్సు, అదే కాంతి! ఈ లౌకిక విశ్వంలో మరణం అంటూ లేనిదేదైనా ఉన్నది అంటే అది బహుశా కాంతి మాత్రమే అయ్యుంటుంది! మనమిప్పుడు చూసే కాంతి ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైనదో చెప్పగలగడం అసంభవం. అనగా కాంతి అనాది, ఆద్యంతాలు లేనిది! అగ్ని తన తేజస్సులో యజ్ఞకర్తల మరియు యజమానుల (యజ్ఞవ్యయాన్ని భరించేవారు!) కామ్యకాంక్షలను (కోరికలను) మిళితం చేసి ఊర్థ్వలోకాలకు పంపించే అద్వితీయమైన (రెండవది లేదు/లేడు) సామర్థ్యాన్ని కలిగివున్నాడు. అటువంటి శక్తి మరెవ్వరిదగ్గరా లేకపోయింది, విలక్షణమైన ఈ సామర్థ్యం ఆయన స్థానాన్ని దేవతలలో పదిలం చేసింది. కనుక అతను అందరికీ మిత్రుడు. ఎవ్వరిచేతనూ భర్తీ చెయ్యలేని విధంగా విస్తరించడమే బ్రాహ్మ, క్షాత్ర మరియు వైశ్య ధర్మానికి పునాదులు. కనుక అగ్ని జాతవేదుడు (జ్ఞానానికి ఆద్యుడు), హిరణ్యరేతుడు

Post Number 03 - Working Hours

Jyeshtha Bahula Trayodashi 2080 Of all the things that are changing rapidly in the material world, working hours are the only ones that remained stagnated ever since the idea of the modern (simply put, christian colonial) version of industry. Working for 9/10/12 hours a day in an isolated factory/facility for 6 days a week only to have one holiday (i.e. sunday) is clearly christian in nature, as sunday forms the sabbath day for protestants (minute sections observe sabbath on saturday & friday!). Not just that - colonisation as an idea emerged from the doctrine of discovery with papal legitimacy. Time is one thing that a normal worker has no say in whatsoever; when to come/go/take a leave are all decided by the owners/managers of all sorts of sectors now, it is not at all limited to one particular industry. In christian/modern doctrine, the idea of industrial employment was never meant for the upliftment of an employee but only for the prosperity of the employer. The employer become

Post Number 02 - ITP dilemma

Jyeshtha Bahula Ekadashi 2080 Production incharge(s) in their usual speeding up of things and chasing the due dates often end up by-passing the visual inspection and directly go to leak testing stage. They often think that (a proper) leak test would mysteriously remove all the leak prone defects like blowholes, porosity, pinholes, cracks and lack of fusion from all the weld joints, which is far from reality! Not every weld defect would cause a weld joint leak in most of the fabrication, they mostly extend to subsurface level or lie in surface level, moreover not all weld joints are leak-proof. If these defects were to be unattended, one must sacrifice their self respect. At the end of the day welding engineer or welding supervisor gets the blame. Final outcome, after all the coatings or platings or paintings, it would look like this 👇. But somehow everyone seems to see all these visually inappropriate things just before dispatch and a shouting match follows immediately!

అవిద్యాత్యజనం!

అకాలమనే నిశీధి నుండి కాలమనే కాంతి ఉదయిస్తుందనేది అమ్మవారిని ఆరాధించేవారి ఎరుకలో ఉంటుంది, ఈమధ్య అవిద్యను దూరం చేసుకోవడమే దైవానికి దగ్గర చేస్తుందనే ప్రసంగాలు తారసపడుతున్నాయి. ద్వైతార్కికత యొక్క ద్వంద్వత్వం ద్వారా దర్శిస్తే అవిద్య అనబడేది ఖచ్చితంగా త్యజించవలసినదే. అనగా విద్యకు వ్యతిరేకం అవిద్య, ఈ రెండు శక్తులూ పరస్పరం ఒకదానితో ఒకటి నిరంతరాయంగా గెలుపుకోసం పోటీపడుతూ ఉంటాయి. అనేకులు అవిద్యను చీకటితోనూ & విద్యను కాంతితోనూ ప్రతీకరిస్తుంటారు, బుద్ధుడు పలికాడని చీకటి నుండి కాంతి వైపుకి పయనం ఉండాలని అంటుంటారు. చీకటిలో సత్యం లేకపోతే అది ఎందుకు ఉదయిస్తోంది? విద్య మాత్రమే సత్యమైతే మరి అవిద్య మనుగడలో ఎందుకుంది? కాంతి మరియు చీకటి రెండూ పరస్పర విరోధితాలు అయితే ఒక దినాన్ని పూర్తి చెయ్యడానికి రెండింటి అవసరం ఎందుకు ఏర్పడుతోంది? పగలు కష్టపడి విశ్రాంతి తీసుకోవడానికి రాత్రి ఎందుకు అవసరమౌతోంది? కాంతి చీకట్లోనే అత్యంత వేగంగా ఎందుకు పయనిస్తోంది? దీనర్థం చీకటి కాంతిని నిరోధించడం మానేసి సహకరిస్తుందనే కదా! మనం దర్శించే ఈ ద్వాంద్విక సృష్టి అంతా వైరుద్ధ్యతల సమాహితమనేది అసత్యమనేగా, ఈ అసత్యమే అవిద్య. కానీ మనం భావి

Post Number 01 - Optimisation

Jyeshtha Bahula Dashami 2080 In fabrication, secondary operations involve the usage of angle grinding machines, which is yet to be optimised to exploit its full potential. During the factory starting phase nobody knows the exact size of the labourers and so does the quantity of angle grinders that are needed. But going forward the maintenance department can track all the necessary information from MTBF, MTTR and Downtime (and OT timings, number of shifts, shift plannings, absentee pattern, etc) to know the quantity of machines required in floor and for backup/emergencies. Let's assume (for the sake of simplicity!), a newly established factory is about to hire 51 grinders who are to be allocated equally in all the three shifts, i.e. 17 grinders per each shift. Accordingly if they purchase 51 grinding machines, that's an unnecessary overhead cost on the factory as there will never be 51 grinders working simultaneously, but only 34 grinders does, can add more personnel if and when

గదాయుద్ధ (2023) | కన్నడ చలనచిత్రం

"దైవశక్తి నెలకొనిఉన్న ఈ సృష్టిలో దుష్టశక్తి కూడా ఉంటుంది" అనేది ఈ చలనచిత్రం అనే పిచ్చికథకు మూలం. దక్షిణాచార పూజాపద్ధతిని అనుసరిస్తూ, దాన్నే తలమానికంగా భావించే కుఱ్ఱకుంకలు (మానసిక రూపేణా!) నిర్మించిన చలనచిత్రమిది. ఈ చిత్రంలో శత్రువులు మధ్యధరా సముద్ర తీరప్రాంతాల్లో ఆవిర్భవించిన ఎడారి మతానుయాయులైన క్రైస్తవులు కాదు, మహ్మదీయులు కాదు, కమ్యూనిస్టులు కాదు, ఫెమినిస్టులు కాదు, సోషలిస్టులు కాదు, కానీ వామాచార హిందువులు! పొద్దున లెగిస్తే పొద్దస్తమానం హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు అని పైన చెప్పబడిన వంధిమాగదులను తునుమాడే అదే దక్షిణాచార సాంప్రదాయిక సమాగణాలు, సొంత ధర్మంలోని వామాచారుల పట్ల ఎంతటి క్షుద్రభావనలను కలిగి ఉన్నారో ఈ చిత్రం ఒక ఉదాహరణని సోదాహరణంగా చూపించవచ్చు. వామాచరంలో కేవలం క్షుద్రపూజలే ఉంటాయని, ఆ తరహా ఆచారాలను అనుసరించే అందరూ అమాయకులను మృత్యువాత పడవేస్తారని, మనం నిత్యం పూజించే దేవతలను బంధించి మనల్ని వేధించే ప్రయత్నం చేస్తారని బహు బాగా ప్రస్తావిస్తాయి; ఇది దక్షిణాచార కపటత్వానికి నిదర్శనం. "హిందూ ధర్మం సర్వమత సమ్మేళన"మని ఉత్తుత్తి కబుర్లు చెబుతారు, వామాచారులను మాత్రం ఒక

ఉగ్రం (2023) & రైటర్ పద్మభూషణ్ (2023)

కనకమేడలవారి దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం (2023) చలనచిత్రం చూశాను. ఫర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఒక సన్నివేశంలో తమ కూతురు కనపడటం లేదని తల్లిదండ్రులు పిర్యాదు చేస్తే ఆ అపహరణకు గురైన పాపకు ట్యూషన్ చెప్పే పంతులు ఇంట్లో తెర లెగుస్తుంది. ఆ పాప ఇంటికి వెళ్ళిందా? లేదా? అని కనుక్కోలేదని అతని చెంప చెళ్లుమనిపిస్తాడు పోలీసు అధికారి శివ కుమార్. ఆడపిల్లలకు ట్యూషన్ చెప్పడానికి కూడా భయపడతారు, ఇహ నుండి. ఇది వెర్రో పిచ్చో నాకైతే అర్థం కావడంలేదు! ఆడవారు కూడా మామూలు మనుషులే, వారికోసం ఇలాంటి పనికిమాలిన ప్రత్యేక సన్నివేశాలను సృష్టించడంతో అధికంగా నష్టపోతోంది మహిళలేనన్న వాస్తవాన్ని తెలిసి కూడా అసలేమీ తెలియదన్నట్లుగా నటించేవారు మహిళలకు శత్రువులు. సా.శ. 2010 నుండి అనుకుంటాను కేవలం ఆడవారిపై జరిగే అకృత్యాలకు మాత్రమే అతిగా స్పందిస్తాడు కథానాయకుడు, ఆడవారి కష్టాలకే రచయితలు, దర్శకులు & నిర్మాతలు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. నేటి ప్రేక్షకుల్లో ఆడవారి సినిమా కష్టాలను చూసి కన్నీరు తెచ్చుకునే సున్నితహృదయులు ఇహ ఎవరూ లేరనే వాస్తవాన్ని కూడా వారు గుర్తుంచుకోవాలి. ఒక రకంగా ఈ తరహా చిత్రాలు ప్రేక్షకుల్లో మ

మతిమయం - 3వ భాగం

"బొంబిడాయిల పులుసు ఎలా ఉందే?" అడిగింది జాహ్నవి. "బాగానే ఉందిలేగాని, ఎప్పుడు వండింది అప్పుడే తినడమే కాస్త వింతగా ఉంది" అని సన్నగా నవ్వేసింది సులోచన, నాగరికతకు ఆలవాలంగా చెప్పే నగరాలలో తాజా భోజనం తినే అలవాటుపోయి! "మరి నన్ను ఎవర్నైనా చూడమంటావా?" ఇదే అదుననుకుని మాట పెళ్ళి వైపుకి మళ్ళించింది జాహ్నవి. "నిన్ను అడిగానా ఎవర్నైనా చూడమని?" అని బాధతో నిండిన కళ్ళతో కోపంగా ఉరిమి చూసింది సులోచన. కాసేపటికి తేరుకుని, "అది కాదే జాను..." అంటూ మధ్యలోనే ఆపేసింది. "పూర్తిచెయ్యి ఆ కానిదేదో" అంటూ జాహ్నవి సులోచన చెయ్యి పట్టుకుంది, ప్రేమగా... "నాకు పెళ్ళిళ్ళ మీద పెద్దగా నమ్మకంలేదు జానూ!" అంది సులోచన. "అందుకే అన్ని వద్దు, ఒక్కటి చాలు అంటున్నాను" అన్నది జాహ్నవి. ఇద్దరూ విరగబడి నవ్వుకున్నారు. గడిచిన పదేళ్ళు ఎన్నో యుగాలు తరలిపోయినట్లుగా ఉంది వారికి, కన్నీళ్లు ముంచుకొచ్చాయి ఇద్దరికీ! "అమ్మది ప్రేమ వివాహం జానూ, నీకు తెలుసుగా, అందునా మతాంతర వివాహం! అమ్మ కాపుల పిల్లైతే, నాన్న అశ్రాఫ్ల అబ్బాయి. పెళ్ళైన మొదట్లో బాగానే ఉండేవారంట ఇద్దరూ, తర