Skip to main content

Posts

Showing posts from July, 2023

శిశుజననాల సంఖ్యలు & సమస్యలు

ప్రపంచం నలుమూలలా శిశుజననాలు పతనమౌతున్నాయి మరియు వయోమరణాలు అధికమౌతున్నాయి. ప్రపంచం నేడు ఎదుర్కుంటున్న తీవ్రమైన సమస్య అతిజనాభా కాదు అల్పజనాభా. అనగా మరికొన్ని దశాబ్దాలలో నేటి సమయంలో మనుగడలో ఉన్న అనేక వంశాలకు వారసులు ఉండరు! మరి ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఏం చేస్తున్నాయి? దేశ స్థూల జాతీయోత్పత్తి పతనం అవుతుందేమోనని ఇతర దేశాల నుండి వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఇలా చేస్తే ఆ దేశ సంస్కృతి దెబ్బతినడంతోపాటుగా దేశంలో ఆయా ప్రాంతాలు, ప్రదేశాలలో ఉన్న సహజ వనరులు త్వరగా నిర్వీర్యం కూడా అయిపోతాయి. ప్రాంతీయులకు అక్కడి సంస్కృతి, ఆచారాలు, వాతావరణంపై ఉన్న అవగాహన, సమగ్రదృష్టి, మమకారం వలసీయులకు ఉండదు. దీనితో ఆ దేశాల సంస్కృతి దెబ్బతిని, ఆచారాలు మంటగలసి, అక్కడి వాతావరణం పెనుమార్పులకు గురౌతుంది. ఐతే ఆధునిక యుగంలో ఇంతకుమించిన ఉపాయం ఎవ్వరి దగ్గరాలేదు. ఆధునిక మేధావుల మేధోగంభీరత ఇక్కడితో ముగుస్తుంది! మరేం చెయ్యాలి? సంతానాన్ని కనేలా దేశపౌరులను ప్రోత్సహించాలి, ముఖ్యంగా స్త్రీలను. కానీ అలా చెయ్యడంలో దేశ ప్రభుత్వాల వైఫల్యాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? మహిళా విద్యను ఒక కారణంగా పేర్కొనవచ్చు. విద్యాధికులై

ప్రాకల్పికాపర్వం!

జీవనం చుట్టూ సదా (కాలం & ప్రదేశం = కాలప్రదేశి) మృత్యువు అలముకుని ఉన్నట్లే మృత్యువు చుట్టూ కూడా జీవనం సదా అలముకునే ఉంటుంది. బ్రతికున్నవాడు మృత్యువును చూసి ఎలాగైతే పరిపరివిధాల భయపడతాడో మరణించినవాడు కూడా జీవనమంటే అంతే భయపడతాడు. బ్రతికున్నవాడు వర్తమాని ఐతే మరణించినవాడు గతమాని! మరి భవమాని (భవిష్యత్తులో ఉండేవాడు) ఎవరు? మరణంలేని ప్రాణం (గతంలేని వర్తమాని) మరియు ప్రాణంలేని మరణం (వర్తనంలేని గతమాని) ఎలా సాధ్యపడతాడు? జీవనం లేదా మరణం అనేవి లేకుండా భవిష్యత్తు ఉంటుందా? ఇంతకీ భవిష్యత్తు అంటే ఏమిటి? గతమే వర్తమానమై వర్తమానమే గతమై (కొన)సాగుతుండేదే భవిత, అతనే భవమాని. ఇదే సదా (సత్యం)! తండ్రి గతం, అతను గతమాని. కొడుకు వర్తనం, ఇతను వర్తమాని. ఒకనాడు కొడుకు తండ్రి అవ్వకతప్పదు, అలానే తండ్రి కొడుకు అవ్వకామానడు. ఆ తప్పలేని, ఈ మానలేని చర్యలకు ప్రతిఫలమే భవిష్యత్తు. అంటే భవితకు మూలం గతం మరియు వర్తమానం. ఈ రెంటిలో ఏది కాదన్నా భవితకు స్థిరత్వం ఉండదు, నిలకడ రాదు, నిశ్చింత అందదు! అందుకే - ఆచారం తండ్రి, కర్మ కొడుకు, సాంప్రదాయం భవిత. జీవనం తర్వాత మృత్యువు కాదు, అలానే జీవనానికి అంతం కూడా మృత్యువు కాదు. జీవనానికి కొనసాగిం

అకర్ణైక్యం (అశ్వత్థభారతం)

/1/ వైశాఖ శుక్ల పంచమి, 2080 కర్ణకుండలం - 1వ పాత్ర పరిచయం అందరిలా కులానికి తగ్గట్లుగా పనిచేసుకు బ్రతకడం అతనికి కష్టంగా అనిపించింది, గుళ్ళో పౌరోహిత్యం అతనికి పదవిలా కనిపించింది. కానీ పదమూడేళ్ల ఆ బాలకుడి హృదయంలో ఇంకేదో సాధించాలనే మొండి పట్టుదల తన తల్లిదండ్రులను మరియు స్వగ్రామాన్ని విడవడానికి సంసిద్ధుడ్ని చేసింది. దగ్గర్లోని పట్నానికి పోయి నాలుగేళ్లు కష్టించి తాను నేర్చుకున్న అన్యవృత్తిలో నిష్ణాతుడయ్యాక కూడా అది అతని మనసుకు సంతృప్తినివ్వలేకపోయింది. మరొక ఆరేళ్ళు శ్రమించి ఖ్యాతి గడించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు, అది అతనికి తృప్తినిచ్చింది. తాననుకున్నదేదో సాధించాననే ఆత్మతృప్తిలో గ్రామం చేరగానే అక్కడి వాతావరణం అతనికి వింతగా తోచింది, అతనక్కడ ఇమడలేకపోయాడు, ఎవ్వరూ అతన్ని గుర్తించలేకపోయారు. ఆ గ్రామం అంతా అతనికి కొత్తగా అనిపించింది, క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. తనకు తృప్తినిచ్చిన ఆ విద్యతోనే తన జీవితాన్ని నిర్మించాలనే పట్టుదలతో తూర్పుదిక్కుగా బయలుదేరాడు అతను, పశ్చిమ దిక్కున సూర్యుడు అస్తమించడానికి ఉపక్రమిస్తున్నాడు. అతడే కర్ణుడు, రాధేయుడని పిలువబడేవాడు. ఇప్పుడు ఒట్టి కర్ణుడు! /2/ వైశాఖ బ

ఆగ్రహజ్వాలల ఎంపిక!

"మీరు వైష్ణవ హిందూ మెయిటీల మీద క్రైస్తవ కూకీలు జరిపే అకృత్యాలపై స్పందించారు, అదే మెయిటీలు కూకీలపై జరిపిన హింసను కూడా సమర్థించారు. ఇదంతా బాగానే ఉంది, మరి పశ్చిమ బెంగాలులో ఇద్దరు దళితులను బీజేపీ దళం తరపున పోటీ చేసినందుకు టీఎంసీ మహిళా కార్యకర్తలు వివస్త్రలను చేసి అవమానించారు. దీనిపై మీరెందుకు స్పందించలేద?"నేది రెన్నాళ్ళ క్రితం మెసెంజర్లో వచ్చిన సందేశం. వర్ణాశ్రమపురుషార్థాలు అనేవి తలా ఒక నాలుగు ఉన్నాయి, దళితులు అందులో ఏ వర్ణమో నాకు తెలియదు; అందుకని నేను స్పందించలేదు. వర్ణం లేనివారు సనాతనాన్ని పాటిస్తారు అని నేననుకోను. అన్యుల గురించి నాకనవసరం, వారు ఎలా పోయినా నేను పట్టించుకోను. "ఇది అమానవీయ"మని మీరు అనొచ్చు! ఇది "యుద్ధధర్మ"మని నేనంటాను. ఏ యుద్ధంలో అయినాసరే సహచరుల క్షేమం మాత్రమే ముఖ్యం, తక్కినవారు త్రాగి పడేసే కాగితపు కప్పులతో సమానం. టీ అంగడిలో వెల చెల్లించేది టీకి, కాగితపు కప్పుకి కాదు. "మరి దళితులు తమని తాము హిందూ దళితులు అంటే మీరెలా స్పందిస్తారు?" అనే ప్రశ్న కూడా ఒకసారి వచ్చింది. అప్పుడు సమాధానం చెప్పలేదు, ఇప్పుడు చెబుతాను. ఐతే ముందుగా ఒక ప్రశ్న! అల

మారినశైలి

ఎస్ ఎల్ భైరప్ప గారు సా.శ. 1965లో వ్రాసిన "వంశవృక్ష" అనే కన్నడ పుస్తకం వింటున్నాను (యూట్యూబ్లో ధ్వని రూపేణా ఉపలబ్దం). ఈ పుస్తకానికిగానూ ఆయనకు 1966లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. 1971లో ఈ పుస్తకాన్ని చలనచిత్రంగా కూడా తీశారు. ఏదో వెతుకుతూ ఉంటే ఈ పుస్తకం ధ్వనిరూపం కనిపించింది, వినడం మొదలుపెట్టాను. నా కన్నడ అంత అద్భుతంగా ఏమీ ఉండదు, కాకపోతే ఇలాంటివి వింటూ ఉంటే భాషను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుచిక్కుతుందని! "నేర్చుకునే భాషల సంఖ్య పెరిగేకొద్దీ మన ఒంటరి దృక్పథాలు తమ వైఖరిని విడనాడి బహురుపాన్ని సంతరించుకుంటాయి" అనేవారు మా కోటేశ్వరమ్మ పంతులమ్మ గారు. కాలక్రమేణా నా దృక్కోణాలకు మూలమైన "అజాయమానో బహుధా విజాయతే" అనే సూత్రాన్ని ఒంటబట్టించుకోవడానికి ఆ వ్యాఖ్య ఎంతగానో దోహదపడింది. ఆమె మాకు 6వ తరగతి నుండి (కొండపల్లి, బాలుర ఉన్నత పాఠశాల) హిందీ పాఠాలు చెప్పేవారు, ఆమె దక్షిణభారత హిందీ ప్రచార సభ యొక్క సభ్యులు కూడా & తెలుగునాట హిందీభాష అభివృద్ధికి అహరహమూ శ్రమించిన పలువురిలో ఒకరు. ఆమె మాకు హిందీని మార్కుల కోసం కాక మా (బళ్ళో పిల్లల) అభిరుచులను ఆసక్తికరంగా వెల్లడించడా

భాషలు

ఎస్ ఎల్ భైరప్ప గారు సా.శ. 1965లో వ్రాసిన "వంశవృక్ష" అనే కన్నడ పుస్తకం వింటున్నాను (యూట్యూబ్లో ధ్వని రూపేణా ఉపలబ్దం). ఈ పుస్తకానికిగానూ ఆయనకు 1966లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. 1971లో ఈ పుస్తకాన్ని చలనచిత్రంగా కూడా తీశారు. ఏదో వెతుకుతూ ఉంటే ఈ పుస్తకం ధ్వనిరూపం కనిపించింది, వినడం మొదలుపెట్టాను. నా కన్నడ అంత అద్భుతంగా ఏమీ ఉండదు, కాకపోతే ఇలాంటివి వింటూ ఉంటే భాషను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుచిక్కుతుందని! "నేర్చుకునే భాషల సంఖ్య పెరిగేకొద్దీ మన ఒంటరి దృక్పథాలు తమ వైఖరిని విడనాడి బహురుపాన్ని సంతరించుకుంటాయి" అనేవారు మా కోటేశ్వరమ్మ పంతులమ్మ గారు. కాలక్రమేణా నా దృక్కోణాలకు మూలమైన "అజాయమానో బహుధా విజాయతే" అనే సూత్రాన్ని ఒంటబట్టించుకోవడానికి ఆ వ్యాఖ్య ఎంతగానో దోహదపడింది. ఆమె మాకు 6వ తరగతి నుండి (కొండపల్లి, బాలుర ఉన్నత పాఠశాల) హిందీ పాఠాలు చెప్పేవారు, ఆమె దక్షిణభారత హిందీ ప్రచార సభ యొక్క సభ్యులు కూడా & తెలుగునాట హిందీభాష అభివృద్ధికి అహరహమూ శ్రమించిన పలువురిలో ఒకరు. ఆమె మాకు హిందీని మార్కుల కోసం కాక మా (బళ్ళో పిల్లల) అభిరుచులను ఆసక్తికరంగా వెల్లడించడా

యుద్ధధర్మపు క్రూరత!

మూడు నెలల క్రితం మణిపూరులో మెయిటీ తెగలకు చెందిన మగవారు కూకీ తెగలకు చెందిన ఇద్దరు స్త్రీలను వివస్త్రలను చేసి, నగ్నంగా ఊరంతా తిప్పుతూ, అత్యంత క్రూరంగా వారిపై సామూహిక బలాత్కారం చేశారు. ఆ చలనదృశ్యం గత రెండు దినాలుగా ట్విట్టర్లో ఎంతటి దుమారం లేపిందంటే గత మూడు నెలలుగా కళ్లుండీ గ్రుడ్డివాడిగా నటిస్తున్న పరమమూర్ఖుడైన మోదీ గాడు (అవును, గాడే!) కూడా ఆ చలనదృశ్యంపై అతిగా స్పందించాడు. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడొస్తుంది అంటే - మెయిటీలు హిందువులు గనుక హిందూ ఐకమత్యం పేరుతో వారు చేసిన ఈ ఘాతుకాన్ని సమర్థించాలా? లేక "తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పిన ధర్మరాజు"లా నైతిక నిచ్చెనను ఎక్కాలా? అని తెగ సతమతం అవుతున్న (అ)సాంఘిక మాధ్యమాలలో పాతిక్కి పదిసార్లు పచార్లు చేస్తూ తమని తాము క(ఘ)ట్టర్ హిందువులుగా చెలామణి అవుతున్నవారితోనే! అన్నీ బాగున్నప్పుడు ఐకమత్యంతో పనేముంది? మణిపూరులో జరిగే తంతును కాసేపు మరిచిపోదాం, ఒకవేళ ఉన్నట్టుండి మీమీద అబ్రహం మతాలవాళ్ళు విరుచుకుపడితే మీరేం చేస్తారు? పసిపిల్లలు, బాలింతలు, ముసలివాళ్ళు, తల్లి వయసున్నవారు అని కూడా చూడకుండా మీ స్త్రీలను ఇలానే చేస్తే మీకెలా ఉంటుంది? ఎవర్ని సహాయం అర్థ

కామ్యక్షేత్రం

"డబ్బు పొందలేని & సుఖం ఇవ్వలేని ధర్మాచరణ ఎందుకూ పనికిరాద"నేది నా వైయక్తిక చింతన మరియు దీనినే నా కుల చింతనగా మార్చాలనేది నా జీవితాశయం. ఎందుకిలా? సా.శ. 2007 పదవ తరగతి ఆఖరి పరీక్ష అయిపోయిన రెండో రోజుకే మా అమ్మ నీళ్ళు త్రాగి ఖాళీ కడుపుతో పడుకోవడం నాకింకా గుర్తుంది. "ఏ మునుపెప్పుడూ అలా చెయ్యలేదా?" అంటే, చేసింది. కానీ అప్పుడు నాకు అనిపించినంత బాధ మునుపెప్పుడూ అనిపించలేదు. ఇంతకుముందు "ఇదంతా నా ఖర్మం, ఇది పడే సమయం" అనుకునేవాడిని, కానీ ఆనాడు మాత్రం "నాకు ఓపికుండి కూడా మా అమ్మ ఖాళీ కడుపుతో పడుకోవడం ఏంటా?" అనిపించింది. పక్కరోజు నుండి సత్తారు (అవును, మహ్మదీయుడే!) మేస్త్రి దగ్గర తాపీ పనికి వెళ్ళడం మొదలుపెట్టాను. రోజుకూలీ ₹80 ఇచ్చేవాడు, ఒక్క ఆదివారం మినహాయించి వారంలో మిగతా రోజులన్నీ పనిచేసేవాడిని. అలా రెండు నెలలు, మొత్తం 51 రోజులు, చేసి ₹4080 సంపాదించాను. ఇవి మమ్మకే ఇచ్చాను, ఇది నా మొదటి సంపాదన కాదు; నా మొదటి సంపాదన ₹50, కార్లకి మక్కు పెట్టి రెండు గంటలు సుబ్బారావు మేస్త్రి (ఈయన క్రైస్తవుడు) చెప్పినట్లు పోలిష్ చేసినందుకు వచ్చినవి. అవి మా అక్కకు ఇచ్చేశాను, అ

సొడోమి (గుధ మైథునం)

సొడోమి/సొడోమైస్డ్ | మగపిల్లలపై విరివిగా జరిగే లైంగిక అఘాయిత్యాలు అప్పుడప్పుడు అరుదుగా మనకు ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. ఇవి చర్చి మరియు మసీదుల్లో అధికంగా జరుగుతుండడం ఒక్కొక్కప్పుడు మనలో కొందరిలో కాస్త కలకలం సృష్టించినా అధికమొత్తంలో మగపిల్లలపై జరిగే ఇలాంటి అమానుషాలు మనల్ని అంతగా కదిలించవు. కానీ ఇది పాత నిబంధనలో (పుటాసంపుటి = బైబిల్) ఇవన్నీ అతి సాధారణమైన విషయాలు. పురుష స్వలింగ సంపర్కులు గుధ మైథునం ద్వారా లైంగిక చర్య జరుపుతారు, అయితే స్వలింగ సంపర్కాన్ని (పురుష & స్త్రీ) వ్యతిరేకించే చర్చి/మసీదు వంటి ప్రార్థనా స్థలాల్లో మాత్రం బాలికలతో సమాన స్థాయిలో బాలకుల మీద కూడా లైగింక బలాత్కారం జరుగుతుంది, కాకపోతే వాటికి అంత ప్రాచుర్యం లభించదు. ఈ గుధ మైథునాన్నే సొడోమి అంటారు. ఈ పేరు పాత నిబంధనలో పేర్కొనబడిన పట్టణం పేరున ఆంగ్లంలోకి (ఆంగ్లేయ జాతివారు మాట్లాడే భాష) వచ్చింది. ఆ పట్టణాల పేర్లు సొడోమ్ మరియు గమోర్రా! లార్డ్ (బైబిల్ గాడ్) ఒకనాడు మరొక ఇద్దరితో కలిసి అబ్రహం ఇంటి దగ్గర భోజనం చేస్తాడు, తర్వాత తాను సొడోమ్ మరియు గమోర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నట్లు చెబుతాడు. అబ్రహం ఎందుకని లార్డును అడుగ

హౌ టు గెట్ రిచ్? నెట్ఫ్లిక్స్ ప్రస్తుతి నుండి కొన్ని అంశాలు

ఆషాఢ బహుళ అష్టమి, 2080 నెట్ఫ్లిక్స్ లో "హౌ టు గెట్ రిచ్" అనే కార్యక్రమం ఒకటుంది, అది లింగ సమానత్వం కోరుకునే అందరూ తప్పక చూడాలి. అందులో వివక్షాపూరితమైన అంశాలు ఏమీలేవు, కానీ మ్యాట్ మరియు అమానా అనే ఒక జంట (పెళ్లైంది) తీసుకునే ఆర్థిక నిర్ణయాలు జీవితంలో ఏయే అంశాలతో ముడిపడి ఉన్నాయో, అలానే జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అర్థం చేసుకునే అవకాశం చిక్కుతుంది. దానితోపాటు సమాజంలో లింగ ఆధారిత నియమాలు మారితే అంతా సక్రమంగా ఉంటుందనే ఆలోచన యొక్క సహేతుకతను కూడా మనం విభిన్నమైన కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. వారిలో అమానా ఉద్యోగం చేస్తుంది, ఏడాదికి $200,000 సంపాదిస్తుంది, మ్యాట్ మాత్రం ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటాడు. ఒకరితో ఒకరికి పడదు, మ్యాట్ సంతోషంగా ఉండడు, అమానా డబ్బుల విషయంలో మ్యాట్ను నమ్మదు. మ్యాట్ సంతోషంగా లేకపోవడానికి కారణం - ఇల్లు, పిల్లలు, ధనం, ఖర్చులు వంటి విషయాల్లో అమానా అతనిని కనీసం సంప్రదించకపోవడం, కుదిరినప్పుడల్లా అతను ఏమీ సంపాదించడంలేదని చిన్నబుచ్చుకునేలా మాట్లాడడం, అతని ఆలోచనలకు విలువ ఇవ్వకపోవడం. అమానా సంతోషంగా లేకపోవడానికి కారణం - చిన్నప్పటి నుండి తండ్రి లేకుండా పెరగడం, డబ్

Post Number 8 - A Crack

Ashadha Bahula Navami 2080 A common defect that occurs during welding an austenitic stainless steel bosch with a ferritic carbon steel parent material is a CRACK. The common reason being the poor selection of an electrode, one must pick up the E309L electrode in case of SMA welding. But that's not what caused this defect (those who can't see the crack, please zoom in!) in this joint. It was due to GMAW tack welding, using a ER70S6 1mm diameter solid wire. It altered the chemical properties of molten steel and acted as a corrupting material and often times those are unwanted. It simply is a foreign material with completely different mechanical (elasticity, ductility and fluidity) properties when compared to austenitic stainless steel. Crack (defect/problem) is common, and the root cause of it is not straight forward and is pretty uncommon. Ensure the usage of suitable electrodes and their availablity.