Skip to main content

Posts

Showing posts from May, 2022

వితండవాదన | బల్లిపురం నాగరాజు & పల్లవి (సయ్యద్ అష్రీన్ సుల్తానా)

వితండవాదన | బల్లిపురం నాగరాజు & పల్లవి (సయ్యద్ అష్రీన్ సుల్తానా)  నాగరాజు హిందువు, పైగా శూద్రవర్ణంలోని మాల కులస్తుడు. సుల్తానా మహ్మదీయురాలు మరియు సయ్యద్ 【సాధారణంగా సయ్యద్లను అష్రాఫ్-గా పరిగణిస్తారు. ఒకవేళ ఆమె అష్రాఫ్ ఐతే (!), మహ్మదీయుల్లో ఇదే అగ్రకులం】 సుల్తానాను వివాహమాడడానికి నాగరాజు మహ్మదీయుడిగా మారడానికి కూడా ప్రయత్నించాడు, కానీ సుల్తానా తల్లిదండ్రులు ససేమిరా అనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించాడు. జనవరి 2022లో నాగరాజు-సుల్తానా ఆర్యసమాజ్-లో మతాంతర వివాహం చేసుకున్నారు, సుల్తానా పల్లవిగా పేరు మార్చుకుంది. 2022 మే 04న సుల్తానా సోదరుడు నాగరాజును అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్యచేసిన సుల్తానా కుటుంబం & ఆమె సోదరుడు నాగరాజు హిందు మతంతో ఎంత క్షోభితులయ్యారో అతని మాల కులంతో కూడా అంతే క్షోభితులయ్యారు. అదునుచూసి నాగరాజును అంతమొందించారు.  "ఒకవేళ నాగరాజు హిందు అగ్రకులంలో పుట్టినట్లైతే సుల్తానా కుటుంబానికి ఉన్న అభ్యంతరాలు తగ్గి ఉండేవ!"ని బంధువులలోని ఒకరు వాపోయారని 'ది క్విన్ట్' పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక ప్రచురించిన వార్తను పట్టుకుని కొందరు హిందువులమని చెప్పుకునే అవకాశవాద మ

ప్రొటెస్టెంటిజం బీజాలు | డైట్ ఆఫ్ వెర్మ్స్ 1521

ప్రొటెస్టెంటిజం బీజాలు | డైట్ ఆఫ్ వెర్మ్స్ 1521 సా.శ. 1516 జర్మనీలో మెయిన్జ్ ఆర్చిబిషప్పుగా ఆల్బ్రెక్ట్ వాన్ బ్రాండెన్బర్గ్ కొనసాగుతున్నాడు. రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఎక్లెసియాస్టిక్ కౌన్సిల్'లో గౌరవస్థానాన్ని ఆశించి దానిని పొందడానికి (కొనడానికి) భారీమొత్తంలో ధనాన్ని వెచ్చించిన బ్రాండెన్బర్గ్ ఈ ధనాన్ని తన జిల్లాపరిధిలోని ధనిక-కులీన వర్గాల నుండి అప్పుగా తీసుకున్నాడు. ఐతే అప్పు తీర్చడానికి బ్రాండెన్బర్గ్-కు నిరంతర ధనప్రవాహం అవసరమైంది. ఇదే సమయంలో హోలీ రోమన్ చర్చి బిషప్పు పోప్ 10వ లియోకు రోమ్ నగరంలో సెయింట్ పీటర్ బాసిలికా చర్చి నిర్మాణ నిమిత్తం పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. అప్పుడు ఇద్దరి ధన అవసరాలు నెరవేరడం కోసరం ఇండల్జెన్స్-ను మరలా అమ్మకానికి పెట్టే ప్రతిపాదనను ఆర్చిబిషప్పు బ్రాండెన్బర్గ్ పోప్ 10వ లియో ముందుంచాడు మరియు ఆ అమ్మకాల ద్వారా వచ్చిన ధనంలో సమవాటా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.  డోక్ట్రిన్ ఆఫ్ టు కింగ్డమ్స్ ప్రకారం సెక్యులర్ (టెంపోరల్) రాజ్యంలో క్రైస్తవులు చనిపోయిన తర్వాత స్పిరిచ్యువల్ రాజ్యంలోని స్వర్గానికి చేరుకోవడానికి ముందుగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పర్గేటరీలో