Skip to main content

Posts

Showing posts from April, 2022

నరుటో షిప్పుడెన్ | లునానా (2019) - యాక్ లెబీ ల్'హాదా

కనోహా అనే గ్రామంలో ఒకరోజు సాసుకే ఉచీహా - "గ్రామం అంటే ఏమిటి?" అనే ప్రశ్నను ఆ గ్రామాన్ని స్థాపించిన 'హషీరామా సెంజు'ను అడుగుతాడు. తన అన్న ఇటాచీ ఉచీహా కనోహా గ్రామంకోసం ఎందుకని ఎవ్వరూ కలలో కూడా ఊహించనన్ని పనులు చేశాడు? ఆఖరికి అదే గ్రామానికి ఒక శత్రువులా తనను తానెలా ఆవిష్కరించుకున్నాడనే సందేహాలకు సమాధానాల కోసం హషీరామా సెంజును కలుస్తాడు సాసుకే ఉచీహా. హషీరామా ఇలా చెప్పడం మొదలుపెడతాడు - "గ్రామం అంటే దాని ఏర్పాటుకు కారణభూతమైన అన్ని విషయాలకలబోత. అందులో ఏ ఒక్కటి తగ్గినా ఆ గ్రామం గ్రామమనిపించుకోదు, అదొక సమూహంగా మాత్రమే మిగిలిపోతుంది. ఈ సెలయేరు, ఆ పక్షుల కూతలు, అనేక వంశాల రహస్య కళలు, పిల్లల కేరింతలు, పశువుల తుళ్ళింతలు, పీల్చే గాలి, ఎక్కే చెట్టు, అక్కడున్న పర్వతాలు, మనమున్న మట్టి, మనతో ఉన్న జనాలు ఇలా వీటన్నిటితో కలిసి ఒక గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే గ్రామం." ఒక్కొక్క పట్టణానికి మరియు నగరానికి తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండటం చాలామంది వినేఉంటారు. ఆ గుర్తింపుకు కారణమైన అన్నింటినీ గుర్తించడంలో మాత్రం అందరూ విఫలులవుతారు. అలా విఫలమైన గుర్తింపులకు చిరునామాలే ఈనాటి గ్రామాలు!

వాలిసంహారం | ఆశ్వయుజ శుద్ధపౌర్ణమి

అనగనగా ఒక ఆశ్వయుజ శుద్ధపౌర్ణమినాడు కిష్కింధారణ్యంలో బలశాలులైన ఇద్దరు వానరసోదరులు బాహాబాహీగా ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలను ప్రయోగించుకుంటున్నారు. ద్వంద్వయుద్ధంలో అలసిన ఒక వానరం యొక్క ముష్టిఘాతాల శక్తి అల్పమవుతూపోగా, మరొక వానరం యుద్ధం కోసమే పుట్టినట్లుగా తన ముష్టిఘాతాల శక్తిని అంతకంతకూ అధికం చేస్తూపోతోంది.  ఇంతలో అరణ్యప్రాంతంలో పదిలంగా పరుచున్న నీటిఆవిరిని చెల్లాచెదురుచేస్తూ స్థిరమైన వాయు గమనాన్ని బెదిరిస్తూ వింటినారిపై ఆ కర్ణాంతమూ సాగదియ్యబడిన బాణమొకటి శక్తివంతమైన వానరుని హృదయాన్ని ప్రవేశించి దాన్ని చీల్చుకుంటూ లిప్తకాలంలో బయటకి వచ్చింది. ఆ వానరం - "అమ్మా...." అంటూ అరణ్యపు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా గావుకేకపెట్టి నేలకొరిగింది. నేలకొరిగే సమయంలో తన భార్య తార చెప్పిన హితవాక్యాలు స్ఫురణకు వచ్చాయి, వాటిని పెడచెవిన పెట్టినఫలితమే ఇదని పశ్చాత్తాపపడింది.  ఆ అంబును విడిచిన ఇద్దరు నరసోదరులు దేదీప్యమానమైన తేజస్సుతో శోభిస్తున్నారు. వారు ఇక్ష్వాకు రామలక్ష్మణులని గుర్తించింది ఆ నేలకొరిగిన వానరం, తార మాటలు మళ్ళీ నిజమయ్యాయని అనిపించింది. ఊపితిత్తుల నుండి శ్వాస విడిచిపోతోందన్న బాధలో అణచుకులేని క్ర