అధునాతనం రాకమునుపు ఆవిష్కరణలు జరిగాయి అంటే ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉండము. ఆవిష్కరణ అనేది ఎటువంటిదైనాసరే దాని ఆవిర్భావానికి పెట్టుబడి విత్తం/ధనం ముఖ్యమైనది మరియు అంతకుమించి అవసరం అనే బీజాన్ని (విత్తనాన్ని) గుర్తించడం ఆవశ్యకం.
ఈ అవసరం నుండే కొత్త కులాలు పుట్టుకొచ్చేవి, తగినట్లుగా కులపురాణాలు! వేసుకున్న బట్టలు ఉతకడానికి రజక/చాకలి కులం, ఆ కులానికి సమాజంలో తగిన ప్రాధాన్యత ఉండడం కోసం కులపురాణం. కులం మొదట జాతిగా కాకుండా వృత్తిగా మొదలైందనేది ఇక్కడి సారాంశం. క్రమేణా ఆ కులం వృత్తి అనే శ్రేణిని దాటి జాతి అనే శ్రేణికి చేరింది.
కొత్తకులాలు ఆవిర్భవించడానికి కోశనిధి ఎక్కడ్నుండో వచ్చి ఉండాలి, అదెలా వచ్చి ఉండొచ్చు?
ఈ అవసరాలను గుర్తించిన మునుపటి కులాలు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ (కులపురాణం, ప్రోత్సాహకాలు, ఇత్యాదులు) చేస్తూ కోశనిధిని ఏర్పాటు చేసి ఉండే అవకాశం ఉన్నది. లేదా ఇంతకుముందు "సమయాలు" అని ఉండేవట, ఆలోచనలకు పెట్టుబడి అక్కడినుండి దొరికేది. ఇలాంటి సమయాలు ఆయా కులాలకు ప్రత్యేకంగా ఉండడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సినది కాదు, మనం కూడా అనునయించాల్సినది.
కమ్యూనిటీ ఫండ్స్ అన్నప్పుడు మహదానందంగా అనిపించిన అదే ధనం కులనిధి అనగానే మనలో జుగుప్స కలిగించడం మన దౌర్భాగ్యం. ఈ నిధి దొరక్కే అప్పులపాలైనా, విదేశాలకు వలసపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా...
ఎప్పుడైతే అవసరాలను గుర్తించడంమాని ఎక్కువ కులం & తక్కువ కులం అనే విభజనలో చిక్కుకున్నామో అప్పుడే కొత్త కులాల ఆవిర్భావం ఆగిపోయింది, తత్కారణాన మనం చేసే ఆవిష్కరణలు కూడా ఆగిపోయాయి. ఇదిగో ఇప్పుడిలా రాజకీయ అధికారం కోసం కులాలను దళాలుగా మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నాం (అందరం)!
ఈ కులనిధిని నాయుళ్ళ కోసం ఏర్పాటు చెయ్యాలన్నది నా లక్ష్యం, దాని ద్వారా పెట్టుబడి పొందాలనుకునే నాయుళ్లు హిందువులైఉండాలనేది (హిందువులవ్వాలనేది!) నియమం.
ఇది సనాతన ప్రతిదాడి.
నిజ శ్రావణ శుక్ల నవమి, 2080
Comments
Post a Comment