Skip to main content

వెల తక్కువ వ్యభిచారం

ప్రేమలో విఫలమయ్యాక మరియు మోసపోయాక వ్యసనాలకు బానిసలవ్వడం ఈమధ్య కాలంలో సమాచార మాధ్యమాలలో అంతగా కనిపించడంలేదు. అంటే ఈ వైఖరి తగ్గిపోయిందనేసి అనుకోవాలా?

అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు!

వ్యసనం అనగానే మద్యం, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు అనుకుంటారు; కానీ ఉద్యోగంలో లీనమైపోవడం, పోర్నుకు బానిసవడం, నిత్యం హస్తప్రయోగం, వీడియో గేమ్స్ అతిగా ఆడడం, వ్యాయామశాలలో అతిగా సమయం వెచ్చించడం, సాంఘిక మాధ్యమాలలో అతిగా స్పందించడం వంటివి కూడా వ్యసనాలే.

ఇలాంటి ప్రమాదకరమైన సాంఘిక మార్పులకు ప్రాముఖ్యత ఇవ్వడంలేదు సమాచార మాధ్యమాలు, కావున వీటిని ఇకపై సమాచార మాధ్యమాలు అనకుండా దురాచార మాధ్యమాలు అనడం కద్దు.

యువతలో ప్రబలుతున్న అసహజమైన వైఖరులను మొగ్గ దశలోనే గుర్తించడానికి సమాచార మాధ్యమాలు ముఖ్యమైన పాత్ర పోషించాలి. అలాంటి పాత్రను పోషించడంలో విఫలమైన ఫలితమే పశ్చిమదేశాల్లో (పశ్చిమదేశాలు ప్రాంతీయమనే పరిధిని దాటి ఆలోచనగా డెబ్భైఏళ్ళ క్రితమే రూపాంతరం చెందాయి) వీర్యక్షేపం & అండవిచ్ఛిత్తి వంటి సంకటస్థితులను నెలకొల్పింది.

కామం సనాతనంలో నాలుగు పురుషార్థాలలో ఒకటి, అలాంటి కామం దేహవాంఛలను రగిలిస్తుంది, రతిక్రీడకు రంగం సిద్ధం చేస్తుంది, సనాతనమైన మానవవాళి మనుగడను సుస్థిరం చెయ్యడానికి ప్రధానపాత్రను పోషిస్తుంది. కామం భౌతికమైన దేహధర్మాలకు మూలం, అలాంటి కామం వక్రీకరణలకులోనై బానిసలను తయారుచేస్తుంది, పలు లౌకిక దేశాలకు సుంకం చెల్లించే పరిశ్రమగా ఎదిగింది.

ఈ కామానికి సందర్భోచితమైన అవగాహన కల్పించుకోవడమే  ధర్మం, వక్రీకరణ అనేది ఈ ధర్మాన్ని అర్థోచితమైన పద్ధతిలో ప్రచారం చెయ్యడంలో వైఫల్యఫలితమే. అందుకే "కామశాస్త్రం మనది కాదు, బ్రిటీషోళ్లు వ్రాశారు", "హిందూ దేవాలయాలపై ఉన్న నగ్న ప్రతిమలు ఆంగ్లేయుల జుగుప్సాకరమైన లైంగిక విశృంఖలతను మనపై నెట్టడం" వంటి హీనమైన భావనలు మనలో కలుగుతున్నాయి.

కాలనియత (కలోనియలిజం) సమయంలో ఐరోపా, అమెరికా ఖండాల్లో తాము నిత్యం ప్రార్థించే ఏసుక్రీస్తు శిలువ ముందు వివాహం చేసుకున్న స్త్రీలను, వారికి పుట్టిన పిల్లలను (శిశ్నం & యోని అనే బేధం లేకుండా) అమ్మకానికి పెట్టిన ఆ/ఈ క్రైస్తవ పరమమూర్ఖులా కామశాస్త్రాన్ని రచించింది? వాళ్లేనా గుళ్లపై నగ్న ప్రతిమలను చెక్కింది?

దేహానికి కొన్ని వాంఛలుంటాయి, ఇవే దేహధర్మాలు. వాటిని తీర్చుకునే మార్గాలు వేశ్యాగృహాలు. వీటిని అధికారికంగా నిషేధం అయితే చేశాం, కానీ వాటిపై వచ్చే ఆదాయం కొందరి జేబుల్లోకి చేరడాన్ని మాత్రం నిలువరించడం అసాధ్యమని ఒప్పుకోవడమే మిగిలింది.

"వేశ్యాగృహాలు వద్దు, పోర్నుపరిశ్రమ ముద్దు" అనేవారికి నేను చెప్పేది ఏమీలేదు.

When sex is available for cheap neither love nor life has no meaning, and the marriage would become redundant.

Pattabhi Ramarao Tippabhotla | everything revolves around sex when it is available at cheap, nothing in life seems to be working and it doesn't matter either. All one does is work for sex so that they can pay for it. What would be the proportion of love in that life?

Would that be a fulfilling life or meaningful love? What sort of society does it make? In those kind of persons lives what's value of marriage apart from free (not cheap) sex? What is a man/woman apart from their sexual organs?

So at the end marriage as a social responsibility of reimagined cosmic order will make no sense but marriage as sexual play makes more sense. So they say big bang is nothing but God banging the Universe.

That's the meaning behind those lines.

So the question that needs to be asked is - what caused the cheap sex to exist in the first place?

Well, its the democratization of prostitution.

When anybody in one varna can become anyone in another varna, why not grant the same privilege to prostitution?

It increased the supply side and caused the cost of sex to fall, and soon they found that another source income is a must, hence the pornography industry.

One thing that must be remembered is that even after democratization premium and exclusivity still prevailed.

So the intent, word and deeds behind propagation of democratization were all not at all aligned with one or same or similar goal.

So prostitution evolved itself into a pornography and it made itself available at cheaper rates.

నిజ శ్రావణ శుక్ల అష్టమి, 2080

Comments

ప్రసిద్ధమైన పోస్టులు

భాషానువాదం 01 - ఆఫ్ఘనిస్థాన్లో ఆఖరి హిందువు

విక్రమశకం 2078, భాద్రపద పౌర్ణమి  ఆఫ్ఘనిస్థాన్ నుండి పారిపోకుండా అక్కడే ఉన్న ఆఖరి హిందువు ఒక హిందు పూజారి (హిందు ప్రీస్ట్). ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చెరిగిపోని చరిత్రలో శాశ్వతమైన గుర్తింపును హిందువులు ముద్రించగలిగారు అంటే ఇలాంటి వీరోచిత పోరాటాల ఫలితమే. ఆఫ్ఘనిస్థాన్ నుండి ప్రాణాలకు భయపడి పలాయనం చిత్తగించకుండా, పూర్వం నుండి వస్తున్న దేవతారాధనను కొనసాగిస్తున్న ఆ ఒంటరి హిందువు యొక్క ముఖచిత్రం హిందు నాగరికత చరిత్రలో ఒక మైలురాయిగా స్థిరపడుతుంది మరియు ఆఫ్ఘనిస్థాన్లో హిందు ధర్మం ఎలా నాశనం కాబడిందో భవిష్యత్తు తరాలకు ఒక పాఠంలా నిలిచిపోతుంది. ఆఫ్ఘనిస్థాన్ త్వరలో "ఇక్కడ కాఫీర్లు ఎవ్వరూ బ్రతికిలేరు" అనే బ్యానర్లు కట్టడం మొదలుపెట్టొచ్చు.! ఈ సంఘటన బహుభయంకరమైన సత్యాన్ని ప్రకటిస్తుంది, ఇది మాటల్లో చెప్పలేని ఉద్విగ్నత. ఈ అంతానికి ఆరంభం కొన్ని శతాబ్దాల క్రితం "మోమిన్లు/నమ్మకస్తులు" & "కాఫీర్లు/అపనమ్మకులు" అనే విభజన ఆధారం అయ్యింది, వీరిమధ్య జరిగే యుద్ధం కాఫీర్ల వినాశనంతోనే ఆగుతుంది అనే భయం అందరిలో నిగూఢంగా దాగి ఉంది. ఈ అమానుషంలో చివరి అంకం వందల సంవత్సరాల పూర్వం

కువకువలు 03 - చిన్న కలలు, చిన్నచిన్న భయాలు

విక్రమశకం 2079, శ్రావణ కృష్ణపక్షం  నా కలలు నన్ను భయపెడతాయి. వాటిని నేను అందుకోగలనో లేదో అనే చిన్ని భయం నన్ను నా ఆశయాలవైపుకి నెమ్మదిగా తోస్తుంది.  ఆ ఆశయాన్ని అందుకునే క్రమంలో & ఆ భయాన్ని ఛేదించే క్రమంలో నేను పొందే అనుభవాలు, నాకు కలిగే అనుభూతులు, నాలో వచ్చే అవిరళ మార్పులు, నాకు నేను ఇచ్చుకునే ఓదార్పులు నన్ను నా ఆశయాలను దగ్గరగా చేస్తాయి. 'లక్ష్యాలు సాధించలేమేమో' అనే భయం నుండి వచ్చే ధైర్యం నిరంతరం నింపాదిగా ఉంటుంది, నిండు కుండలా ఉంటుంది, తొణకదు, బెణకదు, వెరవదు, జంకదు. అలా స్థిరంగా ఉంటుంది. ఆ ఆశయం ఇహ నన్ను భయపెట్టలేదు. నా భయం ఆగిపోయిన తర్వాత జరిగేది ఒక్కటే... నేను నా ఆశయాన్ని చేరుకోవడం. మరి తర్వాత? మరొక ఆశయం, మరొక భయం, మరిన్ని సంఘర్షణలు, మరెన్నో అనుభవాల పాఠాలు, కొన్ని అపజయాలు, ఎన్నెన్నో విజయాలు, మళ్ళీ ఓనమాలు మామూలే... జీవితం అందమైనది అని చెప్పడం తేలిక, దాన్ని చేసి చూపెట్టడం చాలా కష్టం. జీవితాన్ని అద్భుతంగా జీవించే పద్ధతిని ఔపోసన పడితే అందులో ఉండే అమృతతరంగాలు మనల్ని అఖండ అలౌకిక ఆనందతీరాలకు చేరుస్తాయి. ఏదో ఒకనాడు నేను ఆ తీరాలను స్పృశిస్తాను. ఒకవేళ ఆ ఆనందతీరాలను చేరుకోలేదు అంటే, నే

వాకిట్లో వర్షం పడుతోంది.!

వాకిట్లో వర్షం పడుతోంది.! వర్షంలో తడిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి, అంతకంటే ఎక్కువగా ఆ వర్షంలో నీతో కలిసి వేసిన అడుగులు గుర్తొస్తున్నాయి. గొడుగు పక్కకి పారేసి, నీ చున్నీలో దాక్కున్న చిలిపి చేష్టలు గుర్తొస్తున్నాయి. వానలో మనం కృష్ణా-గోదావరీ సంఘమంలా కలిసి నడుస్తుంటే మనల్ని చూసి కుళ్ళుకుని మేఘాలు చేసిన ఘీంకారాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తడిచిన బట్టల్లో మనం చేసుకున్న ఆలింగనాలు నాకు ఇంకా గుర్తున్నాయి, ఒకరికొకరం మార్చుకున్న వాగ్ధానాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తొలకరి జల్లుల్లో వచ్చే మట్టి సువాసన నీ శరీరం వెదజల్లే సుగంధంతో కలిసి నన్ను తన్మయత్వంలోకి నెట్టేసిన క్షణాలు ఇంకా నాలో జీవించేవున్నాయి. వానలో నా చెయ్యి పట్టుకుని నాతో నడిచిన నీ వయ్యారపు నడకలు నాకింకా గుర్తున్నాయి, నీ వలపుల కవ్వింతలు నన్నింకా కలవరానికి గురిచేస్తున్నాయి. కృష్ణమ్మ నీటి రుచి గోదారి నీటి వంపులతో సంపూర్ణం అయినట్లు, నీలో నన్ను కలిపేసుకున్న నువ్వు నాకింకా గుర్తున్నావు. వాన పడిన ప్రతిసారీ నీతో కలిసి తడవాలని, నడవాలని, కలిసిపోవాలని, విడదీయలేని బంధమైపోవాలని, నీ శరీరంలో ఒక భాగమైపోవాలని వచ్చిన ఎన్నో ఆశలు...అడియాశలుగా మారడం నాక

కువకువలు 02 - సరితాగానం

విక్రమశకం 2078, ఆషాఢ కృష్ణపక్షం  మనసు బాగోనప్పుడు ఒంటరిగా వర్షంలో కేవలం మన ఆలోచనలతో మాత్రమే సహవాసం చేస్తూ తడిస్తే వచ్చేటంత మానసిక ఉల్లాసం ఎంత డబ్బు ఖర్చు చేసినాసరే దొరకదు. మనసు కలతచెందినప్పుడు మన హృదయగాయాన్ని గుర్తెరిగి మసలుకునే వ్యక్తులతో మాట్లాడినప్పుడు దొరికే సలహాల ముందు గొప్ప మానసిక నిపుణుడు డబ్బుకోసం ఇచ్చే సలహాలు తీసికట్టే. ఒంటరితనం మరియు ఏకాకి జీవితం ఒకటి కాదు అనే పరమసత్యం ఇవాళ బోధపడింది. మేఘాల ఘర్జనలో మండూకాల బెకబెకలలో హోరున కురుస్తూ ఘీంకారాలు తీసే వాన, గుండెల్లో ఉప్పొంగే ఎన్నో అగ్నిపర్వతాలను అణచివేస్తుంది, ఆహ్లాదాన్ని మళ్ళీ ఆనందించేలా చేస్తుంది. వర్షంతో ఎన్నో జీవితాలు ముడిపడివున్నాయి. ఆ మాటకొస్తే వర్షం లేకపోతే యేర్లు ఉంటాయా? సెలయేర్లు పారతాయా? మడిచేలు పండుతాయా? తిండిగింజలు దొరుకుతాయా? పర్జన్యభరిత వినీలాకాశంలో దుర్జన్యకుంజిత దాహార్తిని తీర్చే వారుణాశ్రిత ఇంద్రజాలికుడు దేశదేశాల సరిహద్దులు దాటేస్తూ, ఎల్లలు చెరిపేస్తూ, నదులను ఉరికిస్తూ, కాలాన్ని నడిపిస్తూ, సమయాన్ని నిలదీస్తూ, ప్రాణాన్ని నిలబెడుతున్నాడు. సశేషం... ----- * ప్రవహించే నీటికి "సరితా" అని పేరు.    శ్రీ మహావిష్ణు

తల్లిని మించిన దైవం లేదా?

పాఠశాలలో చేరగానే మొదట నేర్పే పంక్తి "తల్లిని మించిన దైవం లేదు" అని. అలాంటి ఒక తల్లి కథ -  ఆమె భర్త అనుకోని కారణాల చేత మరణించాడు పైగా అభంశుభం తెలియని మైనర్ బాలిక బాధ్యతలు పూర్తిగా ఆ తల్లి మీద పడ్డాయి. భర్త మరణించాడు, ఉన్న కష్టాలను ఈదడానికి చేదోడువాదోడుగా ఉండే మగమనిషి చనువును ఆశించింది ఆ తల్లి. ఆమె ఒక్కటే శారీరక సుఖాలు అనుభవిస్తే బాగోదు అనుకుందో ఏమో గానీ, ఆ సహచరుడితో (లివ్-ఇన్ రిలేషన్) తన మైనర్ కూతుర్ని కూడా అతని పక్కలో వేసింది.  ఆ సహచరుడు ఎప్పటినుండో అణచుకున్న ఆశను, కామతృష్ణను ఒకేసారి చూపలేకపోయాడు. అందుకే అనేకసార్లు ఆ మైనర్ బాలికను స్వర్గలోకాల అంచులకు తీసుకెళ్ళాడు. ఆ పాప తల్లికి ఆ స్వర్గలోకాలే కనిపించాయి తప్ప పంటిక్రింద అదుముకున్న ఆ పసిదాని కన్నీరు కనపడలేదు. ఫలితంగా ఆ పసిది మరొక పసివాడికి జన్మనిచ్చింది. కూతురిని సవితిగా మార్చుకున్న తల్లి, కూతురితో సమానమైన పిల్లతో కొడుకును కన్న తండ్రికాని తండ్రి, "ఎలాగూ పుట్టాడుగా, కళ్ళు మూసుకుని ఇదే కొనసాగిద్దాం" అనుకున్నట్లున్నారు పాపం.! పిల్లోడు పుట్టాక కూడా ఆ పసిదానికి శారీరక సుఖం (వేదన) తగ్గలేదు కదా ఇంకా హెచ్చయింది. మరొక రెండుసార

వెనకొచ్చిన కొమ్ములు!

అప్పుడప్పుడు - "హిందు నాగరికతకు కనీసం పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వస్తుందంటే ఇదెంత గొప్పదో ఆలోచించండి. ఇలాంటి గొప్ప సంస్కృతి తప్పుడుదని నిన్నగాక మొన్నొచ్చిన ఎడారి మతాలు వంకలు పెడుతున్నాయి" అని కొందరు హిందువులు చేసే వ్యాఖ్యలు మనందరికీ సుపరిచితమే. ఫ్యాషన్ ఇండస్ట్రీలో - "కొత్తొక వింత, పాతొక రోత" అనే సామెత ఒకటుంది.  మన తెలుగులో - "వెనక మొలిచిన కొమ్ములొచ్చి ముందు పెరిగిన చెవుల్ని వెక్కిరించాయి" అనే సామెత కూడా ఉంది. పైరెండు సామెతలూ ఈ ఎడారి మతాలకు సరిగ్గా నప్పుతాయి. సరే, ఇదంతా వదిలేద్దాం! అసలు నిన్నగాక మొన్నొచ్చిన ఈ ఎడారి మతాలు చరిత్రను ఎలా చూస్తాయో చూద్దాం... క్రీస్తిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని క్రైస్తవులు "హీథేన్డోమ్" అంటారు. మహ్మదీయిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని మహ్మదీయులు "జాహిలియత్" అంటారు. అనగా - 'అనాగరికులైన హీనులైన గౌరవం ఇవ్వజాలని దౌర్భాగ్యులైన మూర్ఖ విగ్రహారాధకుల రాజ్యం' అని అర్థం.  దీనికి ప్రతిగా క్రైస్తవులు "క్రిస్టన్డోమ్"ను స్థాపించాలనీ, మహ్మదీయులు "దార్ ఉల్ ఇస్లాం

మానసికస్థితి | మరణం & గౌరవం

కొన్ని రోజుల క్రితం చైనీస్ వైరస్ వలన చనిపోయిన హిందువుల దహన కార్యక్రమాలను కొన్ని జాతీయ & అంతర్జాతీయ పత్రికల ముఠాలు చాలా నీచంగా ప్రదర్శించాయి. ఇవి చూసినంతసేపూ నాకు వారు పొందిన పైశాచిక ఆనందం కనిపించింది. నేను వ్యక్తిగతంగా చాలా చింతించాను. నాలో మొదలయ్యిన "మరణించిన వ్యక్తులకు మనం కనీస గౌరవం ఇవ్వలేని దౌర్భాగ్య సమాజంలో ఉన్నామా?" అనే భావోద్వేగం క్రమేణా ఈ వ్యాసంగా రూపుదిద్దుకుంది. భారతీయ సంస్కృతి మరియు హిందూ నాగరికత ప్రకారం మరణం అనేది, ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని వెతుక్కునే ప్రక్రియ. అలా వెతుక్కునే ఆత్మ యొక్క పూర్వపు జన్మకు సంబంధించిన అన్ని వస్తువులను దహనం చేయడం కొన్ని సాంప్రదాయాలకు మరియు జాతులకు ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం, పరంపర. ఈ ఆచారానికి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాష్యం చెబుతూ ఉంటారు, కొంతమంది దీనికి సైన్స్ ను కూడా జోడిస్తూ ఉంటారు, మరికొందరైతే ఈ ఆచారానికి ఎండు తాటాకులు కట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. నేను సైన్స్ కు దాని అర్హతకు మించిన ప్రాధాన్యం ఇవ్వను. కనుక, ఈ ఆచారం వెనుక ఉన్న తాత్వికతను మరియు బ్రతికి ఉన్న వారిగా చనిపోయిన వారి శరీరాలతో మనం వ్యవహరించాల్సిన కనీస

కథాకేళి 02 - అతనితో ఒక రాత్రి!

అతనితో ఒక రాత్రి.! జాబిలమ్మ వెలుగులో, చల్లగాలి హాయిలో, ఆరుబయట వనంలో, అద్దాలమేడ లాంటి ఊహల్లో అతనితో గడిపాను ఆ రాత్రి. అతని కళ్ళలో ఏదో తెలియని కొరత, ఎవరికోసమో ఆగని వెతుకులాట, ఎవరినో కలవాలనే ఆత్రుత, కంటికి కనిపించని అశ్రువులు నాకు కనిపించాయి. అతని ముఖంలో అంతులేని ఆవేదన ఏదో ఉంది, ఆప్యాయత తరగని భావం ఉంది, అనురాగం నిండిన అతని చూపులు నా మనసు పొరల్లో దాగున్న ప్రేయసిని తట్టిలేపాయి. అతని బాధను చూడలేకపోయాను. అతని కళ్ళలోకి ఆరాధనగా పరికించి చూశాను, అతన్ని కామించాను, కవ్వించాను, మనసుని రెచ్చగొట్టాను. చివరికి అతన్ని ఈలోకంలోకి తీసుకువచ్చాను. అతని చేతిని తీసుకుని నా భుజమూ స్థనమూ కలిసిన జంగమస్థానం పైన అదిమాను, అతని మరొక చేతిని నాభికీ పిరుదులకూ మధ్య ఉన్న నడుముపై ఆనించాను. ప్రాణం వచ్చినట్లు అతను చిరునవ్వు నవ్వాడు, ఏదో తెలియని వెలితితో... ఆ నవ్వులో ఎంతో ప్రేమ దాగుంది. అది ఎవరికోసమో నాకు తెలీదు కానీ నాకోసమైతే మాత్రం కాదు, అనే స్పృహ ఉంది నాకు. కానీ అతని నవ్వుల పాలసముద్రంలో నన్ను నేను మైమరచిపోయాను, అందులో ఓలలాడే కలువనవ్వాలని ఆశపడ్డాను. నాలో ప్రేమ కోరికలు అదుపుతప్పాయి, అతనికి నా కళ్ళతోనే సైగ చేశాను, నా మనసున ఉ

కథాకేళి 01 - బీటలువారిన గోడ

విక్రమశకం 2078, శ్రావణ శుక్లపక్షం ఎన్నో దశాబ్దాల నుండి రాజదుర్గాన్ని (కోటను) రక్షిస్తూ వస్తున్న బలిష్టమైన ప్రహరీగోడలో కాలానుగుణంగా కలిగే మార్పుల వలన చిన్నచిన్న పగుళ్ళు రావడం మొదలయ్యాయి. ఎక్కడినుండి వచ్చిందో తెలియదు, ఒక కాకి తన ముక్కుకు చిన్నపాటి విత్తనాన్ని ఒకదాన్ని గోడలో వచ్చిన పగుళ్ళలో విడిచింది. "ఏ చెట్టు విత్తనానివే నువ్వు, నా దగ్గరికి వచ్చావు? నేనెవరో తెలిసే ఇంత సాహసం చేశావా?" అని ఆ ప్రహరీగోడ విత్తనాన్ని గద్దించింది. దీనికి ఆ విత్తనం "ఇందులో నా తప్పు ఏమీలేదు, కాకి ఆహారం తినేసమయంలో దాని ముక్కుకి నన్ను కరుచుకుని, ఇక్కడ విడిచింది" అని సమాధానం ఇస్తూ, "ఇంతపెద్ద రాజదుర్గానికి రక్షణ కల్పిస్తున్నావు. పిసరంత కూడా లేను నేను, బయట నా ప్రయాణానికి భద్రతలేదు, నాకు కూడా ప్రాణహాని లేకుండా కాపాడవూ..." అంటూ ప్రాధేయపడింది. ఆలోచనలో పడ్డ ప్రహరీగోడ, "ఇంత చిన్న విత్తనం నన్నేమి చేస్తుందిలే, అయినా నా స్వలక్షణం ప్రకారం శరణు కొరినవారికి రక్షణ ఇవ్వడం నా విధి, కర్తవ్యం మరియు ధర్మం" అని తనలో తాను సమాధానం చెప్పుకొని, ఆ విత్తనానికి కొంత చోటిచ్చింది మన పరోపకారి ప్రహరీగోడ. రో