Skip to main content

ఇల్లెందుకు?

"ఇల్లు కొనడమా లేక అద్దెకుండడమా! ఏది నయం?" అనేటి అంశం రాబర్ట్ కియోసాకి ప్రాచుర్యంలోకి తెచ్చిన '90ల నాటి కంటే నేడు అధికమైన చర్చ (ఆర్భాటం అనడం బాగుంటుంది!) జరుగుతోందంటే పరిస్థితి ఎంతలా విషమించి వికటించిందో అర్థం చేసుకోవచ్చు.

ఆధునికత తెచ్చిన పలురకాలైన అభ్యుదయ సంస్కరణల్లో ఒకటి గృహవిపణి, అదే హౌసింగ్ మార్కెట్.

"గృహం నివాసం కదా, అంగడిలో అమ్మే ఒక వినియోగవస్తువు ఎలా అవుతుంద?"ని ప్రశ్నించడమో యోచించడమో ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు. ఎవరో ఒకరు చేసే ఉంటారని అనుకుంటున్నాను; అయితే వారి యోచనలు పిచ్చికేకలుగా, ప్రశ్నలు మృత్యుఘోషలుగా మిగిలిపోయి ఉండే అవకాశం మెండుగా ఉంది!

ఒకవైపు నివసించడానికి ఇల్లులేనివారైతే మరొకవైపు ఇంటితో వ్యాపారం చేసే విపణి. క్రైస్తవ మూలాలతో స్థాపించబడిన పరిశ్రమను (ఇండస్ట్రీ) చదవడం నాకున్న అలవాటు, అలాంటి అలవాటులో కాలనియతకు (కలోనియలిజం) ముందు "అద్దె" అనే మాటగానీ, ఆ అర్థంలో వాడుకలో ఉన్న మరొక పదంగానీ నాకు కనపడలేదు. అంటే కాలనియత జరగకముందు నివాసం ఉండడానికి ఎవరికి వారికే సొంతిల్లు ఉండేది అనుకోవాలి!

రాజ్యాలు పోయాయి, రాజులు & వారి వంశాలు పోయాయి, అనువంశిక పాలన & వృత్తులు పోయాయి అని సంబరపడే ముందుగా సొంతిల్లు అనేదిపోయి అద్దిల్లు అనేది వచ్చిందనే విషయం మరిచిపోవడం గమనార్హం; ఇది కూడా ఒకరకమైన మానసిక బానిసత్వమేనని నా ఉద్ధేశ్యం!

ఏదేమైనా, ఇప్పుడున్న యుగధర్మం ప్రకారం "సొంతిల్లు లేదా అద్దింట్లో ఏది నయం?" అంటే తిన్నగా నిక్కచ్చి సమాధానం చెప్పడం కష్టం. సమాధానం లేక కాదు, మనకు కొన్ని వాస్తవిక అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసి తర్వాత ఒక పరిష్కారానికి వచ్చే సామర్థ్యం లోపించడమే కారణం. దీన్నే ఆంగ్లంలో స్టన్టింగ్ అంటారు, కొందరు దీన్ని మనుషులు ఎత్తు పెరగకపోవడంలో లోపం అంటారు, అనగా వారు దీన్ని శారీరక లోపంగానే చూస్తారు. నేను దీన్ని మానసిక మరియు భౌతిక లోపంగా కూడా చూస్తాను.

అలాంటి ఒక వాస్తవికత - మనం అద్దె ఇంట్లో ఉంటున్నామని మన కుటుంబంలో మరణాలు జరక్కుండా ఉండవు, అలాంటి సందర్భంలో ఇంటి యజమాని చెప్పే మొదటి మాట - "మీరు వేరే ఇల్లు చూసుకోండ"ని. సాక్షాత్తు బ్రహ్మస్వరూపమైన ఆత్మకు అప్పటిదాకా నివాసం కల్పించిన ఆ శరీరం కాలధర్మం పాటించి విగతయై ఇంకా అక్కడే పడి ఉండగా, ఆ విగతదేహానికి మరణ సంస్కారాలు జరపాలో లేక మరొక ఇల్లు అద్దెకు వెతుక్కునే పనిలో ఉండాలో తేల్చుకోలేని సంకటస్థితిలో(కి) మధ్యతరగతి హిందువులు ఉంటున్నారు & నెట్టివెయ్యబడుతున్నారు.

ఆ చచ్చిన మనిషి అంత్యక్రియలు జరపడానికి అద్దె ఇల్లు ఆటంకం; వయసుమళ్ళిన, లేవలేని తల్లిదండ్రులను మనం ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో మనతో ఉంచుకోవడానికి అద్దె ఇల్లు ప్రతిబంధకం. అనుకోకుండా ఉద్యోగంపోతే అప్పుచేసి మరీ అద్దె కట్టడం మనతో బలవంతంగా అనుభవింపజేస్తున్న దారిద్య్రం.

బ్రహ్మస్వరూపమైన ఆత్మకు నివాసం కల్పించిన దేహం ఆ ఆత్మ నుండి అద్దె తీసుకుంటుందా? తీసుకోవడంలేదు కదా, అంటే ఈ దేహం ఆ ఆత్మకు సొంతం; ఇది అలౌకికం. లౌకికంలో కూడా ఇదే వర్తించింది (ఇదే ఋతం!), ఒకప్పుడు. అందుకే అప్పట్లో ఇల్లు సొంతం. ఆత్మకు దేహం సొంతం, మనుషులకు నివాసం సొంతం.

మరి మనం నివాసం ఉండే ఇంటికి ఇప్పుడెందుకు అద్దె కట్టాలి?

ఆధునిక అభ్యుదయ (భూ)సంస్కరణల ఫలితం! ("భూ" అనేకంటే "స్థలం" అంటే బాగుంటుంది!)

అపరిమితమైన స్వేచ్ఛ తెచ్చిన చేటు!

ఎవ్వరైనా అమ్మొచ్చు, ఎవ్వరైనా కొనొచ్చు; మత్స్యన్యాయం!

వీటన్నిటికీ మూలమైన సిద్ధాంతం "కాలనియతకు దారితీసిన క్రైస్తవం" అనగానే నాలో కరుడుగట్టిన మతమౌఢ్యుడైన వ్యక్తి మీకందరికీ కనిపిస్తాడు.

అంతకుమించి చూడలేకపోవడమే స్టన్టింగ్!

"నా దగ్గరున్న స్థలం నాకు ఎందుకూ పనికిరాదుగానీ ఇంకొకరికి అది ఉపయోగకరం. కనుక వారికి కావాల్సింది స్థలం, అందుకు ప్రతిగా నాకు వారు కొంత రుసుము చెల్లించాల"నేది యూదుల సిద్ధాంతం, క్రైస్తవం పుణికిపుచ్చుకున్న వారసత్వం. ఇదే రెంట్ సీకింగ్ అనే సిద్ధాంతానికి మూలం. ఇక్కడ స్థలం పోషణనిచ్చే భూమిగాకాక సంపాదించే సాధనంగా కనిపిస్తుంది, కనుక అది అంగట్లో వస్తువు, వెరసి గృహవిపణి (హౌసింగ్ మార్కెట్).

ఆత్మకు దేహం నివాసం, దేహానికి ఇల్లు నివాసం & అద్దె కట్టడం దారిద్య్ర సూచిక మరియు సంస్కారనాశనానికి హేతువు.

కౌటిల్యుడు "నయం" అనే పదాన్ని భౌతిక లాభానికి సూచికగా వాడతాడు, పూర్వం క్షేమం అనే అర్థంలో వాడేవారు, మనమీ ఆధునిక కాలంలో ఈ పదాన్ని వాడుకలోనూ ఉంచడంలేదు.

ఆఖరి అలోచన - మొదటి శ్రేణి పట్టణాల్లో ఇళ్ళస్థలాలు (భూమి కాదు) కొనలేని వారందరూ రెండవ/మూడవ శ్రేణి నగరాలకు తరలుతున్నారు. మరక్కడ (మొదటి శ్రేణి పట్టణాల్లో) అద్దెకు ఉంటూ ఉద్యోగం చేసే దిగువ మధ్యతరగతి హిందువులు ఇంటిస్థలం కోసం ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలుసా?

దేవాలయాల భూముల్లో ఇళ్ళు కట్టుకుంటున్న వారిని ఒకసారి పరికించి చూడండి. కబ్జాలు (ఆక్రమణ) ఎవరు చేస్తున్నారో, ఆ దేవాలయ భూముల్ని సెక్యులర్ ప్రభుత్వాలు ఎందుకు పంచుతున్నాయో కాస్త అర్థం అవుతుంది. ఇందుకు ఉదాహరణగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నూజివీడు సంస్థానాధీశులు శ్రీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారికి సమర్పించుకున్న భూములు ఏమయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి.

మరి స్వామివారికి ఆదాయం? ఆ దేవాలయం మీద ఆధారపడి బ్రతుకుతున్నవారి జీవనం? భూమికే పతియైన ఆ విష్ణువుకే భూములు మిగల్చకుండా మింగేస్తున్నది ఎవరు?

దిగువ మధ్యతరగతి నెపాన్ని రాజకీయపార్టీలపై, ఎన్నుకున్న నాయకులపై, కొలిచే దైవంపై నెట్టేసి ఎన్నెన్ని పాపకార్యాలు చేస్తున్నారో మచ్చుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఇక్కడున్న మధ్యతరగతి జనాలు బైబిల్ నీతులు చెప్పడం కాస్త తగ్గిస్తే బాగుంటుంది.

నిజ శ్రావణ శుక్ల తదియ, 2080

Comments

ప్రసిద్ధమైన పోస్టులు

భాషానువాదం 01 - ఆఫ్ఘనిస్థాన్లో ఆఖరి హిందువు

విక్రమశకం 2078, భాద్రపద పౌర్ణమి  ఆఫ్ఘనిస్థాన్ నుండి పారిపోకుండా అక్కడే ఉన్న ఆఖరి హిందువు ఒక హిందు పూజారి (హిందు ప్రీస్ట్). ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చెరిగిపోని చరిత్రలో శాశ్వతమైన గుర్తింపును హిందువులు ముద్రించగలిగారు అంటే ఇలాంటి వీరోచిత పోరాటాల ఫలితమే. ఆఫ్ఘనిస్థాన్ నుండి ప్రాణాలకు భయపడి పలాయనం చిత్తగించకుండా, పూర్వం నుండి వస్తున్న దేవతారాధనను కొనసాగిస్తున్న ఆ ఒంటరి హిందువు యొక్క ముఖచిత్రం హిందు నాగరికత చరిత్రలో ఒక మైలురాయిగా స్థిరపడుతుంది మరియు ఆఫ్ఘనిస్థాన్లో హిందు ధర్మం ఎలా నాశనం కాబడిందో భవిష్యత్తు తరాలకు ఒక పాఠంలా నిలిచిపోతుంది. ఆఫ్ఘనిస్థాన్ త్వరలో "ఇక్కడ కాఫీర్లు ఎవ్వరూ బ్రతికిలేరు" అనే బ్యానర్లు కట్టడం మొదలుపెట్టొచ్చు.! ఈ సంఘటన బహుభయంకరమైన సత్యాన్ని ప్రకటిస్తుంది, ఇది మాటల్లో చెప్పలేని ఉద్విగ్నత. ఈ అంతానికి ఆరంభం కొన్ని శతాబ్దాల క్రితం "మోమిన్లు/నమ్మకస్తులు" & "కాఫీర్లు/అపనమ్మకులు" అనే విభజన ఆధారం అయ్యింది, వీరిమధ్య జరిగే యుద్ధం కాఫీర్ల వినాశనంతోనే ఆగుతుంది అనే భయం అందరిలో నిగూఢంగా దాగి ఉంది. ఈ అమానుషంలో చివరి అంకం వందల సంవత్సరాల పూర్వం

కువకువలు 03 - చిన్న కలలు, చిన్నచిన్న భయాలు

విక్రమశకం 2079, శ్రావణ కృష్ణపక్షం  నా కలలు నన్ను భయపెడతాయి. వాటిని నేను అందుకోగలనో లేదో అనే చిన్ని భయం నన్ను నా ఆశయాలవైపుకి నెమ్మదిగా తోస్తుంది.  ఆ ఆశయాన్ని అందుకునే క్రమంలో & ఆ భయాన్ని ఛేదించే క్రమంలో నేను పొందే అనుభవాలు, నాకు కలిగే అనుభూతులు, నాలో వచ్చే అవిరళ మార్పులు, నాకు నేను ఇచ్చుకునే ఓదార్పులు నన్ను నా ఆశయాలను దగ్గరగా చేస్తాయి. 'లక్ష్యాలు సాధించలేమేమో' అనే భయం నుండి వచ్చే ధైర్యం నిరంతరం నింపాదిగా ఉంటుంది, నిండు కుండలా ఉంటుంది, తొణకదు, బెణకదు, వెరవదు, జంకదు. అలా స్థిరంగా ఉంటుంది. ఆ ఆశయం ఇహ నన్ను భయపెట్టలేదు. నా భయం ఆగిపోయిన తర్వాత జరిగేది ఒక్కటే... నేను నా ఆశయాన్ని చేరుకోవడం. మరి తర్వాత? మరొక ఆశయం, మరొక భయం, మరిన్ని సంఘర్షణలు, మరెన్నో అనుభవాల పాఠాలు, కొన్ని అపజయాలు, ఎన్నెన్నో విజయాలు, మళ్ళీ ఓనమాలు మామూలే... జీవితం అందమైనది అని చెప్పడం తేలిక, దాన్ని చేసి చూపెట్టడం చాలా కష్టం. జీవితాన్ని అద్భుతంగా జీవించే పద్ధతిని ఔపోసన పడితే అందులో ఉండే అమృతతరంగాలు మనల్ని అఖండ అలౌకిక ఆనందతీరాలకు చేరుస్తాయి. ఏదో ఒకనాడు నేను ఆ తీరాలను స్పృశిస్తాను. ఒకవేళ ఆ ఆనందతీరాలను చేరుకోలేదు అంటే, నే

వాకిట్లో వర్షం పడుతోంది.!

వాకిట్లో వర్షం పడుతోంది.! వర్షంలో తడిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి, అంతకంటే ఎక్కువగా ఆ వర్షంలో నీతో కలిసి వేసిన అడుగులు గుర్తొస్తున్నాయి. గొడుగు పక్కకి పారేసి, నీ చున్నీలో దాక్కున్న చిలిపి చేష్టలు గుర్తొస్తున్నాయి. వానలో మనం కృష్ణా-గోదావరీ సంఘమంలా కలిసి నడుస్తుంటే మనల్ని చూసి కుళ్ళుకుని మేఘాలు చేసిన ఘీంకారాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తడిచిన బట్టల్లో మనం చేసుకున్న ఆలింగనాలు నాకు ఇంకా గుర్తున్నాయి, ఒకరికొకరం మార్చుకున్న వాగ్ధానాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తొలకరి జల్లుల్లో వచ్చే మట్టి సువాసన నీ శరీరం వెదజల్లే సుగంధంతో కలిసి నన్ను తన్మయత్వంలోకి నెట్టేసిన క్షణాలు ఇంకా నాలో జీవించేవున్నాయి. వానలో నా చెయ్యి పట్టుకుని నాతో నడిచిన నీ వయ్యారపు నడకలు నాకింకా గుర్తున్నాయి, నీ వలపుల కవ్వింతలు నన్నింకా కలవరానికి గురిచేస్తున్నాయి. కృష్ణమ్మ నీటి రుచి గోదారి నీటి వంపులతో సంపూర్ణం అయినట్లు, నీలో నన్ను కలిపేసుకున్న నువ్వు నాకింకా గుర్తున్నావు. వాన పడిన ప్రతిసారీ నీతో కలిసి తడవాలని, నడవాలని, కలిసిపోవాలని, విడదీయలేని బంధమైపోవాలని, నీ శరీరంలో ఒక భాగమైపోవాలని వచ్చిన ఎన్నో ఆశలు...అడియాశలుగా మారడం నాక

కువకువలు 02 - సరితాగానం

విక్రమశకం 2078, ఆషాఢ కృష్ణపక్షం  మనసు బాగోనప్పుడు ఒంటరిగా వర్షంలో కేవలం మన ఆలోచనలతో మాత్రమే సహవాసం చేస్తూ తడిస్తే వచ్చేటంత మానసిక ఉల్లాసం ఎంత డబ్బు ఖర్చు చేసినాసరే దొరకదు. మనసు కలతచెందినప్పుడు మన హృదయగాయాన్ని గుర్తెరిగి మసలుకునే వ్యక్తులతో మాట్లాడినప్పుడు దొరికే సలహాల ముందు గొప్ప మానసిక నిపుణుడు డబ్బుకోసం ఇచ్చే సలహాలు తీసికట్టే. ఒంటరితనం మరియు ఏకాకి జీవితం ఒకటి కాదు అనే పరమసత్యం ఇవాళ బోధపడింది. మేఘాల ఘర్జనలో మండూకాల బెకబెకలలో హోరున కురుస్తూ ఘీంకారాలు తీసే వాన, గుండెల్లో ఉప్పొంగే ఎన్నో అగ్నిపర్వతాలను అణచివేస్తుంది, ఆహ్లాదాన్ని మళ్ళీ ఆనందించేలా చేస్తుంది. వర్షంతో ఎన్నో జీవితాలు ముడిపడివున్నాయి. ఆ మాటకొస్తే వర్షం లేకపోతే యేర్లు ఉంటాయా? సెలయేర్లు పారతాయా? మడిచేలు పండుతాయా? తిండిగింజలు దొరుకుతాయా? పర్జన్యభరిత వినీలాకాశంలో దుర్జన్యకుంజిత దాహార్తిని తీర్చే వారుణాశ్రిత ఇంద్రజాలికుడు దేశదేశాల సరిహద్దులు దాటేస్తూ, ఎల్లలు చెరిపేస్తూ, నదులను ఉరికిస్తూ, కాలాన్ని నడిపిస్తూ, సమయాన్ని నిలదీస్తూ, ప్రాణాన్ని నిలబెడుతున్నాడు. సశేషం... ----- * ప్రవహించే నీటికి "సరితా" అని పేరు.    శ్రీ మహావిష్ణు

తల్లిని మించిన దైవం లేదా?

పాఠశాలలో చేరగానే మొదట నేర్పే పంక్తి "తల్లిని మించిన దైవం లేదు" అని. అలాంటి ఒక తల్లి కథ -  ఆమె భర్త అనుకోని కారణాల చేత మరణించాడు పైగా అభంశుభం తెలియని మైనర్ బాలిక బాధ్యతలు పూర్తిగా ఆ తల్లి మీద పడ్డాయి. భర్త మరణించాడు, ఉన్న కష్టాలను ఈదడానికి చేదోడువాదోడుగా ఉండే మగమనిషి చనువును ఆశించింది ఆ తల్లి. ఆమె ఒక్కటే శారీరక సుఖాలు అనుభవిస్తే బాగోదు అనుకుందో ఏమో గానీ, ఆ సహచరుడితో (లివ్-ఇన్ రిలేషన్) తన మైనర్ కూతుర్ని కూడా అతని పక్కలో వేసింది.  ఆ సహచరుడు ఎప్పటినుండో అణచుకున్న ఆశను, కామతృష్ణను ఒకేసారి చూపలేకపోయాడు. అందుకే అనేకసార్లు ఆ మైనర్ బాలికను స్వర్గలోకాల అంచులకు తీసుకెళ్ళాడు. ఆ పాప తల్లికి ఆ స్వర్గలోకాలే కనిపించాయి తప్ప పంటిక్రింద అదుముకున్న ఆ పసిదాని కన్నీరు కనపడలేదు. ఫలితంగా ఆ పసిది మరొక పసివాడికి జన్మనిచ్చింది. కూతురిని సవితిగా మార్చుకున్న తల్లి, కూతురితో సమానమైన పిల్లతో కొడుకును కన్న తండ్రికాని తండ్రి, "ఎలాగూ పుట్టాడుగా, కళ్ళు మూసుకుని ఇదే కొనసాగిద్దాం" అనుకున్నట్లున్నారు పాపం.! పిల్లోడు పుట్టాక కూడా ఆ పసిదానికి శారీరక సుఖం (వేదన) తగ్గలేదు కదా ఇంకా హెచ్చయింది. మరొక రెండుసార

వెనకొచ్చిన కొమ్ములు!

అప్పుడప్పుడు - "హిందు నాగరికతకు కనీసం పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వస్తుందంటే ఇదెంత గొప్పదో ఆలోచించండి. ఇలాంటి గొప్ప సంస్కృతి తప్పుడుదని నిన్నగాక మొన్నొచ్చిన ఎడారి మతాలు వంకలు పెడుతున్నాయి" అని కొందరు హిందువులు చేసే వ్యాఖ్యలు మనందరికీ సుపరిచితమే. ఫ్యాషన్ ఇండస్ట్రీలో - "కొత్తొక వింత, పాతొక రోత" అనే సామెత ఒకటుంది.  మన తెలుగులో - "వెనక మొలిచిన కొమ్ములొచ్చి ముందు పెరిగిన చెవుల్ని వెక్కిరించాయి" అనే సామెత కూడా ఉంది. పైరెండు సామెతలూ ఈ ఎడారి మతాలకు సరిగ్గా నప్పుతాయి. సరే, ఇదంతా వదిలేద్దాం! అసలు నిన్నగాక మొన్నొచ్చిన ఈ ఎడారి మతాలు చరిత్రను ఎలా చూస్తాయో చూద్దాం... క్రీస్తిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని క్రైస్తవులు "హీథేన్డోమ్" అంటారు. మహ్మదీయిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని మహ్మదీయులు "జాహిలియత్" అంటారు. అనగా - 'అనాగరికులైన హీనులైన గౌరవం ఇవ్వజాలని దౌర్భాగ్యులైన మూర్ఖ విగ్రహారాధకుల రాజ్యం' అని అర్థం.  దీనికి ప్రతిగా క్రైస్తవులు "క్రిస్టన్డోమ్"ను స్థాపించాలనీ, మహ్మదీయులు "దార్ ఉల్ ఇస్లాం

మానసికస్థితి | మరణం & గౌరవం

కొన్ని రోజుల క్రితం చైనీస్ వైరస్ వలన చనిపోయిన హిందువుల దహన కార్యక్రమాలను కొన్ని జాతీయ & అంతర్జాతీయ పత్రికల ముఠాలు చాలా నీచంగా ప్రదర్శించాయి. ఇవి చూసినంతసేపూ నాకు వారు పొందిన పైశాచిక ఆనందం కనిపించింది. నేను వ్యక్తిగతంగా చాలా చింతించాను. నాలో మొదలయ్యిన "మరణించిన వ్యక్తులకు మనం కనీస గౌరవం ఇవ్వలేని దౌర్భాగ్య సమాజంలో ఉన్నామా?" అనే భావోద్వేగం క్రమేణా ఈ వ్యాసంగా రూపుదిద్దుకుంది. భారతీయ సంస్కృతి మరియు హిందూ నాగరికత ప్రకారం మరణం అనేది, ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని వెతుక్కునే ప్రక్రియ. అలా వెతుక్కునే ఆత్మ యొక్క పూర్వపు జన్మకు సంబంధించిన అన్ని వస్తువులను దహనం చేయడం కొన్ని సాంప్రదాయాలకు మరియు జాతులకు ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం, పరంపర. ఈ ఆచారానికి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాష్యం చెబుతూ ఉంటారు, కొంతమంది దీనికి సైన్స్ ను కూడా జోడిస్తూ ఉంటారు, మరికొందరైతే ఈ ఆచారానికి ఎండు తాటాకులు కట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. నేను సైన్స్ కు దాని అర్హతకు మించిన ప్రాధాన్యం ఇవ్వను. కనుక, ఈ ఆచారం వెనుక ఉన్న తాత్వికతను మరియు బ్రతికి ఉన్న వారిగా చనిపోయిన వారి శరీరాలతో మనం వ్యవహరించాల్సిన కనీస

కథాకేళి 02 - అతనితో ఒక రాత్రి!

అతనితో ఒక రాత్రి.! జాబిలమ్మ వెలుగులో, చల్లగాలి హాయిలో, ఆరుబయట వనంలో, అద్దాలమేడ లాంటి ఊహల్లో అతనితో గడిపాను ఆ రాత్రి. అతని కళ్ళలో ఏదో తెలియని కొరత, ఎవరికోసమో ఆగని వెతుకులాట, ఎవరినో కలవాలనే ఆత్రుత, కంటికి కనిపించని అశ్రువులు నాకు కనిపించాయి. అతని ముఖంలో అంతులేని ఆవేదన ఏదో ఉంది, ఆప్యాయత తరగని భావం ఉంది, అనురాగం నిండిన అతని చూపులు నా మనసు పొరల్లో దాగున్న ప్రేయసిని తట్టిలేపాయి. అతని బాధను చూడలేకపోయాను. అతని కళ్ళలోకి ఆరాధనగా పరికించి చూశాను, అతన్ని కామించాను, కవ్వించాను, మనసుని రెచ్చగొట్టాను. చివరికి అతన్ని ఈలోకంలోకి తీసుకువచ్చాను. అతని చేతిని తీసుకుని నా భుజమూ స్థనమూ కలిసిన జంగమస్థానం పైన అదిమాను, అతని మరొక చేతిని నాభికీ పిరుదులకూ మధ్య ఉన్న నడుముపై ఆనించాను. ప్రాణం వచ్చినట్లు అతను చిరునవ్వు నవ్వాడు, ఏదో తెలియని వెలితితో... ఆ నవ్వులో ఎంతో ప్రేమ దాగుంది. అది ఎవరికోసమో నాకు తెలీదు కానీ నాకోసమైతే మాత్రం కాదు, అనే స్పృహ ఉంది నాకు. కానీ అతని నవ్వుల పాలసముద్రంలో నన్ను నేను మైమరచిపోయాను, అందులో ఓలలాడే కలువనవ్వాలని ఆశపడ్డాను. నాలో ప్రేమ కోరికలు అదుపుతప్పాయి, అతనికి నా కళ్ళతోనే సైగ చేశాను, నా మనసున ఉ

కథాకేళి 01 - బీటలువారిన గోడ

విక్రమశకం 2078, శ్రావణ శుక్లపక్షం ఎన్నో దశాబ్దాల నుండి రాజదుర్గాన్ని (కోటను) రక్షిస్తూ వస్తున్న బలిష్టమైన ప్రహరీగోడలో కాలానుగుణంగా కలిగే మార్పుల వలన చిన్నచిన్న పగుళ్ళు రావడం మొదలయ్యాయి. ఎక్కడినుండి వచ్చిందో తెలియదు, ఒక కాకి తన ముక్కుకు చిన్నపాటి విత్తనాన్ని ఒకదాన్ని గోడలో వచ్చిన పగుళ్ళలో విడిచింది. "ఏ చెట్టు విత్తనానివే నువ్వు, నా దగ్గరికి వచ్చావు? నేనెవరో తెలిసే ఇంత సాహసం చేశావా?" అని ఆ ప్రహరీగోడ విత్తనాన్ని గద్దించింది. దీనికి ఆ విత్తనం "ఇందులో నా తప్పు ఏమీలేదు, కాకి ఆహారం తినేసమయంలో దాని ముక్కుకి నన్ను కరుచుకుని, ఇక్కడ విడిచింది" అని సమాధానం ఇస్తూ, "ఇంతపెద్ద రాజదుర్గానికి రక్షణ కల్పిస్తున్నావు. పిసరంత కూడా లేను నేను, బయట నా ప్రయాణానికి భద్రతలేదు, నాకు కూడా ప్రాణహాని లేకుండా కాపాడవూ..." అంటూ ప్రాధేయపడింది. ఆలోచనలో పడ్డ ప్రహరీగోడ, "ఇంత చిన్న విత్తనం నన్నేమి చేస్తుందిలే, అయినా నా స్వలక్షణం ప్రకారం శరణు కొరినవారికి రక్షణ ఇవ్వడం నా విధి, కర్తవ్యం మరియు ధర్మం" అని తనలో తాను సమాధానం చెప్పుకొని, ఆ విత్తనానికి కొంత చోటిచ్చింది మన పరోపకారి ప్రహరీగోడ. రో